అంతర్వేదిగూడెంలో మలేరియా జ్వరంతో బాధపడుతున్న మమతకు వైద్యం చేస్తున్న దృశ్యం
పశ్చిమగోదావరి ,బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా జ్వరాలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ఒక్క వారంలోనే అంతర్వేదిగూడెం, దొరమామిడి పీహెచ్‌సీల పరిధిలో 3 మలేరియా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మలేరియా ప్రబరిల్లకుండా గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు చేపట్టారు. మండలంలోని కోర్సవారిగూడేనికి చెందిన గురుగుంట్ల మమత అనే 5 ఏళ్ల బాలిక మలేరియా బారిన పడింది. ఈమెకు అంతర్వేదిగూడెం పీహెచ్‌సీ పరిధిలో చికిత్స అందిస్తున్నారు. కెచ్చెల శ్రీనివాసరావు, పాయం నీరజ కూడా మలేరియా బారిన పడుతూ వైద్యం పొందుతున్నారు. కాగా బుధవారం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ పెద్దిరాజు ఆధ్వర్యంలో కోర్సవారిగూడెం, బూరుగువాడ, అంతర్వేదిగూడెం హాస్టల్‌లో స్ప్రేయింగ్ పనులు చేశారు. డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మురళీధర్ గ్రామాల్లో పర్యటించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగించారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్ప్రేయింగ్ పనులు చేయించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment