దేశ రాజధాని ఢిల్లీలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దాదాపు గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులు బీభత్సంతో మెట్రో రైళ్లను నిలివేశారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 70 విమానాలను దారి మళ్లిస్తున్నట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు.