
సాక్షి, కడప: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్ జిల్లా టీడీపీ నాయకులు షాక్ ఇచ్చారు. కడప నగరం రామాంజినేయపురంలోని సాయిశ్రీనివాస కళ్యాణ్ మండపంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి జిల్లా ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా గెలుపొందిన బిటెక్ రవి, శివనాథరెడ్డిలు సమావేశానికి హజరు కాలేదు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడైన శివనాథరెడ్డి కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు ప్రొద్దుటూరు నేత వరదరాజులు రెడ్డి, బద్వేలు విజయమ్మ, సుగవసి ప్రసాద్ అలాగే రాయచోటి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు, ఆయన వర్గీయులు సైతం టీడీపీ సమీక్షా సమావేశానికి గైర్హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment