సాలూరు (విజయనగరం జిల్లా) : అక్రమంగా తరలిస్తున్న 15 బస్తాల గుట్కా, కైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండల కేంద్రానికి చెందిన డీఎంపీపీ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో శుక్రవారం సరుకును దించుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు లక్షా 80 వేలు ఉంటుందని ఎస్సై రామకృష్ణ తెలిపారు. స్పెషల్ టీం పోలీసుల సమాచారం మేరకు ఈ దాడులు జరిపినట్టు పేర్కొన్నారు.
సరుకును దించే దగ్గర దానికి సంబంధించిన వ్యాపారులు ఎవరూ లేకపోవడంతో అక్రమ దందా చేసేవారిని పట్టుకోలేక పోయామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. కచ్చితంగా అక్రమ రవాణాకు పాల్పడే వారిని పట్టుకుని తీరతామన్నారు. బొబ్బిలి, పార్వతీపురంకు చెందిని వ్యాపారులే ఈ రవాణాకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
15 బస్తాల గుట్కా, కైనీ పట్టివేత
Published Fri, Mar 4 2016 5:32 PM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM
Advertisement
Advertisement