ఈదురుగాలుల బీభత్సం
నేలకూలిన వృక్షాలు.. తెగిపడిన విద్యుత్ వైర్లు
పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
సిటీబ్యూరో నగరంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. చెట్ల కొమ్మలు విరిగి పడటంతో వాటినీడలో పార్కిం గ్ చేసిన పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. శివారుల్లోని పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఆయా బస్తీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రామంతాపూర్ పరిధిలోని ఇందిరానగర్‌లో విద్యుత్ స్థంభాలు కూలిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ఫ్లెక్సీ బ్యానర్ విద్యుత్ తీగలపై పడ్డాయి. నెహ్రూనగర్, ఇందిరానగర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాలలో నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే విధంగా ఆర్కేపురం ప్రధాన రహదారిలో ఓ భవనం నిర్మాణానికి సపోర్టుగా ఏర్పాటు చేసిన కర్రలు ఈదురు గాలికి కూలి కారుపై పడటంతోధ్వంసమైంది. చంపాపేట్ డివిజన్ పరిధిలోని రాజీవ్‌శెట్టినగర్‌లో ఈదురు గాలికి డిస్ట్రిబ్యూషన్ విద్యుత్ లైన్ తెగిపడి ంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అంతే కాదు చంపాపేట్, సరూర్‌నగర్, హబ్సిగ ూడ, నాగోలు, వనస్థలిపురం, చంచల్‌గూడ, మలక్‌పేట్, మూసారంబాగ్, ఆస్మాన్‌ఘడ్, తదితర సబ్‌స్టేషన్లలోని ఫీడర్లు ట్రిప్పై విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక ఎల్‌బీనగర్, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, బంజారాహిల్స్, కుత్బుల్లాపూర్, రామంతాపూర్, తార్నాక, సికింద్రాబాద్, మెహిదీపట్నం, నాంపల్లి తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
రూ.వంద కోట్లు ఖర్చు చేసినా...
గ్రేటర్ పరిధిలో ఆరు సర్కిళ్లు ఉన్నాయి. 13 వేల కిలోమీటర్ల 11 కేవీ, 2500 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 3600 కిలోమీటర్ల ఎల్‌టీ లైన్లు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యత సెంట్రల్ బ్రేక్ డౌన్(సీబీడీ)విభాగం చూస్తుంది. ఇందు కోసం విద్యుత్ నియంత్రణ మండలి(ఈ ఆర్‌సీ) 2013-14 వార్షిక సంవత్సరానికి రూ.110 కోట్లు కేటాయించగా, 2015-16 వార్షిక సంవ త ్సరానికి రూ.120 కోట్లు కేటాయించి ంది. ఇందులో కేవలం ట్రీ కటింగ్ పనులకే రూ.40 కోట్లకుపైగా ఖర్చు చేస్తుంది. మరో 80 కోట్లకు పైగా లైన్ల పునరుద్ధరణకు ఖర్చు చేస్తున్నారు. ఒకసారి చెట ్లకొమ్మలు నరికిన తర్వాత మళ్లీ పెరిగే అవకాశం తక్కువ. కానీ అవే కొమ్మలను మళ్లీ మళ్లీ తొలగించినట్లు లెక్క చూపుతూ డిస్కం నిధులు స్వాహా చేస్తున్నారు. ఏటా ఈ ఖర్చు పెరుగుతున్నా..సరఫరా వ్యవస్థ మాత్రం ఏమాత్రం మెరుగుప డలేదు. ఆదివారం సాయంత్రం నగరంలో చిన్నపాటి ఈదురు గాలికే విద్యుత్ వైర్లు తెగిపడటాన్ని పరిశీలిస్తే డిస్ట్రిబ్యూషన్ లైన్ల వ్యవస్థ ఎంత అద్వానంగా ఉందో అర్థమవుతుంది. ఇక అత్యవసర సమయంలో వినియోగదారులకు అందుబాటులో ఉండాల్సిన స్థానిక విద్యుత్ అధికారులు తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.
25 సబ్‌స్టేషన్ల పరిధిలో....
ఆదివారం రాత్రి వర్షం, గాలుల కారణంగా నగరంలో 25 సబ్ స్టేషన్ల పరిధిలో సుమారు 100 ఫీడర్లలో దాదాపు గంటసేపు కరెంటు సరఫరా నిలిచిపోయింది.