Tippers
-
ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇసుక టిప్పర్లు సీజ్
ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో కుందూనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 టిప్పర్లు, జేసీబీని రూరల్ పోలీసులు సీజ్ చేశారు. జేసీబీ సాయంతో పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు శుక్రవారం వేకువజామున దాడులు చేశారు. 8 టిప్పర్లు, జేసీబీని పోలీసులు సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించారు. సీజ్ చేసిన టిప్పర్లు, జేసీబీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి చెందినవిగా భావిస్తున్నారు. టిప్పర్లపైన ఎన్‌వీఆర్‌ఆర్ అని పెద్ద అక్షరాలతో పేర్లు వేయించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. టిప్పర్లు, జేసీబీని వదిలేయాలని పోలీసుల మీద తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో కొన్నిరోజుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. దాడుల్లో రూరల్ ఎస్ఐలు మహమ్మద్ రఫి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రెండు ఇసుక ట్రాక్టర్ల స్వా«దీనం పెన్నానది పరీవాహక ప్రాంతంలో రెండు ఇసుక ట్రాక్టర్లను రూరల్ పోలీసులు సీజ్ చేశారు. రామాపురం, పెద్దశెట్టిపల్లె గ్రామాల వద్ద ట్రాక్టర్లను స్వా«దీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. -
ఇక ఒలెక్ట్రా ఈ–టిప్పర్స్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారత్‌లో తొలిసారిగా తయారు చేసిన 6్ఠ4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్స్కు హోమోలోగేషన్ ధ్రువీకరణ లభించింది. ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సర్టిఫికెట్ సాధించింది. రహదారులకు టిప్పర్ అనువైనదో లేదో తెలుసుకునేందుకు పర్వత ప్రాంతాలు, ఎత్తయిన ప్రదేశాలు, మైనింగ్, క్వారీల్లో పరీక్షలు చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. దేశంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్ హెవీ డ్యూటీ ఈ–టిప్పర్గా ఇది నిలిచిందని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. 20 ఈ–టిప్పర్ల సరఫరాకై ఒక సంస్థతో చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. వివిధ వేరియంట్లలో ఈ వాహనాన్ని విడుదల చేస్తామన్నారు. నిర్మాణం, మౌలిక సదుపాయాలు, మైనింగ్, క్వారీ రంగాల్లో ఇది గణనీయమైన మార్పును తేనుందని వివరించారు. -
టెన్షన్.. టెన్షన్; నది మధ్యలో.. నాలుగు గంటలు
నందిగామ: అదో ఇసుక రీచ్.. శుక్రవారం అర్ధరాత్రి.. ఇసుక తవ్వే జేసీబీలు.. నింపుకొనే టిప్పర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. నిరంతరాయంగా ఇసుక తవ్వుతూ, వాహనాల్లో నింపుతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నదిలో ప్రవాహం పెరిగింది.. కాసేపటికే వాహనాలను ముంచెత్తింది. పెద్ద సంఖ్యలో టిప్పర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు, సిబ్బంది నదిలో చిక్కుకుపోయి.. బిక్కుబిక్కుమంటూ గడిపారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని రక్షించారు. పులిచింతల ప్రాజెక్టు దిగువన ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బయటికెళ్లే మార్గం తెగిపోయి.. చెవిటికల్లు ఇసుక రీచ్ నుంచి రోజూ వందల వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. శుక్రవారం రాత్రి కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు ఇసుక లోడ్ చేసుకునేందుకు రీచ్‌కు వెళ్లాయి. ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి అర్ధరాత్రి సమయంలో నీటిని విడుదల చేశారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నదిలో ఒక్కసారిగా వరద పెరిగింది. ఆ సమయంలో నదిలో 132 టిప్పర్లు/లారీలు, నాలుగు ట్రాక్టర్లు, కొన్ని జేసీబీలు ఉన్నాయి. నది ప్రవాహాన్ని గుర్తించిన కొందరు డ్రైవర్లు, సిబ్బంది వెంటనే బయటికి వెళ్లగలిగారు. ఇంతలోనే నదిలోకి వేసిన తాత్కాలిక మార్గం కొట్టుకుపోయింది. దాంతో 123 మంది నదిలోనే చిక్కుకుపోయారు. వాహనాలన్నీ ఆగిపోయాయి. దీనిపై సమాచారం అందిన పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం ఉదయం 6.30 గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటలపాటు శ్రమించి నాటు పడవల సాయంతో 123 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వాహనాలన్నీ నదిలోనే ఉండిపోయాయి. తెగిపోయిన మార్గాన్ని పునరుద్ధరించి వాటిని బయటికి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. -
అన్లోడ్ చేస్తుండగా టిప్పర్‌కి విద్యుదాఘాతం..ముగ్గురు మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం కన్యకాపురంలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం కంకర టిప్పర్ లోడ్ ను అన్లోడ్ చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ మనోజ్ కుమార్ ముందుగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అతని రక్షించడానికి వెళ్లిన దొరబాబు, జ్యోతిష్కులు కూడా అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
జగన్నాథపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, పోడూరు: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని 108 వాహనాల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదసమయంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. మార్టేరు నుంచి పాలకొల్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పండిత విల్లూరుకు చెందిన ఆటోడ్రైవర్ డి. వెంకటేశ్వరరావు(40), కృష్ణా జిల్లా మూలలంకకు చెందిన ఈతకోట నాగరాజు మృతిచెందినట్టుగా గుర్తించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
టిప్పర్ల రవాణాతో రోడ్డు ధ్వంసం
అడ్డుకున్న జెడ్పీటీసీ వెంకటశేషయ్య వెంకటాచలం: మండలంలోని కసుమూరు పంచాయతీ వెంకటకృష్ణాపురానికి వెళ్లే రోడ్డు టిప్పర్ల రద్దీతో పూర్తిగా ధ్వంసమైపోతుంది. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో స్థానిక రైతులు జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య ఆధ్వర్యంలో శనివారం టిప్పర్లను అడ్డుకున్నారు. కసుమూరులోని బుచ్చిరెడ్డిచెరువు నుంచి రైల్వేలైన్ నిర్మాణ పనులకు మట్టి తరలింపునకు అధికారులు అనుమతులిచ్చారు. దీంతో కొన్ని రోజులుగా టిప్పర్లు షఫాబావి మీదుగా వెంకటకృష్ణాపురం గ్రామానికి వెళ్లే మట్టిరోడ్డుపై ఈ టిప్పర్లు తిరుతుండటంతో రోడ్డు అధ్వానంగా మారింది. ఈ రోడ్డుపై టిప్పర్లు తిరగనివ్వద్దని గ్రామస్తులు, రైతులు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో శనివారం జెడ్పీటీసీ వెంకటశేషయ్య అక్కడకు వెళ్లి టిప్పర్లును అడ్డుకున్నారు. మట్టిరోడ్డుపై 15 టన్నులకు పైగా బరువున్న టిప్పర్లు తిప్పడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. చెరువులో మట్టి తరలించిన వెంటనే రోడ్డు గురించి పట్టించుకోకుంటే ప్రజలు ఎలా తిరగాలని ప్రశ్నించారు. చెరువులో నుంచి మట్టి తరలించిన నిర్వాహకులతో అధికారులు రోడ్డును పటిష్ట పరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. -
టిప్పర్ల దూకుడు..
ధ్వంసమవుతున్న విద్యుత్ స్తంభాలు తెగిపోతున్న తీగలు, కరెంట్ బంద్ అన్నదాతల బెంబేలు తరచూ ఇలాంటి ఘటనలే.. వర్గల్: టిప్పర్ల దూకుడుతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. ఎప్పుడు ఏ విద్యుత్ స్తంభం నేలకూలుతుందోనని ఆందోళన చెందుతుందన్నారు. రోడ్డుకు ఓవైపు నుంచి రెండో వైపు వెల్తున్న కరెంట్ తీగలను (క్రాస్ లైన్) పట్టించుకోకుండా టిప్పర్ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. దీంతో తీగలు తెగి, స్తంభాలు విరిగిపోతున్నాయి. వర్గల్ మండలంలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో, విద్యుత్ సరఫరా నిలిచిపోయి రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. కొంత కాలం నుంచి ఆర్అండ్బీ శాఖ పర్యవేక్షణలో మజీద్‌పల్లి–శాకారం రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్డు మీద కంకర మిక్స్, మట్టి, మెటల్ తదితర సామగ్రి సరఫరా కోసం నిత్యం పెద్ద సంఖ్యలో టిప్పర్లు తిరుగుతున్నాయి. ఈ రోడ్డు మార్గంలో అనేక చోట్ల విద్యుత్ లైన్ క్రాస్ అవుతుంది. అభివృద్ధి పనుల కారణంగా రోడ్డు ఎత్తు క్రమంగా పెరుగుతున్నది. దీంతో కరెంట్ తీగల ఎత్తు తగ్గుతున్నది. టిప్పర్లు, జేసీబీలు కానీ హెడ్రాలిక్తో ట్రాలీని పైకి లేపకుండా జాగ్రత్తగా వెలితే కరెంట్ తీగలు వాహనానికి తగిలే పరిస్థితి ఉండదు. 15 రోజుల క్రితం గిర్మాపూర్ సమీపంలో టిప్పర్ ఇలాంటి పరిస్థితిలోనే విద్యుత్ తీగలను తాకింది. తీగలు తెగిపోవడంతోపాటు ఎనిమిది విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. ఈ ఘటన వల్ల ట్రాన్స్‌కోకు అనవసర నష్టం వాటిల్లడంతోపాటు, రెండు రోజులు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతుల బాధ పడలేక ట్రాన్స్‌కో అధికారులు యుద్ధప్రాతిపదికన స్తంభాలు పాతించారు. కరెంట్ తీగలు బిగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఈ ఘటన మరవక ముందే తాజాగా బుధవారం ఉదయం మరోసారి ఇలాంటి ఘటనే పునరావృతమైంది. మాదారం సమీపంలో వాహనం తాకిడికి కరెంట్ తీగలు తెగిపోగా, 11 విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. మాదారం, గిర్మాపూర్ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాట్లు ఆగిపోయాయి.. టిప్పర్ల కారణంగా విద్యుత్ స్తంభాలు విరిగిపోతున్నాయి. బుధవారం విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కరెంట్ పోయింది. గురువారం దాకా రాదని అధికారులు చెబుతున్నారు. కరెంట్ లేకపోతె నీళ్లు రావు. దీంతో నాట్లు ఆగిపోయాయి. – అంకని స్వామి, మాదారం, రైతు నిర్లక్ష్యంగా నడపడం వల్లే.. రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు ఎత్తులో తేడాలు వస్తాయి. రోడ్డు ఎత్తు పెరగడం వల్ల క్రాసింగ్ విద్యుత్ లైన్లు కిందికి దిగుతాయి. టిప్పర్లు, జేసీబీలు మామూలుగా వెళ్తే కరెంట్ తీగలు తగలవు. హైడ్రాలిక్‌తో ట్రాలీని పైకి లేపి ముందుకెళ్లిన సందర్భాల్లో తీగలు తాకి, స్తంభాలు విరిగిపోతాయి. పక్షం రోజుల్లో రెండుసార్లు 19 వరకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. తీగలు చూసుకోకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే ఇలా జరుగుతుంది. – రామ్‌నర్సయ్య, ట్రాన్స్‌కో, లైన్ఇన్స్పెక్టర్