రేషన్‌ బియ్యం విక్రయిస్తోన్న వ్యక్తి అరెస్ట్‌ | Ration rice seller arrested in Hyderabad | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం విక్రయిస్తోన్న వ్యక్తి అరెస్ట్‌

Published Thu, Jun 22 2017 7:48 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

Ration rice seller arrested in Hyderabad

సుల్తాన్‌బజార్‌(హైదరాబాద్‌సిటీ) : అక్రమంగా రేషన్‌బియ్యం విక్రయిస్తున్న వ్యక్తిని గురువారం సుల్తాన్‌బజార్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ శివశంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌జిల్లా మసాన్‌పల్లికి చెందిన ఎం.కిషన్‌ (39) ఇసామియా బజార్‌లోని ఓ రేషన్‌దుకాణంలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు.

ప్రజలకు చేరాల్సిన రేషన్‌ బియ్యాన్ని డీలర్‌ వద్ద రూ. 4ల చొప్పున కొనుగోలు చేసి రూ.15 నుంచి 20 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న టాస్క్‌పోర్స్‌ పోలీసులు కిషన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని సుల్తాన్‌బజార్‌ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement