
నిధులున్నా నిరుపయోగమే..
● టెండర్‌కు నోచుకోని మినీ స్టేడియం ● ప్రభుత్వ భూమి కేటాయించినా ప్రయోజనం శూన్యం ● క్రీడలకు దూరమవుతున్న యువత
బెల్లంపల్లి: బెల్లంపల్లి కేంద్రంగా ప్రతిపాదించిన మినీస్టేడియం నిర్మాణానికి నోచుకోవడం లేదు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత కారణంగా ముందడుగు పడడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికో మినీస్టేడియం ఏర్పాటుకు నిర్ణయించింది. బెల్లంపల్లిలో మినీస్టేడియం మంజూరు కోసం ప్రతిపాదనలు చేశారు. మున్సిపాల్టీ శివారు ఇంద్రానగర్ సర్వే నంబరు 170లో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని స్టేడియం ఏర్పాటుకు గుర్తించారు. మినీస్టేడియం మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నిర్మాణం మరుగున పడింది.
రూ.2.86 కోట్లు మంజూరు
మినీస్టేడియం నిర్మాణానికి రూ.2.86కోట్లు మంజూ రయ్యాయి. టెండర్ ప్రక్రియ జరగకపోవడంతో ని ర్మాణం దిశగా ముందడుగు పడలేదు. పిచ్చిమొక్కలతో నిండి ఉన్న ప్రతిపాదిత స్థలాన్ని చదును చే యించడంతో ఆటలకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. యువకులు అడపాదడపా వాలీబాల్, క్రికె ట్ ఇతర క్రీడలు ఆడుతున్నారు. ఆటలకు సౌకర్యాలు, క్రీడల నిర్వహణ లేక క్రీడాకారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మినీస్టేడియం కాగితాలకే పరిమి తమైంది. సింగరేణికాలరీస్ యాజమాన్యం నిర్మించిన బజార్ ఏరియాలోని తిలక్ స్టేడియం, ఏఎంసీ ఏరియా క్రీడా మైదానాల్లో క్రీడాకారులు, యువజనులు, విద్యార్థులు క్రీడలు సాధన చేస్తున్నారు.