సాలూరు (విజయనగరం జిల్లా) : సాలూరు మండలంలో గురువారం సుమారు రూ.40 వేలు విలువ చేసే మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలకేంద్రం లావుడువీధిలో బుచ్చిరాజు అనే వ్యక్తి ఇంటిలో రూ.25 వేల విలువైన మందుగుండు సామగ్రి, వడ్డివీధిలో మజ్జిశ్యామలమ్మ అనే మహిళ ఇంట్లో రూ.15 వేల విలువైన మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ మారుఫ్ తెలిపారు.