రాజకీయాల్లోకొస్తా: తారకరత్న
సాలూరు: తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని, అయితే దానికి ఇంకా సమయం ఉందని సినీహీరో నందమూరి తారకరత్న అన్నారు. ఆదివారం ఆయన విజయనగరం జిల్లా సాలూరులో విలేకరులతో మాట్లాడారు. హరికృష్ణకు నందమూరి కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు.
ఫిట్‌నెస్ కోసమే తాను సన్నబడ్డానని, సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నా, అయితే సినిమాల కోసం మాత్రం కాదన్నారు. తాను నటించిన అలెగ్జాండర్ సినిమా ఈ నెలలో విడుదల కానున్నట్టు చెప్పారు. రెండేళ్లగా మంచి స్క్రిప్ట్ దొరక్క సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు.