
పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
మంచిర్యాలక్రైం: పోలీసులు ప్రజలకు జవాబు దారీగా ఉండాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఆయన సందర్శించారు. సిబ్బందితో సమావేశమై జిల్లా కేంద్రంలో నేరాలు, నియంత్రణ చర్యలపై సమీక్షించారు. పట్టణ శివారు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, గంజాయి సేవించడం, పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాల ని సూచించారు. పట్టణంలో రాత్రి 10.30గంటల తర్వాత మద్యం దుకాణాలు, హోటళ్లు, బార్లు, వ్యాపార సముదాయాలు, టీ స్టాళ్లు మూసి వేయించాలని తెలిపారు. రాత్రివేళ బ స్టాండ్, రైల్వేస్టేషన్, లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించాలని, అనుమానిత వ్యక్తుల వివరాలు సే కరించాలని తెలిపారు. ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, కిరణ్‌కుమార్, వినీత, సిబ్బంది పాల్గొన్నారు.