varadarajula reddy
-
ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇసుక టిప్పర్లు సీజ్
ప్రొద్దుటూరు క్రైం: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో కుందూనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 టిప్పర్లు, జేసీబీని రూరల్ పోలీసులు సీజ్ చేశారు. జేసీబీ సాయంతో పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు శుక్రవారం వేకువజామున దాడులు చేశారు. 8 టిప్పర్లు, జేసీబీని పోలీసులు సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించారు. సీజ్ చేసిన టిప్పర్లు, జేసీబీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి చెందినవిగా భావిస్తున్నారు. టిప్పర్లపైన ఎన్‌వీఆర్‌ఆర్ అని పెద్ద అక్షరాలతో పేర్లు వేయించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. టిప్పర్లు, జేసీబీని వదిలేయాలని పోలీసుల మీద తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో కొన్నిరోజుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. దాడుల్లో రూరల్ ఎస్ఐలు మహమ్మద్ రఫి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రెండు ఇసుక ట్రాక్టర్ల స్వా«దీనం పెన్నానది పరీవాహక ప్రాంతంలో రెండు ఇసుక ట్రాక్టర్లను రూరల్ పోలీసులు సీజ్ చేశారు. రామాపురం, పెద్దశెట్టిపల్లె గ్రామాల వద్ద ట్రాక్టర్లను స్వా«దీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. -
పార్టీ కోసం ఇంత కష్టపడితే.. మాకిచ్చే గౌరవం ఇదేనా!
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం అసాధ్యమేనా? ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించడమే ఇందుకు కారణమా? పార్టీ ఆవిర్భావం నుంచి అంటి పెట్టుకుని ఉన్న తెలుగుతమ్ముళ్లను వేదనకు గురిచేస్తున్నారా? అనే ప్రశ్నలకు ఔను అనే విశ్లేషకులు సమాధానం ఇస్తున్నారు. విధేయతతో నిమిత్తం లేకుండా స్థాయిని బట్టి ఆపైనున్న నేతలు అణచివేస్తున్నారని పలువురు చెప్పుకొస్తున్నారు. వెరసి జిల్లాలో టీడీపీ కూసాలు కదులుతున్నాయి. అధినేత వైఖరిపై మండిపడుతూ జిల్లా నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తకు అదే జెండా అండగా ఉంటుందన్నది పాత మాట. కార్యకర్తల ఉన్నతి కాంక్షించే ఆ పార్టీలో ఇపుడు ‘పొడుగు చేతుల పందేరం’గా వ్యవహారం నడుస్తోందని సీనియర్ నేతలు వాపోతున్నారు. విధేయులు, అవకాశవాదులను ఓకే గాటన కట్టేస్తున్నారనే ఆవేదనతో రగలిపోతున్నారు. కష్టపడ్డ వారికి గుర్తింపు అటుంచితే ఏకంగా పార్టీ నుంచి వెళ్లగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. ఆవిర్భావం నుంచి టీడీపీని అంటిపెట్టుకున్న నేతలు సైతం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. గరం గరంగా మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి పదేళ్ల పాటు రాయచోటి నియోజకవర్గ ఇన్చార్జిగా, ఇరవై ఐదేళ్లు టీడీపీ నేతగా మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీలో సేవలందిస్తున్నారు. తాజాగా ఈమారు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వ్యక్తిగతంగా అధినేత చంద్రబాబుతో సమావేశపర్చమని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కోరినా ఫలితం లేకుండా పోయింది. దాంతో తీవ్ర ఆక్రోశానికి గురయ్యారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పార్టీ కోసం ఇంతకాలం సేవలు పొంది ఎన్నికలు సమీపించినపుడు మొండిచేయి చూపుతారా? కనీసం పర్సనల్‌గా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరా? ఇలాంటి పార్టీ కోసం తాను ఇంకా పనిచేయాలా అంటూ రమేష్‌రెడ్డి రగిలిపోతున్నట్లు సమాచారం. ఆ మేరకే మండలాలవారీగా నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులను వివరిస్తూ వారి మద్దతు కోరుతున్నారు. ఆయనకు లక్కిరెడ్డిపల్లె మండల టీడీపీ నాయకులు మూకుమ్మడిగా మద్దతు తెలిపారు. ఇన్చార్జి రమేష్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని అలా చేయని పక్షంలో తమ రాజీనామాలు స్వీకరించాలని ఆల్టిమేటం జారీ చేశారు. రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా నాయకుల మద్దతు కోరుతున్న రమేష్‌రెడ్డి సైతం ఇక ఉపేక్షించరాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అవసరమైతే జిల్లాలో టీడీపీ భూస్థాపితానికి శాయశక్తులా కృషి చేయాలనే దిశగా సన్నిహితులతో మంతనాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. లింగారెడ్డిని కనుమరుగు చేసిన అధిష్టానం ప్రొద్దుటూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీచేసిన మల్లెల లింగారెడ్డి ఒక్కసారి విజయం సాధించారు. అప్పటి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో తలపడుతూనే జిల్లా అధ్యక్షుడిగా పలుమార్లు సేవలందించారు. 2009లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈమారు ఆశావహుల్లో ఒకరైన నంద్యాల వరదరాజులరెడ్డి అభ్యర్థిత్వంపై ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. పార్టీలో చేరకుండానే టీడీపీ టికెట్ ఎలా అడుగుతారని నిలదీస్తూనే, ఆయనకే టికెట్ ఇస్తే పార్టీని నమ్ముకున్న తమలాంటి వారు సన్యాసం స్వీకరించాల్సి ఉంటుందని పరోక్ష హెచ్చరిక చేశారు. అంతే, ఏకంగా జిల్లా అధ్యక్ష పదవి నుంచి సైతం తప్పించారు. ఆ స్థానంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిని కూర్చోబెట్టారు. కష్టకాలంలో టీడీపీకి సేవలందించిన తనను తప్పించడాన్ని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి జీర్ణించుకోలేకున్నారు. సరైన సమయంలో స్పందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పుత్తాకు వీరశివా సెగలు కమలాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా పుత్తా నరసింహారెడ్డి పదహారేళ్లుగా కొనసాగుతున్నారు. మూడు పర్యాయాలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరోమారు ప్రజాతీర్పు కోరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి పుత్తాకు వీరశివా సెగలు తాకుతున్నాయి. తాజాగా మరోమారు కమలాపురం అభ్యర్థిత్వంపై ఐవీఆర్ ఫోన్ కాల్స్ రూపంలో ఇరువురు పేర్లపై టీడీపీ నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టడం విశేషం. ఈ వ్యవహారం వెనుక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రమేయం ఉన్నట్లు పుత్తా వర్గీయులు విశ్వసిస్తున్నారు. మూడు సార్లు పోటీ చేసి పార్టీ ఉన్నతి కోసం పనిచేస్తున్న తనని కాదని, అవకాశవాదుల్ని తెరపైకి తెస్తారా? అని పుత్తా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు, కడప, కమలాపురం నియోజకవర్గాల్లో శ్రీనివాసులరెడ్డి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆవేదనను తెలుగుతమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. కడప పార్లమెంటు, అసెంబ్లీ ఎక్కడి నుంచైనా సరే శ్రీనివాసులరెడ్డి కుటుంబం పోటీ చేస్తే, ఓడించాలనే దిశగా స్వంత అన్న రమేష్‌రెడ్డి సైతం మండిపడుతోన్నట్లు పలువురు చెప్పుకొస్తుండటం విశేషం. రెడ్యంకు దక్కని ప్రాధాన్యత మైదుకూరు నియోజకవర్గంలో రాష్ట్ర కార్యనిర్వాహక మాజీ కార్యదర్శి రెడ్యం సోదరుల పరిస్థితి కూడా పై వారికి భిన్నంగా ఏమీ లేదు. ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీలో సీనియారిటీ ఉన్న నాయకుల్ని కనుమరుగు చేయాలనే ఎత్తుగడల్లో భాగంగా వారిని పక్కకు తప్పిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేసిన రెడ్యం సోదరులకు పార్టీలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
మహిళా సబ్ రిజిస్ట్రారును బెదిరించిన టీడీపీ నేత
ప్రొద్దుటూరు : టీడీపీ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ రామలక్షుమ్మను బెదిరించారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వరదరాజులరెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సబ్ రిజిస్ట్రార్‌తో పాటు సిబ్బందిని బయటికి రావాలని బెదిరించారు. అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లోపలే ఉండి బయటికి రాలేనని బోరున విలపించారు. మీకూ ఆడ పిల్లలున్నారు కదా.. అని ఆమె ప్రాధేయపడ్డారు. రాజకీయాలతో తమకేం సంబంధం లేదని తెలిపారు. అయినా వినకుండా వరదరాజులరెడ్డి.. నువ్వు ఏడ్చినా వదిలేదిలేదు.. బయటకు రావాల్సిందే.. అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. విధిలేని పరిస్థితిలో సబ్ రిజిస్ట్రార్ ఏడ్చుకుంటూ బయటకొచ్చారు. మహర్షి స్కూల్ స్థలం రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వరద చెప్పినట్టు సబ్ రిజిస్ట్రార్ వినలేదు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటంతో సబ్ రిజిస్ట్రార్ దానిని రిజిస్టర్ చేయకపోవడంపై వరదరాజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో ఆస్తుల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి కప్పం కట్టాలా అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దాదాపు అరగంట పాటు విధులకు ఆటంకం జరిగి లావాదేవీలు నిలిచిపోయాయి. ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి ఏకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిని బెదిరించి విధులకు ఆటంకం కలిగించడమేంటని అక్కడివారు ప్రశ్నిస్తున్నారు. -
వరదరాజులరెడ్డిని అరెస్ట్ చేయండి
సాక్షి, అమరావతి : ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, గుంటూరు జిల్లా పొన్నూరు.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు డబ్బులు పంచుతూ.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కొండాపురంలో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మిదేవిని టీడీపీ సీనియర్ నేతలు మల్లికార్జున, ఉన్నం మారుతీచౌదరి, అనిల్ చౌదరి, పవన్ చౌదరి బెదిరించారు. కొండాపురం ఘటనలో టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. కొండాపురంలో బలవంతపు ఏకగ్రీవాన్ని ఎస్ఈసీ రద్దు చేయాలి. 45 ఏళ్లుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కామనూరులో బలవంతపు ఏకగ్రీవాలతో ఎన్నికలు జరగకుండా చేస్తున్నారు. బీసీ రిజర్వ్డ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షేక్ కరీమూన్‌ను వరదరాజులరెడ్డి బెదిరిస్తున్నారు. షేక్ కరీమూన్‌కు రక్షణ కల్పించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి. వరదరాజులరెడ్డిని అరెస్ట్ చేయాలి’’ అని విజ్ఞప్తి చేశారు. -
మాజీ ఎమ్మెల్యే ‘వరద’ కుమారుడు, అల్లుడిపై కేసు
ప్రొద్దుటూరు/హైదరాబాద్: ఒక డిగ్రీ కళాశాల స్థల వివాదానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి, అల్లుడు రామచంద్రారెడ్డితోపాటు మరో 15 మందిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మహిళల విద్య కోసం 1977లో స్థానిక అగస్తేశ్వర స్వామి ఆలయానికి చెందిన 18.18 ఎకరాల భూమిని దేవరశెట్టి ఆదిలక్షుమ్మ మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయించారు. నిబంధనల ప్రకారం.. ఈ భూమిని అమ్మకూడదు. అయితే కళాశాల నిర్వాహకులు ఇందులోని 11 ఎకరాలను అమ్మేందుకు మాజీ ముఖ్యమంత్రి సోదరుడొకరు చక్రం తిప్పారు. ఇందులో భాగంగా 2012 మార్చి 30న ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ స్థలం విలువ ప్రస్తుతం ఎకరా రూ.15 కోట్లకుపైగా ఉంది. ఇందులో రెండున్నర ఎకరాల స్థలం మిట్టా శివ గణేశ్‌కు ఉంది. ఇది వివాదంలో ఉండటంతో ఆయన ఇటీవల రామచంద్రారెడ్డిని సంప్రదించాడు. వివాదాన్ని పరిష్కరిస్తే ఎకరం స్థలాన్ని ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే మొత్తం రెండున్నర ఎకరాలు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కొండారెడ్డి, రామచంద్రారెడ్డితోపాటు వారి గన్మెన్లు, అనుచరులు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉంటున్న మిట్టా శివగణేశ్‌పై మంగళవారం దాడి చేశారు. చంపేస్తామని బెదిరించి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. ఈ మేరకు శివగణేశ్ వారిపై ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ఈ కళాశాల స్థలం అమ్మకంపై స్థానికులు కూడా కోర్టులో కేసు వేశారు. -
టీడీపీ భేటీకి ఎమ్మెల్సీల డుమ్మా
సాక్షి, కడప: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్ జిల్లా టీడీపీ నాయకులు షాక్ ఇచ్చారు. కడప నగరం రామాంజినేయపురంలోని సాయిశ్రీనివాస కళ్యాణ్ మండపంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి జిల్లా ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా గెలుపొందిన బిటెక్ రవి, శివనాథరెడ్డిలు సమావేశానికి హజరు కాలేదు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడైన శివనాథరెడ్డి కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు ప్రొద్దుటూరు నేత వరదరాజులు రెడ్డి, బద్వేలు విజయమ్మ, సుగవసి ప్రసాద్ అలాగే రాయచోటి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు, ఆయన వర్గీయులు సైతం టీడీపీ సమీక్షా సమావేశానికి గైర్హాజరయ్యారు. -
టీడీపీ కార్యాలయానికి నల్లజెండాలు కట్టి.. నిరసన!
సాక్షి, ప్రొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో టికెట్ల రగడ మొదలైంది. ఎమ్మెల్యే టికెట్‌ను లింగారెడ్డికి ఇవ్వడంతో.. వరదరాజులరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి అన్యాయం జరిగిందంటూ వరదరాజులరెడ్డి వర్గీయులు కూడా తమ నిరసన తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఫ్లెక్సీలను తొలగించారు. పార్టీ కార్యాలయానికి నల్లజెండాలు కట్టి తమ నిరసన తెలిపారు. ఐదేళ్లుగా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జిగా వరదరాజులరెడ్డి ఉండగా.. టికెట్‌ను లింగారెడ్డికి కేటాయించడంతో వరద వర్గీయులు అధిష్టానంపై మండిపడుతున్నారు. ఈ పరిణామాలతో వరదరాజులరెడ్డి ఆయన అనుచరులతో సమావేశమై చర్చలు జరిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కార్యకర్తలు, అభిమానుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని వరదరాజులరెడ్డి తెలిపారు. -
టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి
-
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, వైఎస్సార్: జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డి అనుచరులు బాహాబాహీకి దిగారు. రాజుపాలెం మండలం చిన్నశెట్టిపాలెంలో సాగునీటి మళ్లింపు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గానికి చెందిన కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి 50 లక్షల రూపాయల వ్యయంతో చిన్నశెట్టి పాలెంలో సాగునీటి కోసం పైపు లైన్ పనులు చేపట్టారు. అయితే అదే గ్రామానికి చెందిన వరదరాజులరెడ్డి అనుచరుడు నరసింహారెడ్డి తన పొలానికి నీటి మళ్లింపు కోసం పైపులు అమర్చడం గొడవకు దారితీసింది. ఘటన స్థలానికి చేరుకున్న పరిస్థితిని అదుపులో తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇరువర్గాలను పోలీసు స్టేషన్‌కు తరలించి సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే తెలుగు తమ్ముళ్లు పోలీసు స్టేషన్ బయట గొడవకు దిగారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో లాఠీ చార్జీ చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇరువర్గాలకు చెందిన నేతలు పలుమార్లు ఘర్షణకు దిగారు. -
నేను.. వరద కలిసి తిరగలేం
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : తాను, వరదరాజులరెడ్డి కలిసి తిరగాలంటే అది జరిగే పని కాదని మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి అన్నారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తాను, వరదరాజులరెడ్డి వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తోందన్నారు. ప్రొద్దుటూరులోనే కాకుండా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా చేసినంత మాత్రానా అది నియమాలను ఉల్లంఘించినట్టు కాదని తెలిపారు. గతంలో పార్టీకి ఇన్చార్జిగా వరదరాజులరెడ్డి ఉండేవారని, ఆ స్థానంలో సీఎం చంద్రబాబునాయుడు ఐదుగురితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కమిటీ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఇన్చార్జిని నియమించే వరకు సమన్వయ కమిటీ నేతృత్వంలోనే కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. వరదరాజులరెడ్డి, తాను కలిసి తిరగాలంటే అదిæ జరిగే పని కాదని.. కలుసుకోలేం కూడా అని అన్నారు. ఎవరి కార్యకర్తలు వారికి ఉంటారని, ఎవరేమి అనుకున్నా అది పొరపాటే అవుతుందని లింగారెడ్డి అన్నారు. అధిష్ఠానం ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటిస్తే అది వేరేవిషయమని, గతంలో వేర్వేరుగానే తిరిగామని, ఇప్పుడు కూడా అలానే తిరుగుతున్నామని లింగారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రొద్దుటూరు టీడీపీలో మళ్లీ విభేదాలు వరదరాజులరెడ్డికి ఇన్చార్జి పదవి లేదని లింగారెడ్డి చేసిన ప్రకటనతో ప్రొద్దుటూరు టీడీపీలో కొంత కాలంగా నెలకొన్న అంతర్గత విభేదాలు బట్టబయలు అయ్యాయి. మల్లేల లింగారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డిలు ఒకటయ్యారని కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ.. పట్టణంలో ఈ వార్త అందరి నోళ్లలో నానుతోంది. లింగారెడ్డి వర్గీయులు మాత్రం దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరదకు ఇన్చార్జి పదవి లేదని.. ఇద్దరం ఎప్పుడు కలిసి తిరగలేమని లింగారెడ్డి చెప్పడం చర్చనీయాంశం అయింది. సమావేశంలో టీడీపీ నాయకులు వీఎస్ ముక్తియార్, మెట్టుపల్లె ప్రభాకర్‌రెడ్డి, గాండ్లనారాయణస్వామి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
ప్రొద్దుటూరు టీడీపీలో తారాస్థాయికి విభేదాలు
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు టీడీపీలో విభేదాలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఎంపీ సీఎం రమేశ్‌పై మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి నిప్పులు చెరిగారు. తాను జీవించి ఉన్నంత వరకూ సీఎం రమేశ్ కుటుంబాన్ని ప్రొద్దుటూరు రాజకీయాల్లోని రానివ్వనని తెగేసి చెప్పారు. సీఎం రమేశ్ కనుసన్నల్లోనే ప్రొద్దుటూరులో కౌన్సిలర్లు రాజీనామాలు చేశారని ఆరోపించారు. ప్రొద్దుటూరు టీడీపీలో జరుగుతున్న అల్లర్ల వెనక సీఎం రమేశ్ హస్తం ఉందని మీడియా సమావేశంలో వరదరాజులు రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో టీడీపీకి చెందిన 22 మంది కౌన్సిలర్లు, తమ పదవులకు రాజీనామా చేస్తూ మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డికి సోమవారం లేఖ ఇచ్చిన సంగతి తెల్సిందే. -
చట్టవ్యతిరేక ప్రవర్తనకు ఆధ్యుడు చంద్రబాబే..
సాక్షి ప్రతినిధి కడప: ‘యథానాయకా..తథా అనుచరగణం’అన్నట్లుగా ప్రభుత్వ అధినేత చంద్రబాబు నుంచి టీడీపీ ఇన్చార్జి వరకు ఒకటే ధోరణి అవలంబిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానిస్తూ వారికి నచ్చిందే వేదం, సూచించిందే చట్టం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఈ ధోరణి ప్రొద్దుటూరులో మరింత ఎక్కుగా కనిపిస్తోంది. ప్రజాప్రతినిధుల కంటే తానే సూపర్ బాస్ అనే నియంతృత్వాన్ని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి చెప్పకనే చెబుతున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఐదు టర్మ్‌లు ఎమ్మెల్యేగా పనిచేసిన వరదరాజులరెడ్డి పదేళ్లుగా అక్కడి ప్రజలు తిరస్కరించారు. ప్రజాస్వామ్యవ్యవస్థలు ప్రజాప్రతినిధిగా అనుభవం ఉన్న ఆయన ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సి ఉంది. కాగా ఇప్పటికీ తానే ప్రజాప్రతినిధి అన్నట్లు సమీక్షలు, అధికారులపై పెత్తనం ప్రదర్శించడంతో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఒక అడుగు ముందులో ఉన్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2009–14 టర్మ్‌లో ఎమ్మెల్యేగా ఉన్న లింగారెడ్డి కంటే తనదే పైచేయి కావాలనే ధోరణి అప్పట్లో వ్యక్తమైందని, 2014 నుంచి ఇప్పటికీ అదే మూసలో కొనసాగుతున్నారని పలువురు వివరిస్తున్నారు. ప్రజలచే ఎన్నుకోబడినవారే ప్రజాస్వామ్యంలో సుప్రీం.. కాగా ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేదు, తాను చెప్పిందే వేదం, సూచించిందే చట్టం అన్న ధోరణి మాజీ ఎమ్మెల్యే వరద చేతల్లో చూపిస్తున్నారని, నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండిపోతోందని పలువురు వివరిస్తున్నారు. గతంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో, తాజగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సమీక్ష సందర్భంగా చోటుచేసుకున్న ఉదంతాలను పలువురు ఎత్తి చూపుతున్నారు. ఎంపీగా అధికారులను సమీక్ష చేసుకునే అవకాశం ఉన్నా నియంత్రించే చర్యలకు వరద పాల్పడడం చట్టవిరుద్ధమని పలువురు చెప్పుకొస్తున్నారు. చట్టవ్యతిరేక ప్రవర్తనకు ఆధ్యుడు చంద్రబాబే.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు అందరూ ప్రభుత్వంలో భాగమే. కాకపోతే రాష్ట్రంలో అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాత్రమే ప్రభుత్వంలో భాగం అన్న ధోరణి చంద్రబాబు నుంచే ప్రారంభమైందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అందులో భాగంగానే పులివెందులలో నాడు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతుంటే సీఎం స్థాయిలో మాట్లాడనీయకుండా అడ్డు తగిలారు. అదే స్ఫూర్తితో నేడు టీడీపీ ఇన్చార్జి వరదరాజులరెడ్డి తన పార్టీ ఎంపీ అయినా తనకు నచ్చలేదు కాబట్టి అడ్డుకోవాలనే తలంపు వ్యక్తమైందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. సీఎం రమేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు బినామీగా పేరున్నా, నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రొద్దుటూరు ప్రాంతం నా సామ్రాజ్యం అన్న ధోరణి ఉండడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం ఏమైనా పోటీపడ్డారా అంటే అదీ లేదు, మున్సిపాలిటిలో ఉన్న గ్రాంటు తన అనుచరులకు ఇవ్వాలని ఒకరు, లేదు ఆ మొత్తం గ్రాంటుపై మాకే హక్కు అని ఇంకొకరు పోటీ పడేందుకు వీరి ప్రయత్నమంతా అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజాప్రతిని«ధి కంటే అధికారపార్టీ ఇన్చార్జే అసలైన బాస్ అన్నట్లుగా వ్యవస్థ దిగజారడం సిగ్గుచేటని పలువురు వివరిస్తున్నారు. వింత ప్రవర్తనలో యంత్రాంగం.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మాజీఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వందలాది మంది అనుచరగణాన్ని వెంట వేసుకొని తీవ్ర రభస సృష్టించారు. ఎన్నిక నిర్వహణ వాయిదా పడేందుకు చేపట్టాల్సిన చర్యలన్నీ చేశారు. తాజాగా ఎంపీ సమీక్ష చేపడుతుంటే అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా మరోమారు అనుచరగణంతో రాద్ధాంతం చేశారు. ఇంత చేస్తున్నా, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నా మాజీ ఎమ్మెల్యే వరద, అనుచరులపై ఎలాంటి కేసులు నమోదు కావు. అదే ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ధర్నాలు చేపట్టినా కేసులు నమోదు చేస్తున్నారు. వేముల మండలంలో యూసీఐఎల్ టెయిల్‌ఫాండ్ వ్యర్థాల కారణంగా వ్యవసాయదారులు నష్టపోతున్నారు. ప్రజాజీవనం అస్తవ్యవస్తం అవుతోందని వేముల ఎంపీపీ ఉషారాణి బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు. ప్రజాశ్రేయస్సు కోసం ధర్నా చేపడితే పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేసింది. స్వప్రయోజనాల కోసం టీడీపీ నేతలు ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా చేష్టలుడిగి చూస్తుండి పోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ, చట్టానికి ఎవ్వరూ అతీతులు కారని తెలియజెప్పాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని పలువురు వివరిస్తున్నారు. -
రాయలసీమ టీడీపీలో గ్రూపు తగదాల కార్చిచ్చు
-
వరద దౌర్జన్యం
► పోలీసు అధికారుల సమక్షంలో టీడీపీ నేతల దురుసుతనం ► ప్రజాసమస్యలపై పోరాటం చేస్తే అర్ధంతర అరెస్టులు ► ఎన్నికల అధికారి చేతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం ► అధికారపార్టీ నేతల కనుసైగల మేరకే చైర్మన్ ఎన్నిక వాయిదా ప్రజాస్వామ్యం మరోమారు మంటగలిసింది. అండగా నిలవాల్సిన యంత్రాంగం ఏకపక్షంగా నిలిచింది. ఏకంగా పోలీసు అధికారులే గొడవకు ఆస్కారం ఇవ్వగా, ఆ కారణంగా ఎన్నిక వాయిదా వేశారు. నవ్విపోదురుగాక...నాకేటి సిగ్గు అన్నట్లుగా తెరవెనుక డైరెక్షన్ అధికార యంత్రాంగం అమలు చేసింది. వెరసి ప్రొద్దుటూరు చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. సాక్షి ప్రతినిధి, కడప: ప్రొద్దుటూరు పట్టణ ప్రజానీకం తాగునీటికి అవస్థలు పడుతున్నారు. తక్షణమే సమస్య పరిష్కరించండి, ప్రజల తాగునీటి కష్టాలకంటే ప్రాణాలు లెక్కకాదంటూ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆమరణదీక్షకు సన్నద్ధమయ్యారు. అనుమతులు లేవంటూ పోలీసు అధికారులు అర్ధంతర అరెస్టుకు తెరలేపారు. తాగునీటి సమస్య కోసం శాంతియుతంగా ఆందోళన చేయాలని భావించినా అడ్డుకున్నారు. అదేవిధంగా గండికోట నిర్వాసితులకు పరిహారం దక్కలేదని, వారంతా ఏకమై ఆందోళన చేసేందుకు సిద్ధమైతే, ఆ కార్యక్రమానికి హాజరవుతారనే ఉద్దేశంతో ప్రొద్దుటూరు పోలీసులు పలుమార్లు మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ కె జయశ్రీని హౌస్ అరెస్టు చేశారు. ఆందోళనలతో అలజడి నెలకొంటుందని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ, నిబద్ధత కల్గిన ప్రొద్దుటూరు పోలీసు అధికారులు 40మంది సభ్యులు ఎన్నుకునే చైర్మన్ ఎన్నికను చేపట్టలేకపోయారని పలువురు పేర్కొంటున్నారు. సభ్యులను తప్ప...ఇతరుల ప్రవేశాన్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం వందల సంఖ్యలో అనుమతించడంతో ఘర్షణ తలెత్తిందని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకపోయినా ఏకంగా కౌన్సిల్హాల్లోకి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రవేశించారు. పోలీసు అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోవడంతో, తర్వాత మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వందల సంఖ్యలో అనుచరగణాన్ని వెంటబెట్టుకొని వచ్చారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆమేరకే టీడీపీ నేతలు ఒక్కమారుగా చెలరేగిపోయి విధ్వంసం సృష్టించారని విశ్లేషకులు భావిస్తున్నారు. తిరగబడిన టీడీపీ వ్యూహం...: ప్రొద్దుటూరు మున్సిపాలిటిలో తెలుగుదేశం వ్యూహాం తిరగబడింది.ఛేర్మెన్ గురివిరెడ్డిని తప్పించి ఆ స్థానంలో ఆసం రఘురామిరెడ్డి చేయాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తలచారు. రఘురామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని పలువురు టీడీపీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఫిరాయింపు కౌన్సిలర్లు సైతం ఈ పరిణామాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. ఈక్రమంలో కౌన్సిలర్ ముక్తియార్‌ను చైర్మన్ చేయాలని భావించారు. వీరికి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు జతకట్టారు. వైఎస్సార్సీపీ ఫిరాయింపు కౌన్సిలర్ల తోపాటు వరద వర్గీయులను వ్యతిరేకిస్తున్న 6 మంది టీడీపీ కౌన్సిలర్లు జట్టుగా క్యాంపునకు వెళ్లారు. 15మంది సభ్యులు చైర్మన్ ఎన్నికకు తరలివచ్చారు. వీరికి తోడుగా 10మంది వైఎస్సార్సీపీ సభ్యులు నిలవడంతో కోరం ఏర్పడింది. చైర్మన్ ఎన్నికలో వ్యూహం తిరగబడడంతో ఎలాగైనా వాయిదా వేయాలనే తలంపుతో టీడీపీ నేతలు రభస సృష్టించారు. అనుకున్నదే తడువుగా టీడీపీ నేతలకు అటు పోలీసు, ఇటు రెవెన్యూ అధికారులు వత్తాసుగా నిలచి వాయిదా వేశారు. తెరవెనుక డైరెక్షన్ మేరకే...: మున్సిఫల్ చైర్మన్ ఎన్నిక విషయమై మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రొద్దుటూరులో తిష్టవేసి పర్యవేక్షించసాగారు. స్వయంగా కౌన్సిలర్ ముక్తియార్‌కు లేఖరాశారు. దీనిని మాజీ చైర్మన్ గురివిరెడ్డి ద్వారా కౌన్సిల్హాల్లో అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో తెరవెనుక మంత్రాంగం నిర్వహించి చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని కనుసైగల మేరకు వ్యవహారాన్ని అధికారులు చక్కబెట్టారని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో ఘర్షణ సాకుగా చూపి ఎన్నికల అధికారి జమ్మలమడు గు ఆర్డీఓ వినాయకం వాయిదా వేశారు. కాగా 40 మంది సభ్యులచే చైర్మన్ ఎన్నిక చేపట్టలేని దుస్థితిలో జిల్లా యంత్రాం గం ఉండిపోవడాన్ని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆదివారమైనా చైర్మన్ ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజానీకం కోరుతోంది. -
మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందే
ప్రొద్దుటూరు టౌన్:మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందే.. అది కూడా రెండు రోజుల్లో అయిపోవాలి. మాకు వరదరాజులరెడ్డి నుంచి ఒత్తిడి ఎక్కువైంది అంటూ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు నరసారెడ్డి, జయనాగేశ్వరరెడ్డితోపాటు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆదివారం మాట్లాడాలంటూ మున్సిపల్ చైర్మన్‌ను పార్టీ పెద్దలు హైదరాబాదుకు పిలిపించారు. ఈ సందర్భంగా వారు చైర్మన్‌తో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం మేరకు రెండేళ్లు ఒకరు, మూడేళ్లు మరొకరు ఉండాలని ఇది వరకు తీసుకున్న నిర్ణయంపై చర్చించారు. రెండేళ్ల గడువు ముగిసి మూడునెలలు అయిందని చెప్పారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వరదరాజులరెడ్డి నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని తెలిపారు. రెండవ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న ఆసం రఘురామిరెడ్డికి చైర్మన్ సీటు ఇవ్వాలని, ఈనెల జరిగే కౌన్సిల్ సమావేశపు అజెండాలో ఈ అంశం రావాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. రాజీనామా చేస్తే పార్టీలో మరో పదవి ఇస్తామని కూడా ఆశ చూపారు. ఉన్నట్లుండి హైదరాబాదుకు రమ్మని చెప్పి కేవలం 48 గంటల్లో రాజీనామా చేయాలని చెప్పడంపై చైర్మన్‌కు పరిస్థితి అర్థం కాలేదు. తీవ్ర అసహనంతో బయటికి.. ఈ చర్చ జరుగుతుండగానే చైర్మన్ గురివిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమావేశం నుంచి బయటికి వస్తూ నాలుగు రోజుల్లో తన నిర్ణయాన్ని చెబుతానని చెప్పి అక్కడి నుంచి చైర్మన్ వెళ్లి పోవడంతో పార్టీ పెద్దలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎవరి పంతం నెగ్గేనో... ఎన్నికల సందర్భంగా అదనంగా రూ.2 కోట్లు ఖర్చుపెట్టిన చైర్మన్‌కు మూడేళ్లు పదవిలో కొనసాగే విధంగా ఆ నాడు ఒప్పుకున్న పార్టీ నాయకులు నేడు వరదరాజులరెడ్డి ఒత్తిడితో ఏం మాట్లాడకపోవడాన్ని చైర్మన్ వర్గీయులు, కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్లకు ఒక్క రోజు ముందు కూడా తాను దిగను అని చైర్మన్ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇటు చైర్మన్ మాట నెగ్గుతుందా, వరదరాజులరెడ్డి మాట చెల్లుతుందో వేచి చూడాల్సిందే. కాగా చైర్మన్ మూడేళ్లకు ముందు దిగరన్న విషయాన్ని కొందరు కౌన్సిలర్లు స్పష్టం చేస్తున్నారు. పార్టీ పెద్దల ఒత్తిడి నేపథ్యంలో చట్ట ప్రకారం నాలుగేళ్ల వరకు చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు వీలు లేని అంశాన్ని కూడా చైర్మన్ వర్గీయులు పరిశీలిస్తున్నారు. లింగారెడ్డి దృష్టికి సమస్య ఈ విషయాన్ని కొందరు కౌన్సిలర్లు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా చైర్మన్‌ను రెండు రోజుల్లో రాజీనామా చేయాలని చెప్పడాన్ని తప్పుబట్టినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం పొట్లదుర్తిలో ఉన్న ఎంపీ సీఎం రమేష్‌నాయుడుతో లింగారెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా టీడీపీలో మొదలైన అంతర్గత పోరు మరి రెండు రోజుల్లో రోడ్డున పడనుంది. -
మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందే
ప్రొద్దుటూరు టౌన్: మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందే.. అది కూడా రెండు రోజుల్లో అయిపోవాలి. మాకు వరదరాజులరెడ్డి నుంచి ఒత్తిడి ఎక్కువైంది అంటూ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు నరసారెడ్డి, జయనాగేశ్వరరెడ్డితోపాటు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆదివారం మాట్లాడాలంటూ మున్సిపల్ చైర్మన్‌ను పార్టీ పెద్దలు హైదరాబాదుకు పిలిపించారు. ఈ సందర్భంగా వారు చైర్మన్‌తో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం మేరకు రెండేళ్లు ఒకరు, మూడేళ్లు మరొకరు ఉండాలని ఇది వరకు తీసుకున్న నిర్ణయంపై చర్చించారు. రెండేళ్ల గడువు ముగిసి మూడునెలలు అయిందని చెప్పారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వరదరాజులరెడ్డి నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని తెలిపారు. రెండవ చైర్మన్ అభ్యర్థిగా ఉన్న ఆసం రఘురామిరెడ్డికి చైర్మన్ సీటు ఇవ్వాలని, ఈనెల జరిగే కౌన్సిల్ సమావేశపు అజెండాలో ఈ అంశం రావాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. రాజీనామా చేస్తే పార్టీలో మరో పదవి ఇస్తామని కూడా ఆశ చూపారు. ఉన్నట్లుండి హైదరాబాదుకు రమ్మని చెప్పి కేవలం 48 గంటల్లో రాజీనామా చేయాలని చెప్పడంపై చైర్మన్‌కు పరిస్థితి అర్థం కాలేదు. తీవ్ర అసహనంతో బయటికి.. ఈ చర్చ జరుగుతుండగానే చైర్మన్ గురివిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమావేశం నుంచి బయటికి వస్తూ నాలుగు రోజుల్లో తన నిర్ణయాన్ని చెబుతానని చెప్పి అక్కడి నుంచి చైర్మన్ వెళ్లి పోవడంతో పార్టీ పెద్దలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎవరి పంతం నెగ్గేనో... ఎన్నికల సందర్భంగా అదనంగా రూ.2 కోట్లు ఖర్చుపెట్టిన చైర్మన్‌కు మూడేళ్లు పదవిలో కొనసాగే విధంగా ఆ నాడు ఒప్పుకున్న పార్టీ నాయకులు నేడు వరదరాజులరెడ్డి ఒత్తిడితో ఏం మాట్లాడకపోవడాన్ని చైర్మన్ వర్గీయులు, కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్లకు ఒక్క రోజు ముందు కూడా తాను దిగను అని చైర్మన్ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇటు చైర్మన్ మాట నెగ్గుతుందా, వరదరాజులరెడ్డి మాట చెల్లుతుందో వేచి చూడాల్సిందే. కాగా చైర్మన్ మూడేళ్లకు ముందు దిగరన్న విషయాన్ని కొందరు కౌన్సిలర్లు స్పష్టం చేస్తున్నారు. పార్టీ పెద్దల ఒత్తిడి నేపథ్యంలో చట్ట ప్రకారం నాలుగేళ్ల వరకు చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు వీలు లేని అంశాన్ని కూడా చైర్మన్ వర్గీయులు పరిశీలిస్తున్నారు. లింగారెడ్డి దృష్టికి సమస్య ఈ విషయాన్ని కొందరు కౌన్సిలర్లు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా చైర్మన్‌ను రెండు రోజుల్లో రాజీనామా చేయాలని చెప్పడాన్ని తప్పుబట్టినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం పొట్లదుర్తిలో ఉన్న ఎంపీ సీఎం రమేష్‌నాయుడుతో లింగారెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా టీడీపీలో మొదలైన అంతర్గత పోరు మరి రెండు రోజుల్లో రోడ్డున పడనుంది. -
ప్రొద్దుటూరులో.. ఫ్యాన్ హోరు
మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వరద ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రజా సేవలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తొలిమారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీ చేస్తున్న రాచమల్లు ప్రసాదరెడ్డికే స్థానిక పరిస్థితుల దృష్ట్యా విజయావకాశాలు మెండుగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 16 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఈయన కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, ఇన్చార్జి చైర్మన్‌గా పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యావంతుడు కావడం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం రాచమల్లుకు లాభించే అంశాలు. సమీప ప్రత్యర్థిగా ఉన్న నంద్యాల వరదరాజులరెడ్డి పాతికేళ్లు ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి నిరోధకుడుగా ప్రజల మనసుల్లో ముద్రవేసుకున్నారనే భావన ప్రజల్లో ఉంది. ఈ కారణంగానే 2009 ఎన్నికల్లో లింగారెడ్డి చేతిలో 16,156 ఓట్లతో వరద ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవగుడి నారాయణరెడ్డి చేతిలో ఓటమి పాలైన వరద ప్రస్తుతం మరో మారు ఎమ్మెల్యే ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీ చేస్తున్నారు. వరదకు ఎదురుగాలి... 2009 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వరద ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ పొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన ఎన్నికల్లో జి ల్లాలోని 10 అసెం బ్లీ నియోజకవర్గాలకు గాను ప్రొద్దుటూరులో మాత్రమే వరదరాజులరెడ్డి కాంగ్రెస్‌పార్టీ తరపున ఓటమి చెందారు. ఇది లావుండగా 1981లో రాజకీయ రంగ ప్రవే శం చేసి సమితి ఎన్నికల్లో పోటీ చేయగా శెట్టిపల్లె రఘురామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీ రమణారెడ్డి చేతిలో వరదరాజులరెడ్డి ఓటమి పాలయ్యారు. 1985, 1989, 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అలాగే 1981లో తొలిమారు సమితి ప్రెసిడెంట్, 1983లో, 2009లో ఎమ్మెల్యేగా, 2011లో ఎమ్మెల్సీకి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ ప్రకారం వరద జీవితంలో మొత్తం 5 మార్లు గెలుపొందగా, మరో నాలుగు మార్లు ఓటమిపాలయ్యారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు వరదకు ప్రతికూలంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు వీరే... సంవత్సవం పార్టీ గెలుపొందిన అభ్యర్థి 1952 కాంగ్రెస్ కె. బాలనారాయణరెడ్డి 1955 కాంగ్రెస్ కె. బాలనారాయణరెడ్డి 1957 ఇండిపెండెంట్ ఆర్సీ ఓబులరెడ్డి 1962 కాంగ్రెస్ ఆర్. రామసుబ్బారెడ్డి 1972 కాంగ్రెస్ కొప్పరపు సుబ్బారావు 1978 కాంగ్రెస్. ఐ చంద్ర ఓబులరె డ్డి రామిరెడ్డి 1983 టీడీపీ ఎం.వీ రమణారెడ్డి 1985 టీడీపీ ఎన్. వరదరాజులరెడ్డి 1989 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి 1994 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి 1999 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి 2004 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి 2009 టీడీపీ మల్లెల లింగారెడ్డి పట్టణ ఓటర్లే కీలకం.. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2,20,000 వరకు ఓటర్లు ఉండగా ఇందులో పట్టణంలోనే 1,23,000 మంది ఓటర్లు ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటములు ప్రధానంగా ప్రొద్దుటూరు పట్టణంపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ప్రొద్దుటూరు పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పాతికేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వరద ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని, పెపైచ్చు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తాగునీటి కోసం మంజూరు చేసిన కుందూ-పెన్నా నీటి పథకాన్ని పూర్తి చేయలేకపోయారనే అపవాదు ప్రజల్లో ఉంది. అలాగే ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. వీటికి తోడు పట్టణంతోపాటు నియోజకవర్గంలో ప్రజలకు కనీసం మౌలిక వసతులు సమకూర్చడంలో విఫలమయ్యారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి అంశాలు ఎక్కువగా వరద ఓటమికి ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ కారణంగా తొలిమారు బలమైన పార్టీ తరపున పోటీ చేస్తున్న రాచమల్లు ప్రసాదరెడ్డినే విజయం వరిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఇదిలావుండగా ప్రొద్దుటూరులో అప్పుడే రాచమల్లు ప్రసాదరెడ్డి మెజారిటీపై బెట్టింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆయన ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.