సాలూరు: అటవీ ప్రాంతం నుంచి బయటికొచ్చిన ఓ కొండ చిలువ ఎనిమిది మేకలను మింగేసింది. మరో నాలుగు మేకలపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. సోమవారం ఉదయం గ్రామానికి చెందిన రాజు నిద్రలేచి చూడగా తన ఇంటి ఆవరణలో జరిగిన ఘోరాన్ని చూసి భయకంపితుడయ్యాడు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో అటవీ అధికారులకు వచ్చి కొండచిలువను పట్టుకుని వెళ్లారు.