
సాక్షి, వైఎస్సార్: జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డి అనుచరులు బాహాబాహీకి దిగారు. రాజుపాలెం మండలం చిన్నశెట్టిపాలెంలో సాగునీటి మళ్లింపు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గానికి చెందిన కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి 50 లక్షల రూపాయల వ్యయంతో చిన్నశెట్టి పాలెంలో సాగునీటి కోసం పైపు లైన్ పనులు చేపట్టారు. అయితే అదే గ్రామానికి చెందిన వరదరాజులరెడ్డి అనుచరుడు నరసింహారెడ్డి తన పొలానికి నీటి మళ్లింపు కోసం పైపులు అమర్చడం గొడవకు దారితీసింది. ఘటన స్థలానికి చేరుకున్న పరిస్థితిని అదుపులో తీసుకురావడానికి ప్రయత్నించారు.
ఇరువర్గాలను పోలీసు స్టేషన్‌కు తరలించి సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే తెలుగు తమ్ముళ్లు పోలీసు స్టేషన్ బయట గొడవకు దిగారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో లాఠీ చార్జీ చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇరువర్గాలకు చెందిన నేతలు పలుమార్లు ఘర్షణకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment