కుందూనది నుంచి ఇసుక అక్రమ తరలింపు
ఇసుక టిప్పర్లను వదిలేయాలని పోలీసులపై తీవ్ర ఒత్తిడి
ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో కుందూనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 టిప్పర్లు, జేసీబీని రూరల్ పోలీసులు సీజ్ చేశారు. జేసీబీ సాయంతో పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు శుక్రవారం వేకువజామున దాడులు చేశారు.
8 టిప్పర్లు, జేసీబీని పోలీసులు సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించారు. సీజ్ చేసిన టిప్పర్లు, జేసీబీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి చెందినవిగా భావిస్తున్నారు. టిప్పర్లపైన ఎన్‌వీఆర్‌ఆర్ అని పెద్ద అక్షరాలతో పేర్లు వేయించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. టిప్పర్లు, జేసీబీని వదిలేయాలని పోలీసుల మీద తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది.
ఈ ప్రాంతంలో కొన్నిరోజుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. దాడుల్లో రూరల్ ఎస్‌ఐలు మహమ్మద్ రఫి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రెండు ఇసుక ట్రాక్టర్ల స్వా«దీనం పెన్నానది పరీవాహక ప్రాంతంలో రెండు ఇసుక ట్రాక్టర్లను రూరల్ పోలీసులు సీజ్ చేశారు. రామాపురం, పెద్దశెట్టిపల్లె గ్రామాల వద్ద ట్రాక్టర్లను స్వా«దీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment