అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ఉండాలి
మంచిర్యాలక్రైం: అగ్ని ప్రమాదాల నివారణపై అందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం కలెక్టర్ తన చాంబర్‌లో జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్‌రెడ్డితో కలిసి వాల్‌పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించి సురక్షిత భారతాన్ని నిర్మాద్దామని అన్నారు. రోజువారీగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.


