
టీడీపీ నేతలు వరదరాజులు రెడ్డి, సీఎం రమేశ్
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు టీడీపీలో విభేదాలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఎంపీ సీఎం రమేశ్‌పై మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి నిప్పులు చెరిగారు. తాను జీవించి ఉన్నంత వరకూ సీఎం రమేశ్ కుటుంబాన్ని ప్రొద్దుటూరు రాజకీయాల్లోని రానివ్వనని తెగేసి చెప్పారు. సీఎం రమేశ్ కనుసన్నల్లోనే ప్రొద్దుటూరులో కౌన్సిలర్లు రాజీనామాలు చేశారని ఆరోపించారు.
ప్రొద్దుటూరు టీడీపీలో జరుగుతున్న అల్లర్ల వెనక సీఎం రమేశ్ హస్తం ఉందని మీడియా సమావేశంలో వరదరాజులు రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో టీడీపీకి చెందిన 22 మంది కౌన్సిలర్లు, తమ పదవులకు రాజీనామా చేస్తూ మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డికి సోమవారం లేఖ ఇచ్చిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment