
సాక్షి, ప్రొద్దుటూరు: వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో టికెట్ల రగడ మొదలైంది. ఎమ్మెల్యే టికెట్‌ను లింగారెడ్డికి ఇవ్వడంతో.. వరదరాజులరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి అన్యాయం జరిగిందంటూ వరదరాజులరెడ్డి వర్గీయులు కూడా తమ నిరసన తెలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఫ్లెక్సీలను తొలగించారు.
పార్టీ కార్యాలయానికి నల్లజెండాలు కట్టి తమ నిరసన తెలిపారు. ఐదేళ్లుగా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జిగా వరదరాజులరెడ్డి ఉండగా.. టికెట్‌ను లింగారెడ్డికి కేటాయించడంతో వరద వర్గీయులు అధిష్టానంపై మండిపడుతున్నారు. ఈ పరిణామాలతో వరదరాజులరెడ్డి ఆయన అనుచరులతో సమావేశమై చర్చలు జరిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కార్యకర్తలు, అభిమానుల సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని వరదరాజులరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment