
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
ప్రతీయేటా 3,500 మందికి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. వేలాది మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హులు చాలామంది ఉన్నారు. నాలుగేళ్లకు సరిపడా అర్హులను గుర్తించి, వారిలో అత్యంత పేద వారికి ఏడాది చొప్పున ఇళ్లను మంజూరు చేస్తుండాలి. రాజీవ్ యువ వికాస్ కోసం నిరుద్యోగులు వేలాదిగా దరఖాస్తు చేస్తున్నారు. నియోజకవర్గంలోని 10 వేల మందికి వెంటనే మంజూరు చేయాలి. అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలిచారు. ప్రజలు సహకరించడంతోనే నేను ఎమ్మెల్యేగా గెలుపొందాను. కన్నతల్లి రుణం తీర్చుకోలేనిది.. ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎంత దూరమైనా వెళ్లి అభివృద్ధి పనులు చేస్తాను. 76 ఏళ్లుగా ఉమ్మడి జల్లాకు అన్యాయం జరగింది. ఆదివాసీల గొంతుకగా మారిన నన్ను పార్టీ విస్మరించదని భావిస్తున్నాను.
– కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు,
మంచిర్యాల ఎమ్మెల్యే