టీడీపీ ఎమ్మెల్యే గారి కండకావరం | Common man attacked by Proddatur TDP MLA Linga Reddy | Sakshi

టీడీపీ ఎమ్మెల్యే గారి కండకావరం

Published Tue, Mar 25 2014 1:35 PM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM

టీడీపీ ఎమ్మెల్యే గారి కండకావరం

టీడీపీ ఎమ్మెల్యే గారి కండకావరం

ఎన్నికల ముందు అది చేస్తాం... ఇది చేస్తాం...అన్ని చేస్తాం... అంటూ ఎన్నికలలో పోటీ చేసిన నాయకులు ఓట్లరు మహాశయులను ఓట్లు అడుగుతారు.

అది చేస్తాం... ఇది చేస్తాం...అన్ని చేస్తాం... అంటూ ఎన్నికలలో పోటీ చేసిన నాయకులు ఎన్నికల ముందు ఓట్లరు మహాశయులను ఓట్లు అడుగుతారు. వారి మాటలు నమ్మి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని సదరు నాయకులను గెలిపిస్తారు. ఆ తర్వాత ఆ నాయకుడు కనీసం ఓటరు మెహం కూడా చూడరు. తమకు అన్ని చేస్తామని చెప్పిన నాయకులు ఆ తర్వాత టీవీలలో అప్పుడప్పుడు అక్కడకక్కడ కనిపిస్తుంటారు. దాంతో ఆ నాయకులపై సదరు ఓటర్లు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.


ఐదేళ్ల తర్వాత ఎన్నికల సమయం ఆసన్నం కాగానే మళ్లీ ఆ నాయకులే ప్రజలే దేవుళ్లు అంటు వారి ముందు వచ్చి వాలతారు. ఆ సమయంలో కొంత మంది ఓటర్లు ఆగ్రహం తారస్థాయికి చేరుకుంటుంది. మంగళవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓట్లు అడిగేందుకు వచ్చిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే లింగారెడ్డిని స్థానికుడు శ్రీనివాసులు అదే విషయాన్ని ప్రశ్నించాడు. అంతే సదరు ఎమ్మెల్యేగారుకి శ్రీనివాసులుపై కోపం కట్టలు తెంచుకుంది. నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఎమ్మెల్యే లింగారెడ్డి ... శ్రీనివాసు చెంప ఛెళ్లు మనిపించాడు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ప్రశ్నిస్తే కొడతారా అంటూ అక్కడ ఉన్న స్థానికులు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement