తిరువళ్లూరు: అక్రమంగా ఆంధ్రాకు తరలించడానికి సిద్ధంగా ఉంచిన 17 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలోని సెట్టిమేడు ప్రాంతంలో రేషన్ బి య్యాన్ని లారీలో తరలించడానికి సిద్ధంగా ఉంచినట్టు డీఎస్పీ సదాశివంకు రహస్య సమాచారం అందింది. డీఎస్పీ సూచన మేరకు ఇన్స్పెక్టర్ పూ మారన్ నేతృత్వం లోని పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు ని ర్వహించారు. తనిఖీల్లో అక్కడ అనుమానాస్పదంగా ఆగి ఉన్న లారీని పరిశీలించగా అందులో రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు.
విచారణలో బియ్యానికి సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ రాకపోవడంతో లారీ యజమాని సెల్వకుమార్ను అరెస్టు చేసిన పోలీసులు లారీని సీజ్ చేశారు. ఈ సంఘటనపై డీఎస్పీ సదాశివం మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా బియ్యాన్ని తరలించే వారిపై నిఘా ఉంచుతామని డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రస్తుతం 17 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్టు వివరిస్తూ అధికారుల ఆదేశం మేరకు వాటిని ఫుడ్సెల్ గోదాములో అప్పగించినట్టు డీఎస్పీ తెలిపారు.
17 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
Published Fri, Nov 11 2016 3:52 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement