Know How Common Man Became Owner Of Rs 90 Crores Overnight In China Shanghai - Sakshi
Sakshi News home page

China Common Man Becomes Rich: భార్యాపిల్లల గుర్తుగా చేసిన పనికి.. రూ. 90 కోట్లు అదృష్టం వరించింది!

Published Wed, Jul 19 2023 12:49 PM | Last Updated on Thu, Jul 20 2023 5:32 PM

common man became owner of 90 crores rs overnight - Sakshi

అతను ఉద్యోగ రీత్యా భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడు. దీంతో తరచూ అతనికి భార్యాపిల్లలు గుర్తుకురాసాగారు. ఈ నేపధ్యంలో అతను చేసిన ఒకపని అతనిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. అదికూడా ఒకటో రెండో కాదు.. ఏకంగా 90 కోట్లకు యజమానిగా మారిపోయాడు. ఈ విషయాన్ని అతను కుటుంబ సభ్యులు అతనికి తెలియజేసినప్పుడు వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఉదంతం చైనాలోని హాంగ్ఝూలో చోటుచేసుకుంది. 

సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపిన వివరాల ప్రకారం 30 ఏళ్ల ఈ వ్యక్తి ఇంటికి దూరంగా ఉంటూ జాబ్‌ చేస్తుంటాడు. అతను ఇంటికి రావడం కూడా తక్కువే. దీంతో అతనికి భార్యాపిల్లలు తరచూ గుర్తుకొస్తుంటారు. ఈ నేపధ్యంలో అతను తన భార్యాపిల్లల డేట్‌ ఆఫ్‌ బర్త్‌ నంబర్లతో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసేవాడు. ఈ వ్యవహారం చాలా రోజులుగా నడుస్తుండేది. అయితే ఇప్పుడు అతనికి అదృష్టం తన్నుకుంటూ వచ్చింది. ఆయన కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్‌ ఇప్పుడు కోట్లు కొల్లగొట్టింది. 

ఆ అదృష్టవంతుని పేరు వెల్లడికానప్పటికీ హాంగ్ఝూకు చెందిన ఆ వ్యక్తి తన భార్యాపిల్లల డేట్‌ ఆఫ్‌ బర్త్‌ నంబరుతో కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్‌ సిరీస్‌.. 77 మిలియన్ల యువాన్లు(రూ. 90 కోట్లకు పైగా మొత్తం) గెలుచుకుంది. ఆ వ్యక్తి ఈ నెల మొదట్లో రూ. 300 వెచ్చించి 15 లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశాడు. 11న లాటరీ ఫలితాలు వెలువడగా, అతను 77.1 మిలియన్ల యువాన్లు గెలుచుకున్నాడు. ఈ ఉదంతానికి సంబంధించిన పోస్టు చూసిన నెటిజన్లు అదృష్టం ఎప్ప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరన్నారు.
ఇది కూడా చదవండి: ఆ నీలి కళ్ల చాయ్‌వాలా.. మోడలింగ్‌ తర్వాత లండన్‌లో మొదలెడుతున్న పని ఇదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement