
రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
నెన్నెల: మండలంలోని మైలారం మత్తడి వాగు నుంచి అనుమతి లేకుండా బెల్లంపల్లికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను జోగాపూర్ వద్ద పట్టుకున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశామన్నారు. యజమానులు గడ్డం సాయికుమార్, కొమ్ము రాజన్న, డ్రైవర్లు పసుల రవీందర్, అత్తి సాయిలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.