
సాలూరు: నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆర్.పి. భంజ్‌దేవ్‌తో పాటు అర కు పార్లమెంటరీ అభ్యర్థి కిషోర్‌చంద్రదేవ్ గిరిజనులు కాదంటూ గిరిజన ఉద్యోగుల సంఘం న్యాయసలహాదారుడు రేగుమహేశ్వరరావు విడుదల చేసిన కరపత్రాలు హల్‌చల్ చేస్తున్నా యి. భంజ్‌దేవ్ తాత, తండ్రి ఒరియా క్ష త్రియగా ప్రభుత్వడాక్యుమెంట్లలో క్లియర్‌గా ఉందని, 1900 సంవత్సరం నుంచి 1979వరకు క్షత్రియగానే చూపుతున్నాయని పేర్కొన్నారు. అయితే 1979లో భంజ్‌దేవ్ కొండదొరగా కులధ్రువీకరణ పత్రంపొందారని, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను కరపత్రాల్లో పొందుపరిచారు. గిరిజనులకు కేటాయించిన నియోజకవర్గంలో అసలైన గిరిజనుడికే ఓటేయాలని కోరారు. అలాగే కిషోర్ చంద్రదేవ్ తాత క్షత్రియగా తెలిపే 1901 నాటి రికార్డుల నుంచి కిషోర్‌చంద్రదేవ్ 1 957 నాటి స్కూల్ రికార్డుల్లో కూడా క్ష త్రియగా నే ఉందని, వీరు చెప్పుకుంటున్న కొండరాజు కులం ఎస్టీ జాబితాలోనే లేదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment