- ఏపీ నుంచి చెన్నైకి రవాణా
- విశాఖవాసి సహా ఇద్దరు అరెస్ట్
చెన్నై: చెన్నైలో రెండు వేర్వేరు సంఘటనల్లో మొత్తం 295 కిలోల గంజాయి పట్టుబడింది. చెన్నై ఎగ్మూరు రైల్వేస్టేషన్‌లో 195 కిలోలు, టీపీసత్రం వద్ద మరో వంద కిలోల గంజాయిని రైల్వే పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి శిలా విగ్రహాలు అక్రమంగా రవాణా అవుతున్నట్లు పోలీసులు రహస్య సమాచారం అందింది. ఈ సమాచారంతో పోలీసులు మరింత అప్రమత్తమై ప్రయాణికులపై నిఘా పెట్టారు. అన్ని రైల్వేస్టేషన్లలో అనుమానిత ప్రయాణికుల లగేజీ తనిఖీలు సాగించారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి చెన్నై ఎగ్మూరు స్టేషన్‌కు ఒక రైలు చేరుకుంది. ఆ రైలు భోగీల్లో తనిఖీలు చేపట్టగా ఒక పెద్ద పార్శిల్ సంచిలో గంజాయిని గుర్తించారు.
ఆ సంచీని తీసుకువచ్చిన మధురై ఉసిలంపట్టికి చెందిన గోపాల్, విశాఖపట్టణంకు చెందిన ఉచ్చప్పన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రా నుంచే ఈ గంజాయిని సేకరించి చెన్నైలో విక్రయానికి తీసుకువచ్చినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, చెన్నై టీపీ సత్రం సమీపంలో మరో వంద కిలోల గంజాయి మంగళవారం పట్టుబడింది.
295 కిలోల గంజాయి స్వాధీనం
Published Tue, Jul 12 2016 7:56 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM
Advertisement
Advertisement