స్టేడియం నిర్మాణమెప్పుడో..! | - | Sakshi
Sakshi News home page

స్టేడియం నిర్మాణమెప్పుడో..!

Published Thu, Apr 10 2025 12:11 AM | Last Updated on Thu, Apr 10 2025 12:11 AM

స్టేడ

స్టేడియం నిర్మాణమెప్పుడో..!

మంచిర్యాలటౌన్‌: జిల్లాలో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వివిధ క్రీడలు, అథ్లెటిక్స్‌లో రాణిస్తుండడంతో మంచిర్యాలలో స్టేడియం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ తెలంగాణ ఏర్పడక ముందు నుంచే ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎట్టకేలకు 2014లో వెయ్యి గజాల్లో మినీస్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.60 కోట్లు విడుదల చేసింది. బస్టాండ్‌ పక్కనే జిల్లా ప్రజాపరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలోని స్థలాన్ని కేటాయించారు. స్టేడియం పనులు చేపట్టి పిల్లర్లు వేస్తుండగా.. పాఠశాలకు చెందిన పేరెంట్స్‌ కమిటీ కోర్టుకు వెళ్లగా స్టే ఆర్డర్‌తో నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా మరోచోట స్థలాన్ని ఎంపిక చేయకపోవడంతో నిధులు మూలుగుతున్నాయి. పదేళ్లుగా స్టేడియం నిర్మాణానికి నోచుకోవడం లేదు. క్రీడాకారులు సాధన చేయడానికి సరైన మైదానాలు, స్టేడియం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించాలంటే జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఏదో ఒక పాఠశాలలో వసతి కల్పిస్తున్నారు. స్టేడియం నిర్మాణం పూర్తయితే క్రీడాకోర్టులు, క్రీడాకారుల బసకు అవసరమైన గదుల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది.

2014లోనే నిధులు మంజూరు

పలు కారణాలతో నిర్మాణానికి నోచుకోని వైనం

ఎమ్మెల్యే చొరవతో 12ఎకరాల స్థలం ఎంపిక

స్పోర్ట్స్‌ అథారిటీ నుంచి అనుమతులు ఆలస్యం

స్పోర్ట్స్‌ స్టేడియం దిశగా

జిల్లాలో కబడ్డీ, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, అథ్లెటిక్స్‌, హ్యాండ్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌ వంటి ఎన్నో క్రీడల్లో క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. క్రీడా మైదానాలు, స్టేడి యం లేకపోయినా రాణించడం గమనార్హం. ఖేలో ఇండియా సెంటర్‌ను జిల్లాకు కేటాయించగా, స్టేడియం లేకపోవడంతో తాత్కాలికంగా జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలోనే ఖేలో ఇండియా బాక్సింగ్‌ శిక్షణ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఖేలో ఇండియాలో భాగంగానే జిల్లాకు స్పోర్ట్స్‌ స్టేడియం మంజూరు కాగా, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు స్పోర్ట్స్‌ స్టేడియం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపారు. జిల్లా కేంద్రంలోని సాయికుంటలో 14 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించగా, అందులో రెండెకరాలు ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీకి, 12 ఎకరాలను స్పోర్ట్స్‌ స్టేడి యం కోసం కేటాయించారు. స్థలాన్ని కేటా యించి ఐదు నెలలు గడుస్తున్నా స్పోర్ట్స్‌ అథా రిటీ నుంచి స్టేడియం నిర్మాణం ప్రారంభించడంలో ఆలస్యం అవుతోంది. స్టేడియం నిర్మిస్తే అథ్లెటిక్స్‌ కోసం సింథటిక్‌ ట్రాక్‌, వాలీబాల్‌, హ్యాండ్‌బా ల్‌ కోర్టులు, ఇతర క్రీడల కో సం అవసరమైన ఏర్పాట్లకు అవకాశం ఉంది.

స్టేడియం నిర్మాణమెప్పుడో..!1
1/1

స్టేడియం నిర్మాణమెప్పుడో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement