malaria fever
-
విషజ్వరాలూ ఆరోగ్యశ్రీలోకి..
సాక్షి, విశాఖపట్నం: సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియాతో పాటు విషజ్వర పీడితులకు కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం అందించనున్నట్లు ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. విశాఖ జిల్లాలో సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, వైద్యులతో మంగళవారం ఆయన ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. (చదవండి: ఉపాధ్యాయుడికి దేహశుద్ధి) రాష్ట్రవ్యాప్తంగా విశాఖ జిల్లాలోనే అత్యధిక మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 462 డెంగీ, 708 మలేరియా, 24 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయని తెలిపారు. లోతట్టు, నీటి నిల్వలున్న ప్రాంతాలు, దోమల లార్వా నిల్వ ప్రాంతాల్లో ప్రతిరోజూ శానిటైజేషన్ చేయడమే కాకుండా వైద్య శిబిరాలు నిర్వహించేలా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేశామని మంత్రి నాని చెప్పారు. అలాగే, ఐటీడీఏ పరిధిలోని పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులు, వైద్య పరికరాలు, పరీక్షలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హాట్‌స్పాట్ ప్రాంతాల గుర్తింపు విషజ్వరాలు, డెంగీ, మలేరియాతో పాటు సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్న ప్రాంతాలను ‘హాట్ స్పాట్’ ప్రాంతాలుగా గుర్తించి.. అక్కడే వైద్య సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆళ్ల నాని వెల్లడించారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో డెంగీ ప్రబలుతున్న ప్రాంతాల్లో నిరంతరంగా ఫాగింగ్, స్ప్రే చేయిస్తున్నామని, ఏజెన్సీలో దోమ తెరలు పంపిణీ ప్రక్రియను వేగవంతంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రజలు కూడా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: Bigg Boss 5 Telugu: జనాలను పిచ్చోళ్లను చేసిన లోబో, సిరి) -
కొండ దిగొచ్చినా... దక్కని ఫలితం..!
ఆ యువకుడు సంక్రాంతి పండగకని ఊరొచ్చాడు. అంతలోనే మలేరియా, పచ్చకామెర్ల వ్యాధి బారిన పడ్డాడు. గిరిజన గ్రామం కావడం, సకాలంలో వైద్యం అందక పరిస్థితి విషమించింది. ఇక చనిపోతాడని భావించిన తల్లిదండ్రులు చివరి ప్రయత్నంగా డోలీలో పట్టణానికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించింది. ప్రాణం పోయింది. ఆ యువకుడు పల్లపుదుంగాడ గిరిజన గ్రామానికి చెందిన నాగరాజు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం,శృంగవరపుకోట రూరల్: మండలంలోని దారపర్తి గిరిశిఖర పంచాయతీ పల్లపుదుంగాడ గిరిజన గ్రామానికి చెందిన జరత నాగరాజు(22) మలేరియా, పచ్చకామెర్ల వ్యాధితో కోమాలోకి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బంధువులు, గిరిజనులు తెలిపిన వివరాలు.. పచ్చకామెర్లు, మలేరియాతో బాధపడుతున్న నాగరాజు ఇక బతకడని భావించిన తల్లిదండ్రులు వారి బంధువులకు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఫోన్లలో సమాచారం ఇచ్చారు. నాగరాజు పరిస్థితి తెలుసుకున్న పెదనాన్న కుమారుడు, గిరిజన సంఘం నేత జె.గౌరీష్ వెంటనే డోలీ కట్టి తీసుకువస్తే ఆస్పత్రిలో చేర్పించి చివరి ప్రయత్నం చేద్దామని గట్టిగా చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు బీమయ్య, పెంటయ్యతో పాటు ఇతర బంధువులు డోలీ సాయంతో నాగరాజును మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు(సుమారు పది కిలోమీటర్లు నడిచి) ఉదయం ఎనిమిది గంటలకు కొండ దిగువన దబ్బగుంట వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో ఎస్.కోటలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి కోమాలో ఉన్న నాగరాజును తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పి విజయనగరం మహరాజా ఆస్పత్రికి రిఫర్ చేశారు. విజయనగరంలో మూడు గంటల పాటు చికిత్స పొందిన నాగరాజు అంతలోనే మృతి చెందాడని అన్నయ్య గౌరీష్ రోదిస్తూ చెప్పాడు. నాగరాజు రాజమండ్రిలో ప్రైవేటుగా పని చేసే వాడని, సంక్రాంతి పండగకొచ్చిన కొద్ది రోజులకే రోగంతో మంచం పట్టాడని తెలిపాడు. రోడ్డు లేకనే ఇలా.. దారపర్తి గిరిశిఖర పంచాయతీ పరిధి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకనే రోగాల బారిన పడిన గిరిజనులు మృత్యువాత పడే పరిస్థితులు తలెత్తుతున్నాయని గిరిజన సంఘం నాయకులు జె.గౌరీష్, ఆర్.శివ, మద్దిల రమణ తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా కొండపైన గల గిరిజన గ్రామాలకు కనీస రహదారులు ఏర్పాటు చేసే ఆలోచనను గత ప్రభుత్వాలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వమైనా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. -
ఏజెన్సీలో మలేరియా జ్వరాల విజృంభణ
పశ్చిమగోదావరి ,బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా జ్వరాలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ఒక్క వారంలోనే అంతర్వేదిగూడెం, దొరమామిడి పీహెచ్‌సీల పరిధిలో 3 మలేరియా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మలేరియా ప్రబరిల్లకుండా గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు చేపట్టారు. మండలంలోని కోర్సవారిగూడేనికి చెందిన గురుగుంట్ల మమత అనే 5 ఏళ్ల బాలిక మలేరియా బారిన పడింది. ఈమెకు అంతర్వేదిగూడెం పీహెచ్సీ పరిధిలో చికిత్స అందిస్తున్నారు. కెచ్చెల శ్రీనివాసరావు, పాయం నీరజ కూడా మలేరియా బారిన పడుతూ వైద్యం పొందుతున్నారు. కాగా బుధవారం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ పెద్దిరాజు ఆధ్వర్యంలో కోర్సవారిగూడెం, బూరుగువాడ, అంతర్వేదిగూడెం హాస్టల్లో స్ప్రేయింగ్ పనులు చేశారు. డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మురళీధర్ గ్రామాల్లో పర్యటించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగించారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్ప్రేయింగ్ పనులు చేయించుకోవాలని కోరారు. -
రాష్ట్రంపై మలేరియా పంజా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై ప్లాస్మోడియం ఫాల్సిపారం మలేరియా పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,475 మలేరియా కేసులు నమోదైతే.. అందులో 1,163 మందికి ఫాల్సిపారం మలేరియా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు శనివారం ప్రభుత్వానికి నివేదించాయి. ఫాల్సిపారం మలేరియా ఆఫ్రికా దేశాల్లో సాధారణమైనా, ఆసియా దేశాల్లో ప్రమాదకరంగా మారింది. మలేరియా మరణాల్లో అధికంగా ఫాల్సిపారం మలేరియా ద్వారానే జరుగుతాయి. ఈ మలేరియా ప్రధానంగా మెదడుపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. వేగంగా రక్తస్రావం అవడం, రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటివి జరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 12 ఏళ్ల చిన్న పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా భూపాలపల్లి జిల్లాలో 425 ఫాల్సిపారం మలేరియా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొత్తగూడెం జిల్లాలో 312 కేసులు, హైదరాబాద్‌లో 264 కేసులు, ఆసిఫాబాద్ జిల్లాలో 42 కేసులు రికార్డు అయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు గిరిజన ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. ఇటీవల వైవాక్స్ మలేరియా కూడా ప్రమాదకరంగా తయారైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో వైవాక్స్ మలేరియా కేసులు 312 నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్‌లో 114, భూపాలపల్లి జిల్లాలో 42, మేడ్చల్‌లో 25, కొత్తగూడెం జిల్లాలో 23, ఆసిఫాబాద్ జిల్లాలో 20, సంగారెడ్డి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదించింది. భారీగా డెంగీ కేసులు.. మరోవైపు రాష్ట్రంలో అధికంగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 15,058 మంది రక్త నమూనాలు సేకరిస్తే, అందులో 3,121 మందికి డెంగీ సోకినట్లు నిర్దారణ అయింది. అందులో ఒకరు చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 503 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లో 363, కొత్తగూడెం జిల్లాలో 357, ఆదిలాబాద్ జిల్లాలో 338, పెద్దపల్లి జిల్లాలో 217, మహబూబ్‌నగర్ జిల్లాలో 199, కరీంనగర్ జిల్లాలో 124 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. సరైన వైద్యం అందక చాలా మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు ఆస్పత్రులు పరీక్షల పేర్లు చెప్పి రోగుల నుంచి వేలకు వేలు పిండేస్తున్నాయి. ఎన్నికల విధుల్లో సిబ్బంది.. కిందిస్థాయిలో వైద్య ఆరోగ్య యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లోనే మునిగిపోయింది. ఫలితంగా గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడ చూసినా చెత్తా చెదారమే కనిపిస్తుంది. చెత్త ఊడ్చే సిబ్బంది నుంచి పై స్థాయి వరకు అందరినీ ఎన్నికల విధుల్లోనే ఉంచుతున్నారు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. అస్సాం పర్యటనకు అధికారులు.. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితా రాణా, డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సహా పలువురు అధికారులు వచ్చే సోమవారం నుంచి ఐదు రోజులు అస్సాంలో జరిగే ఒక సదస్సుకు వెళ్తుండటం విమర్శలకు తావిచ్చింది. ఒకవైపు సంబంధిత మంత్రి లక్ష్మారెడ్డి ఆపద్ధర్మంగా ఉన్నారు. కాబట్టి అధికారులే అంతా నడపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కీలకమైన అధికారులు టూర్లకు వెళితే రాష్ట్రంలో జ్వరాలు, కంటి వెలుగు వంటి వాటిని పర్యవేక్షించే కీలక అధికారే ఉండే అవకాశం లేదు. లోపించిన పరిశుభ్రత రాష్ట్రంలో పరిశుభ్రత లోపించింది. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఫలితంగా డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నెలలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్యులు తినడానికి కూడా సమయం దొరకడం లేదు. – డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం -
ఏజెన్సీకి మలేరియా.. పట్నానికి డెంగీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ జ్వరాలు విజృంభించాయి. వివిధ జిల్లాల్లో భారీ వర్షాలతో మలేరియా, డెంగీ జ్వరాలు తీవ్రమయ్యాయి. రెండు నెలలుగా డెంగీ జ్వరాలు అంతకంతకూ పెరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మలేరియా జ్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మలేరియా జ్వరాలతో కిటకిటలాడుతున్నాయి. పీహెచ్‌సీల్లో ప్రతి రోజూ మలేరియా కేసులు నమోదవుతున్నట్టు రంపచోడవరం, మారేడుమిల్లి, శ్రీశైలం తదితర ఐటీడీఏల్లో పనిచేస్తున్న వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో 135 వరకూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా గత నెల రోజుల్లో 2,800కు పైనే మలేరియా కేసులు నమోదయ్యాయి. ఏటా సీజన్ వచ్చేవరకూ ఎవరూ పట్టించుకోరని, తీరా జ్వరాలు మొదలయ్యాక వైద్య బృందాలు వచ్చి హడావిడి చేస్తారని అక్కడి పీహెచ్సీలలో పనిచేసే వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు లేకపోతే ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్) నుంచి కొనుగోలు చేయాలని చెబుతున్నారని, అయితే దీనివల్ల జాప్యం జరుగుతోందని అంటున్నారు. మలేరియా, డెంగీతోపాటు వర్షాలకు నీరు కలుషితమవడంతో ఎక్కువ మంది చిన్నారులు టైఫాయిడ్, న్యూమోనియా బారినపడుతున్నారని పేర్కొన్నారు. అదుపులోకి రాని డెంగీ పట్టణాల్లో ఇప్పటికీ డెంగీ జ్వరాలు అదుపులోకి రావడం లేదని స్వయానా ప్రజారోగ్య శాఖ చెబుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా మూడు నెలలుగా డెంగీ జ్వరాలు రోజురోజుకూ అధికమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రకాశం, తూర్పుగోదావరి, అనంతపురం, విశాఖ జిల్లాల్లో గత నెల రోజుల్లో 3 వేలకు పైగా డెంగీ కేసులు నమోదైనట్టు తేలింది. ఒక్క విశాఖçలోనే 900కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీబారిన పడ్డ బాధితులు ప్రభుత్వాస్పత్రులకు వెళ్తూ ఉంటే అక్కడి వైద్యులు సరిగా స్పందించడం లేదని, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తేనేమో ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయని రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ పిండుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ముందస్తు చర్యలు లేవు దోమకాటుతో వచ్చే జ్వరాలను ముందస్తు చర్యలు తీసుకుంటే నివారించే అవకాశం ఉంటుంది. కానీ చర్యలు తీసుకోలేదు. ఆరోగ్యశాఖలో మలేరియా విభాగమనేది ప్రత్యేకంగా ఉన్నా అది పడకేసింది. మలాథియాన్, పైరిథ్రిమ్ అనే ద్రావణాలను ప్రతి ఊళ్లో మురికి కాలువలు, నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాలు, డంపింగ్ ప్రాంతాల్లో పిచికారీ చేయాలి. కానీ అలా చేయలేదు. కనీసం పారిశుధ్య చర్యలు కూడా చేపట్టలేదు. దీంతో దోమలు విజృంభించాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడ గిరిజనులకు ఇవ్వాల్సిన దోమతెరలు అందరికీ అందలేదు. ప్రాణాధార మందులే కరువు పామ్ ఇంజక్షన్ అనేది ఎవరైనా పాయిజన్ (విషం) తీసుకున్నప్పుడు దానికి విరుగుడుగా ఇస్తారు. అట్రోపిన్, అడ్రినల్ ఇంజక్షన్లు సర్జరీ సమయంలో ఇస్తారు. వీటిని లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌గా పేర్కొంటారు. కానీ ఈ రెండు ఇంజక్షన్లు రెండు మాసాలుగా ఏజెన్సీ ఏరియాల్లోని పీహెచ్సీలలో లేవు. పారాసెట్మాల్ ఇంజక్షన్, డైసైక్లోమైన్ తదితర మందులూ లేవు. కళ్లలో వేసుకునే సిప్రోఫ్లాక్సిన్ డ్రాప్స్ లేవు. చిన్నారులకు దగ్గు వస్తే వేసుకోవడానికి ఆంబ్రోక్సిల్ సిరప్ లేదు. చర్యలు తీసుకుంటున్నాం పట్టణాల్లో ఇప్పటికీ డెంగీ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది ఎక్కువగా ఉన్న మాట నిజమే. ఇప్పటికే విజయనగరం జిల్లాలో ఎంటమలాజికల్ బృందం పనిచేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు అన్ని ప్రాంతాలకూ మందుల కొరత లేకుండా చూస్తున్నాం. –డా.గీతాప్రసాదిని, అదనపు సంచాలకులు, ప్రజారోగ్య శాఖ దోమకుట్టకుండా చూసుకోవాలి ఇంటి పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, టైర్లు, పాత బాటిళ్లు, కప్పులు ఇవన్నీ లేకుండా చూసుకోవడంతోపాటు వాటిలో నీళ్లు నిల్వ లేకుండా చేస్తే దోమలు వృద్ధి చెందవు. ముఖ్యంగా చిన్నారులకు దోమతెరలు వాడాలి. టైఫాయిడ్, న్యూమోనియా జ్వరాలూ ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాచి చల్లార్చిన నీళ్లు తాగడం, బాగా ఉడికించిన భోజనం తినడం మంచిది. – డా.వంశీధర్, చిన్నపిల్లల వైద్యులు, రిమ్స్, కడప -
మంచం పట్టిన మన్యం
►మలేరియా, జ్వరాలతో అడవి బిడ్డల ఆక్రందన ►రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య ►గ్రామాల్లో కానరాని వైద్య శిబిరాలు ►260 మలేరియా కేసుల నమోదు బుట్టాయగూడెం : ‘పశ్చిమ’ ఏజెన్సీ జ్వరం గుప్పిట్లో విలవిలలాడుతోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో సీజనల్ జ్వరాలతో పాటు మలేరియా, టైఫాయిడ్, కామెర్ల విజృంభిస్తున్నాయి. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేట్ హాస్పటళ్లలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్లో సుమారు 260 మలేరియా కేసులు, 33,140 జ్వరాలు కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అయితే ఇవి కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలో నమోదైన కేసులు మాత్రమే. ఏజెన్సీలోని మారుమూల కొండరెడ్డి గ్రామాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా నమోదైనట్టు తెలుస్తోంది. బుట్టాయగూడెం మండలం లోని మారుమూల ప్రాంతాలైన గొట్టాలరేవులో బాలికలు గురుగుంట్ల రోజా, గురుగుంట్ల ప్రగతి, బాలుడు కెచ్చెల రాజు మలేరియాతో బాధపడుతున్నారు. కెచ్చెల లక్ష్మి తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. కెచ్చెల రాజు దొరమామిడి ఆస్పత్రిలో వైద్యం పొందాడు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అతడిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కామవరానికి చెందిన వంజం నాగేంద్ర, అంజలి జ్వరాలతో బాధపడుతుం డగా, దాడి వీర్రాజు, మంగా దుర్గారావు జ్వ రంతో బుట్టాయగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో రెట్టింపు కేసులు నమోదవుతున్నాయని పలువురు చెబుతున్నారు.ఏజెన్సీలోని ప్రతి గ్రామంలోనూ జ్వర పీడితులు కనిపిస్తున్నారు. పలు గ్రామాల్లో వైద్య శిబి రాలు లేవ ని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. చాపరాయి ఘటనతో.. తూర్పుగోదావరి జిల్లా చాపరాయి ఘటన తర్వాత అధికారులు ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో సర్వేలు చేపట్టి జ్వరాల నివారణకు కృషి చేస్తున్నారు. అయినా మలేరియా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. వర్షాల వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడం, దోమలు బెడదతో వ్యాధులు ప్రబలుతున్నట్టు తెలుస్తోంది. రహదారులు అధ్వానం ఏజెన్సీలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 86 ఆరోగ్య ఉపకేంద్రాలు, బుట్టాయగూడెంలో మలేరియా కార్యాలయం ఉన్నాయి. ఏటా మలేరియా వ్యాప్తి చెందే సమస్యాత్మక 266 గ్రామాలను అధికారులు గుర్తించారు. పలు గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో కనీసం 108, 104 వాహనాలు కూడా వెళ్లడం లేదు. -
మేల్కోకుంటే ముప్పు తప్పదు!
♦ ప్రబలుతున్న మలేరియా జ్వరాలు ♦ ప్రతి ఆశ్రమ పాఠశాలల్లోనూ కనిపిస్తున్న బాధితులు ♦ ప్రతి ఆశ్రమంలోనూ వినిపిస్తున్న మూలుగులు ♦ సదుపాయాలు కల్పించడంలో సంక్షేమాధికారులు విఫలం ♦ ఎక్కడ చూసినా తాండవిస్తున్న అపారిశుద్ధ్యమే... సాలూరురూరల్: మండలంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా గిరి జన గురుకుల సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. కొత్తవలస గిరిజన గురుకుల బాలి కల పాఠశాలలో ఐదుగురు, మావుడి గురుకు ల పాఠశాలలో ఐదుగురు, మామిడిపల్లి గురుకుల పాఠశాలలో నలుగురు, తోణాం గురుకు ల పాఠశాలలో తొమ్మిది మంది, కురుకూటి పాఠశాలలో ఇద్దరు, కరాసవలస కేజీబీవీలో ఒకరు ఇలా ఏ విద్యాలయాన్ని పరిశీలించినా విద్యార్థులు జ్వరపీడితులుగానే కన్పిస్తున్నారు. కనీస సదుపాయాలు కరువు జ్వరాల బారిన పడిన విద్యార్థులకు వైద్యచికిత్స సంగతి పక్కన పెడితే కనీస సదుపాయాలు కల్పించడంలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా మావుడి గురుకుల పాఠశాలలో విద్యార్థుల దుస్థితి మరీ దారుణంగా ఉంది. చలిజ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులు పాఠశాల వరండాలో ఆరుబయట నేలపై పడుకుని ఉన్నారు. వారికి కనీసం మంచాలు కల్పించలేని పరిస్థితిలో అక్కడి అధికారులు ఉన్నారు. పాఠశాలల్లో అపారిశుద్ద్యం పెరిగిపోయి దోమల కారణంగా మలేరియా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. విద్యార్థులు తిని వదిలేసిన అన్నాలు పాఠశాల ఆవరణలోనే పారబోస్తున్నారు. వాటిపై ఈగలు... దోమలు విస్తరించి రోగాల వ్యాప్తికి కారణాలుగా మారుతున్నాయి. ఇప్పుడే మేల్కోవాలి సీజన్ ప్రారంభంలోనే జ్వరాలు ఇలా ప్రబలుతుంటే రా నున్న కాలంలో ఈ తీవ్రత ఎంత హెచ్చుగా ఉంటుందో అంచనా వేయవచ్చు. జిల్లా అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థినీ విద్యార్థులకు సరైన చికిత్స, వైద్య సదుపాయాలు అందించి జ్వరాలు మరింతగా ప్రబలకుండా కనీస చర్యలు చేపట్టాలి. లేకపోతే ఈ ఏడాదీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కొత్తవలస, మావుడి, మామిడిపల్లి, కరాసవలస కేజీబీవీ పాఠశాలల్లో స్థానిక వైద్యసిబ్బంది విద్యార్థినీ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపూతలు సేకరించి పరీక్షలకు పంపించారు. ఇప్పటికే పలువురికి మలేరియా పాజిటివ్ నివేదికలు వచ్చాయి. వారికి అవసరమైన మందులు అందించారు. కొత్తవలస, కరాసవలస పాఠశాలల్లో ఏసీఎం–5 ద్రావణాన్ని పిచికారి చేశారు. ఇక పాఠశాలలపై నిరంతర నిఘా పెట్టి సమూలంగా వ్యాధులను నయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మలేరియా జ్వరాల నివారణకు చర్యలు
మలేరియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి సైదాపురం: జిల్లాలో ప్రబలిన మలేరియా జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా మలేరియా నివారణాధికారి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. సైదాపురం ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మండలంలోని పోతేగుంట గ్రామంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సైదాపురం, డక్కిలి, రాపూరు, ఉదయగిరి ప్రాంతాల్లో మలేరియా బాధితుల సంఖ్య పెరిగిందన్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది జ్వరాలు విపరీతంగా ప్రబలాయన్నారు. మలేరియా జ్వరాల నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో మలేరియా నివారణకు సంబంధించి మందులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పు కారణంగా జ్వరాలు వ్యాపిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పారిశుద్ధ్యం చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వస్తున్న మలేరియా జ్వరాలతో పెద్ద ప్రమాదం లేదన్నారు. సరైన సమయంలో వైద్య పరీక్షలను చేయించుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట మండల వైద్యాధికారి పాల్ జాన్స్‌న్, సబ్యూనిట్ అధికారి మురళి ఉన్నారు. -
మలేరియా జ్వరంతో మహిళ మృతి
మంగపేట : ఏజెన్సీ పరిధిలోని మంగపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెంది న పుట్ట మల్లిక(30) మలేరియా జ్వరంతో గురువారం మృతి చెందింది. నాలుగు రోజు లుగా మల్లికకు జ్వరం వస్తుండంతో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో చూపించగా వైద్యులు మలేరియా జ్వరంగా గుర్తించి మందులు అందించి ఇంటికి పంపించారు. మళ్లీ జ్వరం తీవ్రం కావడంతో ఏటూరునాగారం ఆస్పత్రికి తీసుకురాగా చికిత్స పొం దుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మలేరియా జ్వరంతో మహిళ మృతి
నల్గొండ జిల్లా రామన్నపేట మండలం జనంపెల్లిలో ఓ మహిళ మలేరియా జ్వరంతో మృతి చెందింది. గ్రామానికి చెందిన వరికుప్పల ఆండాలు(53) గురువారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. జనవరి 31న ఇదే కుటుంబానికి చెందిన రామ చంద్ర అనే వ్యక్తి సైతం మలేరియా జర్వంతోనే మృతి చెందారు. వారం రోజుల్లోనే ఇద్దరు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో.. గ్రామంలో విషాదం నెల కొంది. -
వైద్యుడి నిర్లక్ష్యం...బాలుడి మృతి
సాలూరు,న్యూస్‌లైన్: వైద్యుడి నిర్లక్ష్యం ఓ పసివాడి ప్రాణాన్ని బలిగొంది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో బాలుడికి రకరకాల వైద్యపరీక్షలు నిర్వహించి సుమారు రూ.40 వేలు ఫీజు వసూలు చేసిన వైద్యుడు తమకు పుత్రశోకాన్ని మిగిల్చాడని బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. బాలుడి మృతితో ఆగ్రహించిన బంధువులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి అందోళనకారులను శాంతింపజేశారు. మలేరియా జ్వరంతో బాధపడుతున్న జమ్ము వినయ్‌కుమార్ (7)ను సాలూరు పట్టణంలో ఉన్న జ్యోతి ఆస్పత్రిలో తల్లిదండ్రులు జమ్ము రమణ,సత్యవతిలు గత శుక్రవారం చేర్చారు. ఆ బాలుడికి అన్ని రకాల వైద్య పరీక్షలు,ఎక్స్‌రేల పేరుతో తల్లిదండ్రుల నుంచి వైద్యుడు శివకుమార్ సుమారు రూ.40 వేలు వసులు చేశాడు. నాలుగవ తేదీన మంగళవారం బాబుకు బాగానే ఉంది ఇంటికి తీసుకు వెళ్లొచ్చని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు పాచిపెంట మండలం కోనవలస గ్రామానికి బాలుడిని తీసుకుని వెళ్లిపోయారు. అయితే బాలుడికి మళ్లీ జ్వరం అధికం కావడంతో డాక్టర్‌కు ఫోన్ చేశారు. ఆస్పత్రికి తీసుకురమ్మని వైద్యుడు సలహా చెప్పడంతో తీసుకువచ్చారు. దీంతో వైద్యుడు మళ్లీ వైద్యపరీక్షల పేరుతో డబ్బులు తీసుకుని శుక్రవారం సాయంత్రం వరకు వైద్యశాలలో ఉంచి బాబుకు అరోగ్యం విషమించిందని మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకు వెళ్లాలని సూచించాడు. హాస్పిటల్ అంబులెన్స్ ఇచ్చి దానికి కూడా డబ్బులు వసూలు చేశాడు.అంబులెన్స్‌లో బాలుడిని తీసుకు వెళ్తు ండగా బూర్జివలస సమీపంలో ఓ సారి పరిశీలించగా బాబు అప్పటికే చనిపోయినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. ఇదే విషయాన్ని గజపతినగరం లోని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బాలుడి బందువులు సాలూరులో డాక్టర్‌ను నిలదీశా రు. వైద్యుడి నుంచి సమాధానం రాకపోవడంతో రాత్రి 10గంటల సమయంలో రోడ్డుపై బైఠాయిం చారు. పట్టణ ఎస్ఐ శ్రీనివాసరావుతో పాటు పాచిపెంట మాజీ ఎంపీపీ పిన్నింటి ప్రసాద్‌బాబు వచ్చి అందోళన కారులను శాంతింప జేశారు. -
జ్వరాలతో విలవిల
పాడేరు/నాతవరం, న్యూస్‌లైన్: జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. వందలాది మంది మంచాన పడి అల్లాడుతున్నారు. వాతావరణంలో మార్పులతో ఈ ఏడాది మలేరియా జ్వరాల కన్నా విషజ్వరాల తీవ్రతే అధికంగా ఉంది. రోజుల తరబడి ఇవి అదుపులోకి రావడం లేదు. కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంటా మంచానపడి మూలుగుతున్నవారు కనిపిస్తున్నారు. కొరవడిన పారిశుద్ధ్యం, కలుషిత తాగునీటి కారణంగా దయనీయ దుస్థితి నెలకొంటోంది. ఏజెన్సీవాసులు ఇటీవల తడుస్తూనే వ్యవసాయ పనులు చేపట్టారు. వీరు ఉపయోగించే తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. గ్రామాల్లో పారిశుధ్య సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఇవన్నీ గిరిజనుల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపాయి. అరకులోయ, పాడేరు ఏరియా ఆస్పత్రుల్లో రోజు వారి ఓపీ కూడా అధికంగా ఉంటోంది. విషజ్వరాల బాధితులే అధికంగా వస్తున్నారు. పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 566 మంది వచ్చి విషజ్వరాలకు వైద్యం పొందారు. జూలైలో 619 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 89 మందికి,ఆగస్టులో 690 మందికి ర క్తపరీక్షలు చేపట్టగా 86 మందికి టైఫాయిడ్‌గా గుర్తించారు. రెండు రోజుల్లో ఆరుగురు టైఫాయిడ్ బాధితులు పాడేరు ఆస్పత్రిలో చేరారు. చింతపల్లి, ముంచంగిపుట్టు కమ్యూనిటీ ఆస్పత్రుల్లోలకు కూడా మలేరియా కన్నా విషజ్వరాల పీడితులే ఎక్కువగా వస్తున్నారు. పాడేరు మండలం లింగాపుట్టు, ముంచంగిపుట్టు మండలం జబడ ల్లో పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. కొయ్యూరు మండలం డూనూరులో పలువురు మలేరియాతో బాధపడతున్నారు. మారుమూల తండాల్లో జ్వరాల తీవ్రత కారణంగా వైద్య ఆరోగ్యశాఖ ఏజెన్సీ అంతటా ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. నాతవరం మండలం ఊటమళ్ల, మాధవనగరం గ్రామాలను వారం రోజులుగా జ్వరాలు పీడిస్తున్నాయి. ఏటా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఇక్కడ మలేరియా జ్వరాలు విజృంభించడం పరిపాటి. ఊటమళ్లలో పి.సాయి (13) తీవ్ర జ్వరంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం చనిపోయింది. ప్రస్తుతం పల్లా నూకాలమ్మ, వి.వెంకటేశ్వర్లు, జంపా సింహాద్రి, జంపా భీమయ్య, కె.మల్లేశ్వరి, పి.కన్నయ్యమ్మ తీవ్ర జ్వరంతో ఇంటి వద్దే మంచాన పడి ఉన్నారు. మాధవనగరంలో నాలుగు రోజుల క్రింతం కె.లక్ష్మి (26)జ్వరంతో మృతి చెందింది. స్థానిక ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్లు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నా తగ్గుముఖం పట్టడం లేదు. నాతవరం పీహెచ్‌సీకి రెండేళ్లుగా వైద్యాధికారి లేరు. ఇన్‌చార్జియే దిక్కు. ఈ గ్రామాల్లో వైద్యులు పర్యటించిన సందర్భం నామమాత్రం. రెండు గ్రామాల్లోని దుస్థితిని తాండవ నిర్వాసిత కమిటీ అధ్యక్షుడు సిద్దాబత్తుల వెంకటరమణ మంగళవారం డీఎంహెచ్‌వో దృష్టికి తెచ్చారు. ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించాలని కోరారు -
జ్వరాలతో విలవిల
పాడేరు/నాతవరం, న్యూస్‌లైన్: జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. వందలాది మంది మంచాన పడి అల్లాడుతున్నారు. వాతావరణంలో మార్పులతో ఈ ఏడాది మలేరియా జ్వరాల కన్నా విషజ్వరాల తీవ్రతే అధికంగా ఉంది. రోజుల తరబడి ఇవి అదుపులోకి రావడం లేదు. కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంటా మంచానపడి మూలుగుతున్నవారు కనిపిస్తున్నారు. కొరవడిన పారిశుద్ధ్యం, కలుషిత తాగునీటి కారణంగా దయనీయ దుస్థితి నెలకొంటోంది. ఏజెన్సీవాసులు ఇటీవల తడుస్తూనే వ్యవసాయ పనులు చేపట్టారు. వీరు ఉపయోగించే తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. గ్రామాల్లో పారిశుధ్య సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఇవన్నీ గిరిజనుల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపాయి. అరకులోయ, పాడేరు ఏరియా ఆస్పత్రుల్లో రోజు వారి ఓపీ కూడా అధికంగా ఉంటోంది. విషజ్వరాల బాధితులే అధికంగా వస్తున్నారు. పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 566 మంది వచ్చి విషజ్వరాలకు వైద్యం పొందారు. జూలైలో 619 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 89 మందికి,ఆగస్టులో 690 మందికి ర క్తపరీక్షలు చేపట్టగా 86 మందికి టైఫాయిడ్‌గా గుర్తించారు. రెండు రోజుల్లో ఆరుగురు టైఫాయిడ్ బాధితులు పాడేరు ఆస్పత్రిలో చేరారు. చింతపల్లి, ముంచంగిపుట్టు కమ్యూనిటీ ఆస్పత్రుల్లోలకు కూడా మలేరియా కన్నా విషజ్వరాల పీడితులే ఎక్కువగా వస్తున్నారు. పాడేరు మండలం లింగాపుట్టు, ముంచంగిపుట్టు మండలం జబడ ల్లో పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. కొయ్యూరు మండలం డూనూరులో పలువురు మలేరియాతో బాధపడతున్నారు. మారుమూల తండాల్లో జ్వరాల తీవ్రత కారణంగా వైద్య ఆరోగ్యశాఖ ఏజెన్సీ అంతటా ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. నాతవరం మండలం ఊటమళ్ల, మాధవనగరం గ్రామాలను వారం రోజులుగా జ్వరాలు పీడిస్తున్నాయి. ఏటా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఇక్కడ మలేరియా జ్వరాలు విజృంభించడం పరిపాటి. ఊటమళ్లలో పి.సాయి (13) తీవ్ర జ్వరంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం చనిపోయింది. ప్రస్తుతం పల్లా నూకాలమ్మ, వి.వెంకటేశ్వర్లు, జంపా సింహాద్రి, జంపా భీమయ్య, కె.మల్లేశ్వరి, పి.కన్నయ్యమ్మ తీవ్ర జ్వరంతో ఇంటి వద్దే మంచాన పడి ఉన్నారు. మాధవనగరంలో నాలుగు రోజుల క్రింతం కె.లక్ష్మి (26)జ్వరంతో మృతి చెందింది. స్థానిక ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్లు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నా తగ్గుముఖం పట్టడం లేదు. నాతవరం పీహెచ్‌సీకి రెండేళ్లుగా వైద్యాధికారి లేరు. ఇన్‌చార్జియే దిక్కు. ఈ గ్రామాల్లో వైద్యులు పర్యటించిన సందర్భం నామమాత్రం. రెండు గ్రామాల్లోని దుస్థితిని తాండవ నిర్వాసిత కమిటీ అధ్యక్షుడు సిద్దాబత్తుల వెంకటరమణ మంగళవారం డీఎంహెచ్‌వో దృష్టికి తెచ్చారు. ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించాలని కోరారు