వైద్యుడి నిర్లక్ష్యం...బాలుడి మృతి
Published Sat, Sep 7 2013 5:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
సాలూరు,న్యూస్‌లైన్: వైద్యుడి నిర్లక్ష్యం ఓ పసివాడి ప్రాణాన్ని బలిగొంది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో బాలుడికి రకరకాల వైద్యపరీక్షలు నిర్వహించి సుమారు రూ.40 వేలు ఫీజు వసూలు చేసిన వైద్యుడు తమకు పుత్రశోకాన్ని మిగిల్చాడని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. బాలుడి మృతితో ఆగ్రహించిన బంధువులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి అందోళనకారులను శాంతింపజేశారు.
మలేరియా జ్వరంతో బాధపడుతున్న జమ్ము వినయ్‌కుమార్ (7)ను సాలూరు పట్టణంలో ఉన్న జ్యోతి ఆస్పత్రిలో తల్లిదండ్రులు జమ్ము రమణ,సత్యవతిలు గత శుక్రవారం చేర్చారు. ఆ బాలుడికి అన్ని రకాల వైద్య పరీక్షలు,ఎక్స్‌రేల పేరుతో తల్లిదండ్రుల నుంచి వైద్యుడు శివకుమార్ సుమారు రూ.40 వేలు వసులు చేశాడు. నాలుగవ తేదీన మంగళవారం బాబుకు బాగానే ఉంది ఇంటికి తీసుకు వెళ్లొచ్చని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు పాచిపెంట మండలం కోనవలస గ్రామానికి బాలుడిని తీసుకుని వెళ్లిపోయారు. అయితే బాలుడికి మళ్లీ జ్వరం అధికం కావడంతో డాక్టర్‌కు ఫోన్ చేశారు. ఆస్పత్రికి తీసుకురమ్మని వైద్యుడు సలహా చెప్పడంతో తీసుకువచ్చారు.
దీంతో వైద్యుడు మళ్లీ వైద్యపరీక్షల పేరుతో డబ్బులు తీసుకుని శుక్రవారం సాయంత్రం వరకు వైద్యశాలలో ఉంచి బాబుకు అరోగ్యం విషమించిందని మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకు వెళ్లాలని సూచించాడు. హాస్పిటల్ అంబులెన్స్ ఇచ్చి దానికి కూడా డబ్బులు వసూలు చేశాడు.అంబులెన్స్‌లో బాలుడిని తీసుకు వెళ్తు ండగా బూర్జివలస సమీపంలో ఓ సారి పరిశీలించగా బాబు అప్పటికే చనిపోయినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. ఇదే విషయాన్ని గజపతినగరం లోని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బాలుడి బందువులు సాలూరులో డాక్టర్‌ను నిలదీశా రు. వైద్యుడి నుంచి సమాధానం రాకపోవడంతో రాత్రి 10గంటల సమయంలో రోడ్డుపై బైఠాయిం చారు. పట్టణ ఎస్‌ఐ శ్రీనివాసరావుతో పాటు పాచిపెంట మాజీ ఎంపీపీ పిన్నింటి ప్రసాద్‌బాబు వచ్చి అందోళన కారులను శాంతింప జేశారు.
Advertisement
Advertisement