మన్నెగూడెం రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టు
నెన్నెల: జిల్లాలోని పలు మండలాల్లో గాలివాన బుధవారం బీభత్సం సృష్టించింది. నెన్నెల మండలంలో బలమైన గాలులు వీయడంతో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. మండల కేంద్రంలోని బ్రహ్మంగారి దేవాలయంలో ఉన్న షెడ్డు రేకులు ఎగిరిపడ్డాయి. గంటపాటు బలమైన గాలులు, వర్షానికి లంబాడితండా సమీపంలో నాలుగు స్తంభాలు పడిపోయాయి. మన్నెగూడం రోడ్డుకు అడ్డంగా చెట్ల కొమ్మలు విరిగి వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ కాసారాలు విరిగిపోవడంతో సరఫరాకు ఎనిమిది గంటలపాటు అంతరాయం ఏర్పడింది. చిన్న, పెద్ద లంబాడితండాలలో ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ఎండవేడిమితో అల్లాడిన జనం వర్షం కారణంగా వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు.
కూలిన ఇల్లు
వేమనపల్లి: మండలంలోని గొర్లపల్లి కొత్తకాలనీలో ఆవుల శంకర్‌కు చెందిన ఇల్లు నేలకూలింది. ఆ సమయంలో ఆయన భార్య యశోద బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. టీవీ, కుర్చీలు, టేబుళ్లు, వంట సామగ్రి ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.
విరిగిన చెట్లు
భీమిని: కన్నెపల్లి, భీమిని మండలాల్లో బుధవారం గాలివాన బీభత్సంతో పలు ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. రెబ్బెన, వీగాం గ్రామాల్లో వర్షానికి చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రెబ్బెన గ్రామంలోని పురంశెట్టి పెంటయ్య, సుధాకర్ ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. పలు చోట్ల చెట్లు నేలకొరిగి విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment