Linga Reddy
-
ఆ జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ..!
జిల్లా టీడీపీ దాదాపు ఖాళీ అయ్యిందా..ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది. గతేడాది అసెంబ్లీ ..లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ దారుణ పరాజయాన్ని మూట గట్టుకుంది. కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ చికిత్సకు అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో జనరంజకంగా ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో సర్కారు దూసుకెళుతుండటంతో ఆ పార్టీ నాయకులు టీడీపీలో కొనసాగడానికి నేతలు విముఖంగా ఉన్నారు. రోజురోజుకూ ఇలాంటి నాయకులు పెరుగుతున్నారు. పులివెందులలో ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న సతీష్‌రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో టీడీపీ పూర్తిగా చతికిలపడిపోయింది. సాక్షి, కడప : టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్వీ సతీష్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం పులివెందులలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ సతీష్‌రెడ్డి పార్టీని వీడటం టీడీపీకి గట్టి షాక్‌గా భావించవచ్చు. ఆయన రాజీనామాతో అరకొరగా ఉన్న అక్కడి క్యాడర్పార్టీకి పూర్తిగా దూరమైనట్లే. అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీకి స్థానిక ఎన్నికల ప్రారంభంలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సతీష్‌రెడ్డి రాజీనామాతోపాటు మరికొందరు అదేబాటలో ఉన్నారనే సమాచారం ఆ పార్టీ శిబిరం పూర్తిగా డీలా పడిపోయింది. స్థానిక ఎన్నికల్లో కనీస పోటీ ఇచ్చే పరిస్థితి లేదని పరిశీలకుల భావన. మరికొందరు నేతలు సైతం పార్టీని వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు ఇప్పటికే బీజేపీ పంచన.. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఛీకొట్టడంతో జిల్లాలోని పది అంసెబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో ఘోర పరాజయ పాలైంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో జిల్లా టీడీపీ నేతలు కలవరపడ్డారు. ఆ పార్టీ పాత కాపు సీఎం రమేష్ భవిష్యత్తు లేదని భావించి టీడీపీని వీడి షెల్టర్ జోన్ బీజేపీలో చేరారు. ఎన్నికల ముందు ప్రగల్బాలు పలికిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అదేబాట పట్టారు. అరకొరగా ఉన్న నేతలు మౌనముద్ర దాల్చారు. పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. చూస్తుండగానే స్థానిక ఎన్నికలు వచ్చాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీల నామినేషన్లు మొదలైన మరుసటి రోజే ఆ పార్టీ కీలకనేత ఎస్వీ సతీష్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. మరికొందరు నేతలు ఇదే బాటలో పయనించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరులో చీకట్లు ప్రొద్దుటూరుకు చెందిన ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తాను స్థానిక ఎన్నికలకు దూరమని ప్రకటించి టీడీపీని వీడనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా పీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేరును ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి సైతం తీవ్ర అసంతృప్తిగా లోనైనట్లు తెలుస్తుంది. వరదరాజుల రెడ్డి అనుచరవర్గంఈ ఎన్నికల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు సమయం దగ్గరపడినా మున్సిపల్ మాజీ ఛైర్మన్ ముక్తియార్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. రాయచోటికి చెందిన టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడి వర్గం ఆ పార్టీపై గత సార్వత్రిక ఎన్నికల సమయం నుంచే అంసతృప్తితో ఉంది. ఆయన తనయుడు సుగవాసి ప్రసాద్‌బాబు తన అనుచరులతో కలిసి టీడీపీని వీడనున్నారన్న ప్రచారం జరుగుతోంది. బద్వేలులో మరో కీలక నేత మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అరకొరగా మిగిలి ఉన్న టీడీపీ నేతలు ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలను పట్టించుకోవడం లేదు. కొందరు రెండో శ్రేణి నేతలు సైతం ఈ ఎన్నికల సమయంలోనే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం, జిల్లాలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రజలు వైఎస్సార్సీపీకి మద్దతు పలుకుతున్నారు. టీడీపీ కనీస పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. జిల్లాలో అధికార పార్టీ విజయం ఏకపక్షమేనని పరిశీలకుల అంచనా.వరుసగా ముఖ్యనేతలు, ద్వితీయ శ్రేణి నేతలు పార్టీని వీడతుండటంతో టీడీపీ జిల్లాలో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. -
మాజీ ఎమ్మెల్యేకి చెక్ పెట్టిన టీడీపీ
సాక్షి, ప్రొద్దుటూరు : టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డికి పార్టీ అధిష్టానం చెక్ పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఈ పరిస్థితుల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రభావం కారణంగా టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించగా ఆ తర్వాత 1, 2 ఏళ్లకు మల్లేల లింగారెడ్డి పార్టీలో చేరారు. నాటి నుంచి నేటి వరకు ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. 2009లో జిల్లాకంతటికీ టీడీపీ శాసనసభ్యునిగా లింగారెడ్డి మాత్రమే ఎన్నికయ్యారు. గతంలో పార్టీ జిల్లా అధ్యక్షునిగా, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా పనిచేయగా, ఆయన సతీమణి మల్లేల లక్ష్మీప్రసన్న కూడా మహిళా విభాగంలో కీలక బాధ్యతలు వ్యవహరించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు వచ్చే సమయంలో టీడీపీ ఏదో రకమైన కొత్తమెలిక పెడుతోంది. చాలా ఎన్నికల్లో నామినేషన్లు వేసే వరకు శాసనసభ అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలు లేవు. 2014 శాసనసభ ఎన్నికల్లో సైతం అప్పటికప్పుడు పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి టికెట్ ఇవ్వడం, ఓడిపోయిన తర్వాత ఆయనే చాలా రోజుల వరకు ఇన్చార్జిగా ఉండటం జరిగింది. చదవండి: జేసీ బ్రదర్స్ కాళ్లబేరం! స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సమన్వయకర్తగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నియమించడం జరిగింది. వాస్తవానికి ఇప్పటి వరకు ఈయన పార్టీలో లేరు. 2019 ఎన్నికల సందర్భంగా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నియమించారని ప్రచారం ఊపందుకోవడంతో లింగారెడ్డి సోమవారం స్వయంగా సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో కార్యకర్తలకు ప్రచారం చేసుకున్నారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కేవలం 20 రోజులపాటు ఎన్నికల సమన్వయకర్తగా మాత్రమే పనిచేస్తారని, పార్టీ ఇన్చార్జితో అతనికి సంబంధం లేదని అన్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. -
టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి
-
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి, వైఎస్సార్: జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డి అనుచరులు బాహాబాహీకి దిగారు. రాజుపాలెం మండలం చిన్నశెట్టిపాలెంలో సాగునీటి మళ్లింపు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గానికి చెందిన కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి 50 లక్షల రూపాయల వ్యయంతో చిన్నశెట్టి పాలెంలో సాగునీటి కోసం పైపు లైన్ పనులు చేపట్టారు. అయితే అదే గ్రామానికి చెందిన వరదరాజులరెడ్డి అనుచరుడు నరసింహారెడ్డి తన పొలానికి నీటి మళ్లింపు కోసం పైపులు అమర్చడం గొడవకు దారితీసింది. ఘటన స్థలానికి చేరుకున్న పరిస్థితిని అదుపులో తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇరువర్గాలను పోలీసు స్టేషన్‌కు తరలించి సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే తెలుగు తమ్ముళ్లు పోలీసు స్టేషన్ బయట గొడవకు దిగారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో లాఠీ చార్జీ చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇరువర్గాలకు చెందిన నేతలు పలుమార్లు ఘర్షణకు దిగారు. -
జగన్ సమక్షంలో చేరిన ‘లింగారెడ్డి’
ఏలూరు టౌన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రతో ప్రజల్లో వస్తోన్న అనూహ్య స్పందన చూసి రాజకీయ పార్టీల నేతలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్లలో పాదయాత్ర చేస్తోన్న వైఎస్ జగన్ సమక్షంలో ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడుకు చెందిన కాంగ్రెస్ నాయకులు లింగారెడ్డి మధుసూధనరెడ్డి శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. ప్రకాశం జిల్లా మహీధర్‌రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్‌లో కీలకనేతగా ఎదిగిన మధుసూధనరెడ్డి వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సంతోషంగా జీవించాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. తూర్పుగోదావరి జిల్లా నాయకుల చేరిక అలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పి.గన్నవరం వైఎస్సార్ సీపీ నాయకులు కొండేటి చిట్టబ్బాయి, సీఏసీ సభ్యులు కుడిపూడి చిట్టబ్బాయి, మిదిగుండి మోహన్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది నాయకులు పార్టీలో చేరారు. వారిలో వార లక్ష్మీనరసింహం, మాజీ ఎంపీటీసీ బొక్క ఏడుకొండలు, బొబ్బిలి దుర్గారావు, దామిశెట్టి అంజిబాబు, మాజీ సర్పంచ్ కడలి రామకృష్ణ, మట్టపర్తి నవీన్ తదితరులు ఉన్నారు. -
రాస్కెల్.. బఫెలో.. ఇడియట్
♦ ఆఫ్ట్రాల్ డీఎస్ఓ గాడివి.. నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావా? ♦ వైఎస్సార్ జిల్లా డీఎస్వోపై లింగారెడ్డి దూషణలు కడప సెవెన్‌రోడ్స్: ‘‘రాస్కెల్.. బఫెలో.. ఇడియట్.. వెళ్లిపోరా ఇక్కడి నుంచి.. సమావేశం గురించి ఎందుకు చెప్పలే దు? నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావా? ఏమనుకుంటున్నావ్.. ఎవరనుకున్నావ్.. ఆఫ్ట్రాల్ డీఎస్ఓ గాడివి’’ అంటూ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి వైఎస్సార్ జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్ఓ) జి.వెంకటేశ్వరరావును తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. మనస్తాపానికి గురైన డీఎస్ఓ కంటతడి పెట్టారు. వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్లుగా జరగని ఎఫ్ఏసీ (ఫుడ్ అడ్వయిజరీ కమిటీ) సమావేశాన్ని ఇన్‌ఛార్జి డీఎస్‌ఓగా జిల్లాకు వచ్చిన వెంకటేశ్వరరావు చొరవ తీసుకుని కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన లింగారెడ్డి ఒక్కసారిగా ఆయనపై ఫైర్ అయ్యారు. ‘‘ఈ రోజు చాలా వివాహాలు ఉన్నాయి. ఒక మాట ఫోన్ చేసి చెప్పి ఉంటే మరోరోజు సమావేశం ఏర్పాటు చేసుకునే వాళ్లం’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ తిట్ల పురాణం అందుకున్నా రు. జీవో నెం.47 మేరకు లింగారెడ్డి ఎఫ్ఏసీలో సభ్యుడు కాకున్నా సమావేశానికి సంబంధిం చిన సమాచారాన్ని తాము ముందే తెలియజేశామని, నోట్ కూడా పంపామని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు. తాను చెప్పిన పనులు డీఎస్ఓ చేయకపోవడమే లింగారెడ్డి ఆగ్రహానికి అసలు కారణమని ఉద్యోగులంటున్నారు. రాజుపాలెం, చాపాడు తదితర గ్రామాల్లో రేషన్ దుకాణాల డీలర్లను తొలగించి, తాను సూచించిన వారిని నియమించాలని లింగారెడ్డి డీఎస్ఓపై ఒత్తిడి తెచ్చారని పేర్కొంటున్నారు. లింగారెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే అకారణంగా డీఎస్వోను దూషించిన లింగారెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే సోమవారం నుంచి ఆందోళన చేపడతామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బీఏ వేదనాయకం హెచ్చరించారు. లింగారెడ్డి దిగిరాకుంటే ఉద్యోగుల మంతా సెలవుపై వెళతామన్నారు. -
చెప్పేందుకే...
సాక్షి ప్రతినిధి, కడప: ఒకనాడు ఉప్పు-నిప్పులా ఉన్న ప్రస్తుత టీడీపీ అభ్యర్థి వరదరాజులరెడ్డి, ఆయనకు మద్దతుగా నిలిచిన తాజా మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి పరస్పరం చేసుకున్న ఆరోపణలివి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఏడేళ్లు కాలయాపన చేశారు. ప్రొద్దుటూరు పట్టణ వాసులు తీవ్రమైన తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేవారు. ఈ సమస్యను తీర్చేందుకు కుందూ-పెన్నా వరద కాలువను రూపొందించారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.70 కోట్ల అంచనా వ్యయంతో పనులను మంజారు చేశారు. ఈపీసీ సిస్టమ్ ద్వారా పనులు దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులు రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా ఇష్టమొచ్చినట్లు అలైన్మెంట్ మార్చేవారు. దీంతో పలువురు కోర్టుకెళ్లారు. పర్లపాడు, కొత్తపేట గ్రామస్తులు కోర్టుకు వెళ్లడం వెనక లింగారెడ్డి ప్రమేయం ఉందని పలుమార్లు మాజీ ఎమ్మెల్యే వరద ఆరోపించారు. పెన్నా అనవాళ్లనే కోల్పోతున్న ప్రొద్దుటూరు... ప్రొద్దుటూరు అంటే టక్కున గుర్తుకొచ్చేవి మూడే అంశాలు... పెన్నా తాగునీరు, కన్యకాపరమేశ్వరీ అమ్మవారిశాల, బంగారు వ్యాపారం... వీటిల్లో పెన్నా నది అనవాళ్లు క్రమేపీ కనుమరుగు కావడంతో ప్రస్తుతం పట్టణవాసులు తాగునీటికి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పెన్నానది చెంతన ఉన్నప్పటికీ మూడు రోజులకు ఒకమారు నీరు సరఫరా అవుతుందంటే అక్కడి ఇబ్బందులను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకు ఒక కారణం ప్రకృతి సంపద ఇసుకను తరలించడం కాగా, మరో కారణం పెన్నానదిని ఆక్రమించి పరిశ్రమలను నెలకొల్పడమే అని పలువురు పేర్కొంటున్నారు. ఇసుకను యధేచ్ఛగా తరలించడం వెనుక రహస్య ‘హస్తం’ ఎవరిదనేది ప్రొద్దుటూరు వాసులకు తెలిసిన విషయమే. చెప్పేందుకే నీతులు... రాజకీయాల కోసం ఒకరిపై మరొకరు నిందారోపణలు చేసకుంటూ కాలం వెలిబుచ్చిన లింగారెడ్డి, వరదరాజులరెడ్డి ఇరువురూ ఒకే పార్టీ గొడుగు కిందకు చేరారు. కలిసికట్టుగా ఎన్నికల్లో పాలుపంచుకుంటున్నారు. ఏడేళ్ల క్రితం మంజూరైన వరదకాలువ పనుల్లో ఇలాగే వ్యవహరించి ఉంటే ఈపాటికి ఆపనులు పూర్తయి ప్రొద్దుటూరు దాహార్తికి బెంగలేకుండా పోయేది. రాజకీయాల కోసం ఏకమైన నేతలకు సమస్యల సాధనలో చిత్తశుద్ధి లేదనే ప్రత్యర్థుల ఆరోపణలకు బలం చేకూరుతోంది. బేషరతుగా తెలుగుదేశం పార్టీలో చేరి ఆపార్టీ టికెట్ సొంతం చేసుకున్న వరదరాజులరెడ్డి కుందూ-పెన్నా కాలువ పనుల్లో ఆ చాతుర్యం చూపలేకపోయారని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరదరాజులరెడ్డి శాంతివచనాలు పలుకుతూ అవకాశమిస్తే ప్రొద్దుటూరులో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని చెబుతున్నారు. మరి మూడు దశాబ్ధాలుగా ఆఇరువురి చేతుల్లోనే పాలనా పగ్గాలు ఉన్నాయి కదా.. అప్పుడేమైందని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
ఇద్దరు జిల్లా అధ్యక్షులు ఔట్!
సాక్షి ప్రతినిధి, కడప: ఆ ఇద్దరు వేరువేరు పార్టీలకు జిల్లా అధ్యక్షులు. ఒకరేమో ప్రత్యక్ష రాజకీయాల్లో అపార అనుభవం ఉన్ననేత. మరొకరు రాజకీయాల పట్ల అత్యంత ఉబలాటం ప్రదర్శించే నేత. ఇరువురు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆరాటపడ్డారు. వారిలో ఒకరికి టికెట్ రాగా మరొకరికి టికెట్ రాలేదు. ఇరువురు నామినేషన్లు దాఖలు చేసినా ఎన్నికల బరి నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డి ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం జిల్లా వ్యాప్తంగా కష్టపడ్డారు. మరోమారు టికెట్ దక్కుతుందని భావించిన తరుణంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సైంధవుని పాత్ర పోషించి అడ్డుకున్నారు. తనకు టికెట్ తప్పక వస్తుందని భావించిన లింగారెడ్డి అంతకు మునుపే టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ బీఫారం మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి దక్కడంతో స్వత ంత్ర అభ్యర్థిగా లింగారెడ్డి ఎన్నికల బరిలో ఉంటారని విశ్లేషకులు భావించారు. కాగా ఊహించనిరీతిలో బుధవారం ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆవిధంగా లింగారెడ్డి ఎన్నికల బరి నుంచి కాడి కింద వేశారు. సమైక్యాంధ్ర పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజాభిమాన్ని చూరగొంటూ వచ్చారు. అయితే ఒక్కమారు రాజకీయ ప్రవేశం చేయడంతో సామాజిక కార్యక్రమాల తెరవెనుక దాగి ఉన్న అసలు లక్ష్యం బహిర్గతమైందని పరిశీలకులు భావించారు. కడప అసెంబ్లీ అభ్యర్థిగా విన్నూతంగా ప్రచార పర్వాన్ని సాగిస్తూ వచ్చారు. అంతలోనే అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ తతంగం వెనుక అంతుచిక్కని వ్యవహారం దాగి ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. సాకుల కోసం వెతుకుతున్న నేతలు.... రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సర్వసాధారణం. కాలం కలిసివస్తే రాజకీయ ఎదుగుదల లభిస్తుంది. ఇవన్నీ అంచనా వేసుకునే రాజకీయాల్లో ప్రవేశిస్తుంటారు, అయితే ఆయా పార్టీల ప్రోత్సాహం కూడా అందుకు అవసరమే. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న లింగారెడ్డికి తెలుగుదేశం పార్టీ ద్రోహం చేసినట్లు పరిశీలకుల అభిప్రాయం. తన చిరకాల ప్రత్యర్థి వరదరాజులరెడ్డికి సహకరించకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని ఆయన అనుచరులు భావించారు. అనూహ్యంగా ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పార్టీ కోసమే పనిచేయాలనే తలంపు ఉంటే అనుచరులతో ఎందుకు నిందించినట్లు అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అదే విధంగా సింగారెడ్డి రామచంద్రారెడ్డి సైతం తాను స్వతంత్ర అభ్యర్థిగానైనా ఎన్నికల బరిలో నిలవాలనే తలంపుతో ఉన్న తరుణంలో సమైక్యాంధ్ర పార్టీ తన చేతుల్లోకి వచ్చి చేరిపోయింది. జిల్లా కన్వీనర్‌గా ఆయనకే బాధ్యతలు అప్పగించారు. ఆమేరకు కడప అసెంబ్లీ సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే పరిశీలకులు సైతం ఊహించని రీతిలో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అందుకు కారణాలుగా పార్టీ పోటీ చేయమందికానీ, ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు. పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ గౌస్‌పీర్‌ను కూడా తానే బరిలో నిలిపానని చెబుతున్నారు. ఇప్పుడు ఆయనే ఉపసంహరించుకోవడం వెనుక బలమైన కారణాలు ఉండవచ్చని పలువురు విశ్వసిస్తున్నారు. అటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, ఇటు సమైక్యాంధ్ర పార్టీ జిల్లా కన్వీనర్ సింగారెడ్డి రామచంద్రారెడ్డి ఇరువురు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఇరువురు నేతలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతు ఇచ్చేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకు కారణం కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి అని పలువురు చెప్పుకొస్తున్నారు. లింగారెడ్డితో అభ్యర్థి వాసు సుధీర్ఘ మంతనాలు నిర్వహించడంతోనే వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా శ్రీనివాసరెడ్డికి సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి సమీప బంధువు. సింగారెడ్డి కుటుంబానికి శ్రీనివాసులరెడ్డి మనవడు అవుతాడు. బంధువుల నుంచి వచ్చిన ఒత్తిడి, చర్చల ఫలితంగానే సింగారెడ్డి వెనక్కి తగ్గినట్లుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
లింగారెడ్డికి గ్రీన్‌సిగ్నల్!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రొద్దుటూరు తాజా మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సర్వశక్తులు ఒడ్డినా సిట్టింగ్‌ను తప్పించేందుకు చంద్రబాబు సమ్మతించలేదు. మెప్పించి, ఒప్పించాలనే సూత్రం విఫలం కావడంతో లోపాయికారీగా అధినేత సైగలు చేసినట్లు సమాచారం. ఆ మేరకు నామినేషన్ దాఖలుకు లింగారెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చినబాబు పర్యటనపై టికెట్ల గందరగోళం పడకుండా ఉండేందుకు పర్యటన ముగిసిన అనంతరం లింగారెడ్డి పేరును ప్రకటించనున్నట్లు సమాచారం. జిల్లాలో ఒకేఒక స్థానంలో తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల్లో గెలుపొందింది. ప్రొద్దుటూరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నంద్యాల వరదరాజులరెడ్డిపై 16వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో లింగారెడ్డి గెలుపొందారు. రాజకీయ పరిస్థితుల ప్రభావం కారణంగా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఉన్న లింగారెడ్డిలో అంతర్మధనం తీవ్రతరమైంది. టికెట్‌కు ఎక్కడ అడ్డు పడుతాడోనని మదనపాటుకు గురయ్యారు. అనుకున్నంతా అయింది, మాజీ ఎమ్మెలే వరదరాజులరెడ్డికి మద్దతుగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నిలిచారు. చంద్రబాబు ఎదుట ఆయనకు అనుకూలంగా పలురకాల వాదనలు చేసినట్లు సమాచారం. తలొగ్గని లింగారెడ్డి.... సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకపోతే చెడు సంకేతాలు వెళ్తాయని, లింగారెడ్డిని మెప్పించి, ఒప్పించుకోవాలని అధినేత చంద్రబాబు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు సూసించినట్లు తెలుస్తోంది. ఆమేరకు వరదరాజులరెడ్డి కోసం రమేష్ నాయుడు పలు రకాలుగా లింగారెడ్డికి ఆఫర్లు ఇచ్చినట్లు సమాచారం. ఇవేవి తనకు వద్దు..తెలుగుదేశం పార్టీ టికెట్ మాత్రమే కావాలనే దిశగా లింగారెడ్డి చర్యలు ఉండిపోయినట్లు తెలుస్తోంది. తుదకు చంద్రబాబు నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో నామినేషన్ కార్యక్రమ సన్నాహాలలో ఉన్నట్లు సమాచారం. ఈవిషయమై మాజీ ఎమ్మెల్యే వరద అనుచరులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. తమ మద్దతు లేకుండానే ఎన్నికల్లో పోటీ ఇవ్వగలరా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బుధవారం చంద్ర బాబు తనయుడు లోకేష్ పర్యటన ఉన్న నేపధ్యంలో లింగారెడ్డిపేరును అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది. పర్యటనపై ప్రభావం చూపకుండా ఉండేందుకు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. రైల్వేకోడూరుపై తర్జన భర్జన.... రైల్వేకోడూరు టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకటసుబ్బయ్య పేరును అధికారికంగా ప్రకటించారు. అయితే అతని కంటే మెరుగైన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వరప్రసాద్ పేరును కాంగ్రెస్ నేత ఒకరు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. గుంటి ప్రసాద్‌కు టికెట్ ఇచ్చినట్లయితే తాను కూడ మద్దతిస్తానని టీడీపీ నేతలకు సూచించినట్లు సమాచారం. ఆమేరకు ప్రస్తుతం తర్జన భర్జనలో ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థిని ప్రకటించాక వెనక్కి తగ్గితే ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందనే అంశంపై పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఆమేరకు పార్టీ శ్రేణులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత నుంచి సంపూర్ణ అభయం లభిస్తే పార్టీ అభ్యర్థిని మార్చే అవకాశం మెండుగా ఉన్నట్లు సమాచారం. -
టీడీపీ ఎమ్మెల్యే గారి కండకావరం
అది చేస్తాం... ఇది చేస్తాం...అన్ని చేస్తాం... అంటూ ఎన్నికలలో పోటీ చేసిన నాయకులు ఎన్నికల ముందు ఓట్లరు మహాశయులను ఓట్లు అడుగుతారు. వారి మాటలు నమ్మి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని సదరు నాయకులను గెలిపిస్తారు. ఆ తర్వాత ఆ నాయకుడు కనీసం ఓటరు మెహం కూడా చూడరు. తమకు అన్ని చేస్తామని చెప్పిన నాయకులు ఆ తర్వాత టీవీలలో అప్పుడప్పుడు అక్కడకక్కడ కనిపిస్తుంటారు. దాంతో ఆ నాయకులపై సదరు ఓటర్లు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఐదేళ్ల తర్వాత ఎన్నికల సమయం ఆసన్నం కాగానే మళ్లీ ఆ నాయకులే ప్రజలే దేవుళ్లు అంటు వారి ముందు వచ్చి వాలతారు. ఆ సమయంలో కొంత మంది ఓటర్లు ఆగ్రహం తారస్థాయికి చేరుకుంటుంది. మంగళవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓట్లు అడిగేందుకు వచ్చిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే లింగారెడ్డిని స్థానికుడు శ్రీనివాసులు అదే విషయాన్ని ప్రశ్నించాడు. అంతే సదరు ఎమ్మెల్యేగారుకి శ్రీనివాసులుపై కోపం కట్టలు తెంచుకుంది. నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఎమ్మెల్యే లింగారెడ్డి ... శ్రీనివాసు చెంప ఛెళ్లు మనిపించాడు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ప్రశ్నిస్తే కొడతారా అంటూ అక్కడ ఉన్న స్థానికులు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.