common man
-
మము బ్రోవమని...
సామాన్యుడు.. ఏంటో ఎన్ని బడ్జెట్లు వచ్చినా.. దేశంలో వీడు మాత్రం ఎప్పుడూ సామాన్యుడిగానే మిగిలిపోతున్నాడు.. ఆకాశాన్నంటే ధరలతో.. వాటితో ఏ మాత్రం పొంతన కుదరని వేతనాలతో కుటుంబ బడ్జెట్‌ను కంట్రోల్ చేయలేక.. కిందా మీదా పడుతూనే ఉన్నాడు. మళ్లా బడ్జెట్ వస్తోంది. పరిశ్రమలకు చెందిన పెద్ద పెద్దోళ్లంతా అవి కావాలి.. ఇవి కావాలి అని అడుగుతున్నారు. సామాన్యుడూ వినతుల చిట్టాను విప్పాడు.నను బ్రోవమంటున్నాడు.. ‘సీత’మ్మ తల్లీ.. తన మొర వింటావా మరి..1. ధరలకు కళ్లెం వేయాలి..కూరగాయలు, నూనెలు, పప్పులు, పాలు.. ఇలా నిత్యావసరాల ధరలన్నీ కొండెక్కిపోయాయి. దీంతో జేబుకు మరింత చిల్లు పడుతోంది. ముందు ముందు మరింతగా ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు కూడా చెబుతున్నాయి. పామాయిల్ ధర పెరగడం వల్ల బిస్కట్లు లాంటి ప్యాకేజ్డ్ ఫుడ్ రేట్లూ పెరిగాయి. ఈ క్రమంలో ధరా భారం నుంచి ఉపశమనం కల్పించాలి. నూనెలపై దిగుమతి పన్ను తగ్గించడంతోపాటు ఇతర నిత్యావసరాల ధరల కట్టడికి చర్యలు ప్రకటించాలి. – సాక్షి సెంట్రల్ డెస్క్2. వేతనాల్లో వేగం పెంచాలి..ధరలు అలా ఉంటే.. జీతాల పెరుగుదల నత్తనడకను తలపిస్తోంది. జూనియర్ల నుంచి మధ్యస్థాయి ఉద్యోగులతోపాటు అసంఘటిత రంగంలోని కార్మికుల వేతనాల పరిస్థితీ ఇలాగే ఉంది. ఫిక్కీ, స్టాఫ్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ గణాంకాల ప్రకారం... గత 12 నెలల్లో అసంఘటిత రంగ కార్మికుల వేతనాలు కేవలం 3.4 శాతం, ఉద్యోగుల జీతాలు 6.5 శాతం పెరిగాయి. ఇంజనీరింగ్, మ్యాన్యుఫాక్చరింగ్, ఇన్ఫ్రా ఉద్యోగుల వేతనాలు 0.8శాతమే పెరిగాయి. ఈ క్రమంలో వేతనాల పెరుగుదలకు తోడ్పడేలా బడ్జెట్లో చర్యలు ఉండాలి.3.ఉద్యోగ అవకాశాలు పెరగాలికరోనా సమయంలో పట్టణాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయి.. చాలా మంది వ్యవసాయం వైపు మళ్లినట్టు గణాంకాలు చెబుతు న్నాయి. కానీ అక్కడా సరైన ఆదాయం లేక, తిరిగి ఉద్యోగం చేయడానికి సిద్ధమైనా... అవకాశాలు లభించని పరిస్థితి ఉంది. అదే సమయంలో చదువు పూర్తిచేసుకుని ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారు మరెందరో ఉన్నా రు. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచడంతోపాటు ప్రైవేటు రంగంలో పెట్టుబ డులను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉంది. 4.పన్నుల మోత తగ్గించాలితక్కువ, మధ్యస్థాయి ఆదాయ వర్గాలపై పన్నుల భారం ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా వంట నూనెలపై పన్నుల తగ్గింపు, పెట్రోల్, డీజిల్‌ల ధరల నుంచి ఉపశమనం కల్పించాలనే డిమాండ్ చాలా రోజులుగా వినవస్తోంది. అదే సమయంలో వ్యక్తిగత ఆదాయ పన్నులో మినహాయింపులు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ చర్యలతో మా జీవన ప్రమాణాలు పెరిగేందుకు వీలవుతుంది.ఆర్థిక వ్యవస్థ మందగమనంతో..2024–25లో దేశ ఆర్థికవృద్ధి 6.4 శాతంగా ఉంటుందని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్ఓ) అంచనా వేసింది. కరోనా తర్వాతి కాలంలో ఇదే అతి తక్కువ వృద్ధి కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం తగ్గడమూ దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ మందగమనంతో మార్కెట్లో అన్ని రంగాల్లో డిమాండ్ తగ్గిపోయిందని అంటున్నారు. ప్రభుత్వ వ్యయం పెరిగితే.. క్షేత్రస్థాయిలో ఆర్థిక వృద్ధికి, మార్కెట్లో డిమాండ్ పెరగడానికి దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఈ దిశగా అడుగులు పడితే... మాకు మేలు జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ దిశగా మీరు ఆలోచించాలి. -
పట్టపగలే చుక్కలు లెక్కపెట్టించిన చంద్రబాబు
-
అతను పెద్ద నటుడు.. గురువును మించిన శిష్యుడు
-
నాకు సీఎం సార్ కావాలి...ప్రగతి భవన్ ముందు యువకుడు హల్ చల్
-
ఎన్నికల తంతు ముగియగానే పాక్‌లో ధరల మోత!
పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే ద్రవ్యోల్బణం దడ పుట్టించడం మొదలుపెట్టింది. దేశంలోని తాత్కాలిక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌తో పాటు దేశీయ వంటగ్యాస్ ధరలను మరోమారు పెంచింది. ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజల వెన్ను విరిగింది. పాక్‌లో ధరల పెరుగుదల ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ఆదివారం కరాచీలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ పలువురు ఆందోళన చేపట్టారు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ తమను అప్పులపాలు చేస్తున్నదని ఆందోళనకారులు వాపోయారు. ధరల పెరుగుదల పలు ఇబ్బందులను సృష్టిస్తున్నదని కరాచీలో దాబా నిర్వహిస్తున్న ఇర్ఫాన్ వాపోయారు. రాబోయే ప్రభుత్వం కూడా విఫలమవుతున్నట్లు కనిపిస్తోందని, గ్యాస్ బిల్లులు కట్టలేకపోతున్నామని తెలిపారు. గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు తగ్గించారని, ధరల నియంత్రణకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 12,500 (పీకేఆర్)కు చేరడంతో ఈ మొత్తాన్ని వాయిదాల్లో చెల్లిస్తున్నామని తెలిపారు. రోజుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రోజువారీ కూలీగా పనిచేస్తున్న అబిద్ మాట్లాడుతూ ‘నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పాలు, చక్కెర, గోధుమలు, బియ్యం లాంటివి కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాం. ఇంటి అద్దె కూడా కట్టలేక పోతున్నాం. రోజంతా కష్టపడితే కేవలం 900 పాకిస్తాన్ రూపాయలు సంపాదిస్తాను. దీంతో ఇంటి అద్దె నెలకు రూ. 7,500(పీకేఆర్) ఎలా చెల్లించాలని’ అబిద్ ప్రశ్నించారు. ఇంటి యజమానులు వంట కోసం కలపను వినియోగించడానికి అనుమతించకపోవడంతో, ఇప్పటికి కనీసం మూడు ఇళ్లు మార్చానని, వంట గ్యాస్ కొనలేక నానా ఇబ్బందులు పడుతున్నానని అబిద్ వాపోయారు. -
Parliament: లోక్‌సభకు పొగ
కట్టుదిట్టమైన బందోబస్తు ఉండే పార్లమెంటు మూడంచెల భద్రత వ్యవస్థను ఇద్దరు సామాన్యులు ఏమార్చారు. బూట్లలో పొగ గొట్టాలు దాచుకుని మరీ బుధవారం సాధారణ సందర్శకుల్లా దర్జాగా లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించారు. జీరో అవర్ కొనసాగుతుండగా గ్యాలరీలోంచి సభా ప్రాంగణంలోకి దూకి.. స్పీకర్ స్థానంకేసి దూసుకెళ్లి కలకలం రేపారు. ‘నిరంకుశత్వం నశించాలి, నల్ల చట్టాలు పోవా’లని నినదిస్తూ, పొగ గొట్టాలను విసిరేశారు. వాటి నుంచి వచ్చి న పసుపు రంగు పొగతో ఎంపీలు భయాందోళనలకు లోనయ్యారు. చివరికి వారే చొరవ చేసి ఇద్దరినీ నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ఆవరణ బయట కూడా ఇద్దరు వ్యక్తులు పొగ గొట్టాలు విసిరి కలకలం రేపారు. వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురికీ మరో ఇద్దరు కూడా సహకరించినట్టు తేల్చారు. సరిగ్గా 22 ఏళ్ల కింద పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి ప్రయతి్నంచిన రోజే జరిగిన ఈ ఉదంతం సంచలనం రేపింది. దీనిపై పార్టీలకతీతంగా ఎంపీలు, నేతలు ఆందోళన వెలిబుచ్చారు. సభలోకి దూకిన వారు మైసూరు ఎంపీ (బీజేపీ) ప్రతాప్ సింహ సిఫార్సుతో విజిటర్స్ గ్యాలరీ పాస్ సంపాదించినట్టు తేలింది. సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం మధ్యాహ్నం. ఒంటి గంట సమయం. లోక్‌సభలో జీరో అవర్ ముగింపుకు వచ్చింది. బీజేపీ సభ్యుడు ఖగేన్ ముర్ము మాట్లాడుతుండగా ఉన్నట్టుండి పెద్ద శబ్దం! ఏమైందో అర్థం కాక లోక్‌సభ సభ్యులంతా ఒక్కసారిగా అయోమయానికి లోనయ్యారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఎవరో సభలోకి పడిపోయారని తొలుత భావించారు. అదేమీ కాదని, ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే సభలోకి దూకాడని అర్థమై బిత్తరపోయారు. ఆలోపే మరో వ్యక్తి కూడా సభలోకి దూకి మరింత కలకలం రేపాడు. ఇద్దరూ బెంచీలపై గెంతుతూ స్పీకర్‌ను చేరుకునేందుకు వెల్‌కేసి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. బూట్లలోంచి పొగ గొట్టాలు తీసి విసిరారు. వాటినుంచి వెలువడ్డ పొగ హాలంతటా కమ్ముకుంది. ఈ పరిణామాలతో ఎంపీలు తీవ్ర ఆందోళనకు లోనై అటూ ఇటూ పరుగులు తీశారు. చివరికి ఎంపీలు, భద్రతా సిబ్బంది వారిని నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ప్రాంగణం బయట కూడా పొగ గొట్టాలు విసిరి కలకలం రేపిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 2001లో సరిగ్గా డిసెంబర్ 13వ తేదీనే పాకిస్తాన్‌లోని లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంపై దాడికి తెగబడి విచ్చలవిడి కాల్పులతో తొమ్మిది మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. తాజా ఉదంతంపై కేంద్ర హోం శాఖ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. తీవ్ర భద్రతా లోపం: ఎంపీలు ఘటన అనంతరం మధ్యాహ్నం రెండింటికి లోక్‌సభ తిరిగి సమావేశమయ్యాక సభ్యులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. 2001 దాడి అనంతరం ఇది అతి తీవ్రమైన భద్రతా లోపమంటూ మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 13లోగా పార్లమెంటుపై దాడికి పాల్పడతానంటూ ఖలీస్థానీ వేర్పాటువాది గురుపర్వత్ సింగ్ పన్ను హెచ్చరించిన విషయాన్ని కొందరు సభ్యులు గుర్తు చేశారు. మొదటి వ్యక్తి తన సమీపంలోనే సభలోకి దూకాడని జేడీ(యూ) ఎంపీ రామ్‌ప్రీత్ మండల్ చెప్పారు. తామంతా తీవ్ర ఆందోళనతో అటూ ఇటూ పరుగులు తీశామన్నారు. వాళ్ల దగ్గర బాంబు, మారణాయుధాలుంటే పరిస్థితేమిటని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభను వాయిదా వేసి ఈ ఉదంతంపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. కేంద్రం తక్షణం క్షమాపణ చెప్పాలని, పార్లామెంటు భద్రతను తక్షణం మరింత కట్టుదిట్టం చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దుండగులకు పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ సింహాను విచారించాలన్నారు. ఆయన్ను తక్షణం సభ నుంచి బహిష్కరించాలని తృణమూల్ సభ్యులు డిమాండ్ చేశారు. ఇలా జరిగింది... సభలోకి దూకి కలకలం రేపిన వారిని కర్ణాటకలోని మైసూరుకు చెందిన డి.మనోరంజన్ (34), యూపీలోని లక్నోకు చెందిన సాగర్ శర్మ (26)గా గుర్తించారు. జీరో అవర్ కాసేపట్లో ముగుస్తుందనగా ముందుగా సాగర్ ఒక్కసారిగా గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. దాంతో ఎంపీలు షాక్‌కు గురై అటూ ఇటూ పరుగులు తీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఆరెల్పీ ఎంపీ హనుమాన్ బెనీవాల్ అతన్ని పట్టుకునేందుకు ప్రయతి్నస్తుండగానే మరో వ్యక్తి కూడా గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. ఇద్దరూ వెల్‌కేసి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదటి వ్యక్తిని బెనీవాల్ తదితర ఎంపీలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. నియంతృత్వం చెల్లదని అతను నినాదాలు చేశాడు. ‘‘దగ్గరికి రావద్దు. మేం దేశభక్తులం. నిరంకుశత్వంపై నిరసన తెలపడానికే వచ్చాం’’ అంటూ బిగ్గరగా అరిచాడు. ఇద్దరూ తమ బూట్ల నుంచి పొగ గొట్టం వంటివాటిని తీసి విసిరారు. వాటినుంచి వెలువడ్డ పసుపు రంగు పొగ సభ అంతటా వ్యాపించడంతో ఎంపీలంతా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. తర్వాత ఎంపీలంతా కలిసి వారిని నిర్బంధించారు. బాగా దేహశుద్ధి చేసి పార్లమెంటు సిబ్బందికి అప్పగించారు. వెంటనే సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను గంటపాటు వాయిదా వేశారు. సభలో లేని మోదీ, అమిత్ షా ఘటన జరిగినప్పుడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అర్జున్‌రామ్ మేఘ్వాల్తో పాటు కాంగ్రెస్ సభ్యులు రాహుల్ గాందీ, అదీర్ రంజన్ చౌధరి సహా మొత్తం 100 మందికి పైగా ఎంపీలు సభలో ఉన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేరు. ఆరుగురూ ఒకే ఇంట్లో... పార్లమెంటు ఆవరణలో పొగ గొట్టాలు విసిరి పట్టుబడ్డ వారిని హరియాణాలోని హిస్సార్‌కు చెందిన నీలమ్ (42), మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండే (25)గా గుర్తించారు. వీరికి, మనోరంజన్, సాగర్లకు లలిత్, విశాల్ అనే మరో ఇద్దరు కూడా సహకరించినట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. విశాల్‌ను గురుగ్రాంలో పట్టుకున్నారు. ఐదుగురినీ లోతుగా విచారిస్తున్నారు. ఆరుగురూ గ్యాలరీలోకి వెళ్లాలనుకున్నా ఇద్దరికే పాస్ దొరికినట్టు సమాచారం. వీరందరికీ కనీసం నాలుగేళ్లుగా పరిచయముందని, సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండేవారని చెబుతున్నారు. అంతాకొంతకాలంగా గురుగ్రాంలో లలిత్ ఇంట్లో నే ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. వీరు 3 నెలలుగా పార్లమెంటు పాస్‌ల కోసం ప్రయతి్నస్తున్నట్టు విచారణలో తేలింది. ఎవరీ సింహా? దుండగులకు విజిటర్స్ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మాజీ జర్నలిస్టు. కర్ణాటకలోని మైసూరు నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ జీవిత చరిత్ర రాశారు. పార్లమెంటు కార్యకలాపాలు చూస్తామంటూ మనోరంజన్ పాస్‌లు తీసుకున్నట్టు ఎంపీ కార్యాలయం తెలిపింది. ఇలా నియోజకవర్గాల ప్రజలకు ఎంపీలు పాస్‌లు జారీ చేయడం మామూలేనంది. తాజా ఘటన నేపథ్యంలో పార్లమెంటులోకి సందర్శకులకు పాస్‌ల జారీని నిలిపేశారు. -
బాబుపై అదిరిపోయే కౌంటర్..
-
రికార్డు స్థాయిలో కిలో టమోటా రూ.200
-
భార్యాపిల్లలపై ప్రేమ.. రూ. 90 కోట్ల అదృష్టం తెచ్చిపెట్టింది!
అతను ఉద్యోగ రీత్యా భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడు. దీంతో తరచూ అతనికి భార్యాపిల్లలు గుర్తుకురాసాగారు. ఈ నేపధ్యంలో అతను చేసిన ఒకపని అతనిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. అదికూడా ఒకటో రెండో కాదు.. ఏకంగా 90 కోట్లకు యజమానిగా మారిపోయాడు. ఈ విషయాన్ని అతను కుటుంబ సభ్యులు అతనికి తెలియజేసినప్పుడు వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఉదంతం చైనాలోని హాంగ్ఝూలో చోటుచేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం 30 ఏళ్ల ఈ వ్యక్తి ఇంటికి దూరంగా ఉంటూ జాబ్ చేస్తుంటాడు. అతను ఇంటికి రావడం కూడా తక్కువే. దీంతో అతనికి భార్యాపిల్లలు తరచూ గుర్తుకొస్తుంటారు. ఈ నేపధ్యంలో అతను తన భార్యాపిల్లల డేట్ ఆఫ్ బర్త్ నంబర్లతో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసేవాడు. ఈ వ్యవహారం చాలా రోజులుగా నడుస్తుండేది. అయితే ఇప్పుడు అతనికి అదృష్టం తన్నుకుంటూ వచ్చింది. ఆయన కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్ ఇప్పుడు కోట్లు కొల్లగొట్టింది. ఆ అదృష్టవంతుని పేరు వెల్లడికానప్పటికీ హాంగ్ఝూకు చెందిన ఆ వ్యక్తి తన భార్యాపిల్లల డేట్ ఆఫ్ బర్త్ నంబరుతో కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్ సిరీస్.. 77 మిలియన్ల యువాన్లు(రూ. 90 కోట్లకు పైగా మొత్తం) గెలుచుకుంది. ఆ వ్యక్తి ఈ నెల మొదట్లో రూ. 300 వెచ్చించి 15 లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశాడు. 11న లాటరీ ఫలితాలు వెలువడగా, అతను 77.1 మిలియన్ల యువాన్లు గెలుచుకున్నాడు. ఈ ఉదంతానికి సంబంధించిన పోస్టు చూసిన నెటిజన్లు అదృష్టం ఎప్ప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరన్నారు. ఇది కూడా చదవండి: ఆ నీలి కళ్ల చాయ్‌వాలా.. మోడలింగ్ తర్వాత లండన్‌లో మొదలెడుతున్న పని ఇదే.. -
ఉద్యోగాలు కోల్పోతున్న గూగుల్ ఉద్యోగులు
-
సామాన్యునికి ప్రభుత్వ పథకాలు మరింత చేరువ
న్యూఢిల్లీ: సామాన్యునికి ఇక ప్రభుత్వ పథకాలు మరింత సులభతరంగా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న వివిధ పథకాల పంపిణీ కోసం ‘జన్ సమర్థ్’ పేరుతో ఒక ఉమ్మడి పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కనిష్ట ప్రభుత్వ జోక్యం– గరిష్ట పాలన ప్రయోజనాలకు సంబంధించిన నరేంద్ర మోదీ ప్రభుత్వ దార్శనికతలో భాగంగా, కొత్త పోర్టల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రారంభంలో 15 క్రెడిట్–లింక్డ్ ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం స్పాన్సర్ చేస్తున్న పథకాలలో కొన్ని బహుళ సంస్థల ప్రమేయం ఉన్నందున, అనుకూలతలు, అవకాశాలను బట్టి అందించే ప్రయోజనాలు, పథకాల సంఖ్యను విస్తరించడం జరుగుతుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఉదాహరణకు, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్సీఎస్ఎస్) వంటి పథకాలు వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత పోర్టల్ ఈ పథకాలను ఒకే ప్లాట్‌ఫారమ్‌పై తీసుకురావాలని భావిస్తోంది. తద్వారా పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు ఎక్కువ ఇబ్బంది లేకుండా పొందవచ్చు. పోర్టల్ అమలుపై పైలట్ టెస్టింగ్ జరుగుతోందని ఉన్నత వర్గాలు వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇతర రుణదాతలు ఈ విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రారంభానికి ముందే ఎటువంటి సమస్యలూ లేకుండా ఈ పోర్టల్‌ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఈ వేదికపై రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలు కూడా తమ పథకాలను అందించడానికి వీలుగా పోర్టల్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సూత్రప్రాయ ఆమోద పొందిన తర్వాత తాజా ప్రతిపాదిత పోర్టల్ ద్వారా కేవలం 7–8 పని దినాలలో రుణం పంపిణీ జరుగుతుందని భావిస్తున్నారు. ‘59 నిముషాల పోర్టల్’తో బహుళ ప్రయోజనాలు కాగా, రుణగ్రహీతలకు సౌకర్యాన్ని అందించడానికి వీలుగా ప్రభుత్వం 2018లో సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, గృహాలు, ఆటో వ్యక్తిగత రుణాలతో సహా వివిధ రకాల క్రెడిట్ సౌలభ్యత కోసం జ్టి్టp:// pటb ్చౌnటజీn59 ఝజీnu్ట్ఛట. ఛిౌఝ పోర్టల్‌ను ప్రారంభించింది. తద్వారా రుణగ్రహీతల కేవలం 59 నిమిషాల్లో వివిధ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా తగిన రుణ ఆమోదాలను పొందే సౌలభ్యత ఏర్పడింది. అంతక్రితం 20–25 రోజుల టర్నరౌండ్ సమయంతో పోలిస్తే 59 నిముషాలకు సంబంధించిన పోర్టల్ రుణ గ్రహీతలకు ఎంతో ప్రయోజనం కల్పించింది. ఈ ప్రక్రియలో మంజూరు దశ వరకు పోర్టల్ మానవ ప్రమేయం లేకుండా రుణ దరఖాస్తులు ప్రాసెస్ అవుతాయి. సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ఏదీ సూత్రప్రాయ ఆమోదం కోసం భౌతికంగా ఎటువంటి పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు, జీఎస్టీ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్లు మొదలైన అనేక మూలాల నుండి డేటా పాయింట్లను విశ్లేషించడానికి పోర్టల్ అధునాతన అల్గారిథమ్‌లపై ఆధారపడి పనిచేస్తుంది. రుణగ్రహీతల అర్హతను తనిఖీ చేయడానికి మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) కోసం ప్రభుత్వ క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్‌తో తాజా ప్లాట్‌ఫామ్ అనుసంధానమై ఉంటుంది. పోర్టల్ ప్రారంభించిన మొదటి రెండు నెలల్లో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు చెందిన 1.12 లక్షల రుణ దరఖాస్తులకు ప్రభుత్వ బ్యాంకులు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపాయి. మొత్తం రూ.37,412 కోట్లు మంజూరయ్యాయి. -
జాక్–మా ఏమయ్యాడో? ఎక్కడున్నాడో
Alibaba CEO Jack Ma Missing Story: ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు! అలాగే ఏదైనా ఒక్క పొరపాటు, లేదా నిర్ణయం కూడా మనిషిని అమాంతం అగాధంలోకి నెట్టేయవచ్చు... ఈ–కామర్స్ కుబేరుడు ‘జాక్–మా’ విషయంలోనూ ఇదే జరిగింది. అలీబాబా పోర్టల్‌తో చైనా వస్తువులను ప్రపంచమంతా ఎగుమతి చేస్తూ... కోట్లకు కోట్లు వెనకేసుకుని సుఖాసీనుడై ఉన్న దశలో... అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను... కలవాలని బుద్ధి పుట్టడం కాస్తా అతని పాలిట శాపమైంది... ‘జాక్–మా’ ప్రాభవాన్ని అనూహ్యంగా తగ్గించేసింది. ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినా... కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం కన్నెర్ర చేస్తే.. ఎక్కడున్నాడో... ఏమైపోయాడో? తెలియనంతగా జాక్–మా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఉక్కుపిడికిలిలో చిక్కిన ఉడుతలా విలవిల్లాడిపోయాడు. ఏమా కథ కమామిషు!!! సరిగ్గా ఏడాది క్రితం నాటి మాట. అలీబాబాతో అప్పటికే ఈ కామర్స్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిన జాక్–మా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ఐపీవోకు వెళుతన్న సమయం అది. ‘ఆల్ ఈజ్ వెల్’ అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఆకస్మాత్తుగా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అలీబాబా సామ్రాజ్యంపై పంజా విసిరింది. రాత్రికి రాత్రి జాక్–మా రెక్కలు కత్తిరించేసింది. ఆ తరువాత జాక్–మా ఏమయ్యాడో? ఎక్కడున్నాడో కొంత కాలం పాటు ఎవరికీ తెలియలేదు. జైలు నిర్బంధంలో ఉన్నాడని కొందరు, దేశం వదిలి పోయాడని ఇంకొందరు చెప్పుకొచ్చారు కానీ.. వాస్తవం ఏమిటో జాక్–మా, చైనా ఉన్నతాధికారులకు మాత్రమే తెలుసు. సుదీర్ఘ విరామం తరువాత జాక్ తొలిసారి కొన్ని రోజుల క్రితం యూరప్‌లో మళ్లీ ప్రత్యక్షమవడం అతడి ఆంట్ కార్పొరేషన్లో పెట్టుబడులు పెట్టినవారికి ఎంతో ఉత్సాహం కలిగించింది. యూరప్‌లో జాక్ తాజా వ్యాపకం ఏమిటో తెలుసా? ఉద్యానవన పంటలు పండించడం అట! అంతా బాగానే ఉంది కానీ... ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తులో ఉన్న ఈ ఈకామర్స్ రాజు రాత్రికి రాత్రి అధఃపాతాళానికి ఎలా పడిపోయాడు? ఏం జరిగింది? ఈ విషయం తెలుసుకోవాలంటే... నాలుగేళ్ల వెనక్కు వెళ్లాలి. ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో జాక్–మా చైనా నవతరం ప్రతినిధి. అప్పట్లో జాక్–మా ప్రాభవం అంతా ఇంతా కాదు. చైనా తరఫు దౌత్యవేత్త స్థాయిలో ఉండేవాడు. తెరవెనుక ఏం జరిగిందన్నది మనకు తెలియకపోయినా ఓ శుభ ముహూర్తంలో ఈయన అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎన్నికై అధికార బాధ్యతలు చేపట్టాల్సిన డొనాల్డ్ ట్రంప్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. 2017లో న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌లో జనవరి తొమ్మిదిన ట్రంప్‌తో సిట్టింగ్ వేయడమే కాకుండా.. ఓ పదిలక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలిచ్చేస్తానని భరోసా కూడా ఇచ్చేశారు. అంత పెద్ద వాణిజ్యవేత్త కదా.. ఉద్యోగాలు కల్పిస్తే ఏమిటి తప్పు? అని అనుకోవచ్చు. అయితే ఇక్కడే ఉంది మతలబు. జాక్ – మా హామీలు మాత్రమే కాదు.. ట్రంప్‌తో అతడి సమావేశంపై చైనా ప్రభుత్వానికి వీసమెత్తు అవగాహన లేదు. ట్రంప్‌తో సమావేశం జరిగిన కొన్ని రోజులకు అలీబాబా ప్రధాన కార్యాలయం లాబీలో జాక్–మా నిర్వహించిన పత్రికా సమావేశం ద్వారా ఇతరులతోపాటు చైనా ప్రభుత్వానికీ ఈ సంగతులన్నీ తెలిశాయి! ఇది ప్రభుత్వ పెద్దలకు అంతగా రుచించలేదు. ఇరుపక్షాల మధ్య వైరానికి బీజం పడింది ఇక్కడే! అప్పటికే ఉప్పు.. నిప్పు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో చైనాపై తీవ్రస్థాయి విమర్శలు చేసిన నేపథ్యంలో అతడు అధ్యక్ష పదవి చేపట్టే నాటికే ట్రంప్‌కు, చైనాకు మధ్య వ్యవహారం ఉప్పు–నిప్పు చందంగానే ఉండింది. ఆ దశలో జాక్–మా, ట్రంప్‌ల మీటింగ్ జరగడంతో సమస్య మొదలైంది. ఆ తరువాత కూడా జాక్– మా 2018– 2020 మధ్యలో పలువురు దేశాధ్యక్షులు, ఉన్నతాధికారులను కలుస్తుండటం జిన్ పింగ్ నేతృత్వంలోని చైనా ప్రభుత్వానికి అంతగా రుచించలేదు. గత ఏడాది అక్టోబరులో జాక్ – మా ఓ ఉపన్యాసం చేస్తూ.. చైనాలో సృజనాత్మకతను తొక్కేస్తున్నారని వ్యాఖ్యానించడంతో వ్యవహారం ముదిరింది. నవంబరు 5న జాక్–మా ఐపీవో ఉండగా రెండు రోజుల ముందే దాన్ని రద్దు చేశారు. బోర్డును రద్దు చేసి పునఃవ్యవస్థీకరించాలని చెప్పడంతోపాటు మా కంపెనీలపై దాడులు మొదలయ్యాయి. పలు అక్రమాలు జరిగాయంటూ మా చేత ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 275 కోట్ల డాలర్ల జరిమానా కట్టించుకున్నారు. ఒకానొక దశలో జాక్–మా దాదాపు మూడు నెలలపాటు అజ్ఞాతంలోనే ఉండాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. మారిపోయిన సీన్... చైనా ప్రభుత్వం దాడుల తరువాత జాక్ – మా పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ ఏడాది మొదట్లో ‘మా’ జిన్‌పింగ్‌కు ఒక లేఖ రాస్తూ.. జీవితాంతం చైనా గ్రామీణుల విద్యాభివృద్ధికి కేటాయిస్తానని, కనికరించమని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. గత నెలలో జాక్–మా కే చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక మా వ్యవసాయ, పర్యావరణ సంబంధిత అధ్యయనం కోసం యూరప్ వెళుతున్నారని ప్రకటించడంతో ఆయన ఉనికి మళ్లీ ప్రపంచానికి తెలిసింది. వారం రోజుల క్రితం మా ఓ పూలకుండీతో ఫొటో కనిపించడం ఇన్వెస్టర్లకు కొంత ఊరటినిచ్చిందని అంటున్నారు. జాక్–మా భాగస్వామిగా, అలీబాబా సహ వ్యవస్థాపకుడు జోసెఫ్ సి త్సాయి జూన్ నెలలో సీఎన్‌బీసీ టీవీతో మాట్లాడుతూ... ‘‘జాక్–మా తో రోజూ మాట్లాడుతున్నాను. అతడికేదో అపారమైన అధికారం ఉందని అనుకుంటున్నారు. అదేమంత నిజం కాదు. అతడూ మనందరి మాదిరిగానే ఓ సామాన్య వ్యక్తి’’ అనడం కొసమెరుపు!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
బడుగు జీవులపై అటవీ అధికారుల ప్రతాపం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్‌లో ఉపాధి కోల్పోయి తిరిగి వచ్చిన బాధితుడు గూడు లేక గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో గుడిసె ఏర్పాటు చేసుకుని జీవిస్తుండగా అటవీ శాఖ అధికారులు తమ ప్రతాపం చూపారు. గుడిసె తీసివేయాలని ఆ కుటుంబాన్ని హెచ్చరించడంతో దానిని తొలగిస్తున్న క్రమంలో కర్రలు మీద పడి గృహిణి తీవ్రగాయాలకు గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లాల్‌సింగ్ తండా గ్రామపంచాయతీకి చెందిన వేముల దేవయ్య స్వగ్రామంలో పనులు లేక ఉపాధి కోసం రూ.5 లక్షలు అప్పు చేసి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాడు. అక్కడ కూడా సరిగా పని దొరక్క ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో రిజర్వ్ అటవీ ప్రాంతంలో తాత్కాలికంగా గుడిసె వేసుకున్నాడు. అటవీ సిబ్బంది సెక్షన్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం గుడిసె తొలగించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో దేవయ్య భార్య లక్ష్మిపై కర్రలు పడి గాయాలకు గురైంది. ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘కర్తార్‌పూర్’కు మన్మోహన్ రారు
న్యూఢిల్లీ/లాహోర్: కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే సాధారణ యాత్రికుడిలాగా మన్మోహన్ అక్కడికి వెళ్తారని ఆదివారం పేర్కొన్నాయి. కాగా, పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమూద్ ఖురేషీ కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలని తాము పంపిన ఆహ్వానాన్ని మన్మోహన్ అంగీకరించారని ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు వెల్లడించాయి. ‘నవంబర్ 9న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన్మోహన్ ఒక ప్రత్యేక అతిథిగా కాకుండా, ఒక సాధారణ వ్యక్తిగా హాజరవుతారు’ అని అక్కడి స్థానిక వార్తాపత్రిక డాన్ పేర్కొంది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని సిక్కు జాతా ప్రతినిధుల బృందంతో పాటు మన్మోహన్ సింగ్ పాల్గొననున్నారు. -
ప్రభుత్వ బడుల బాగు కోసం సామాన్యుడి పాదయాత్ర
-
కష్టాలను గెలిచిన ముత్యం
చదువుకోవాలనే తపన ఉంటే పరీక్షల్లో ఫెయిలైనా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చని నిరూపించాడు తాండూరు పట్టణానికి చెందిన ముత్యాల ప్రభు. నాన్న మంచం పట్టడంతో.. కుటుంబ భారాన్నంతా అమ్మ తనపై వేసుకుని నడిపించడాన్ని మర్చిపోలేదని చెప్పారు. 8 మంది సంతానానికి కూడు, గుడ్డ కోసం ఆమె పడిన ఇబ్బందులను కళ్లారా చూశాడు. ఇదే అతని పట్టుదలకు కారణమైంది. పక్క రాష్ట్రంలోని ఊరూరూ తిరిగి ముత్యాలమ్మిన ఆయన.. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. తాండూరు: పట్టణంలోని సాయిపూర్ ప్రాంతం ముత్యాల బస్తికి చెందిన ఒబులమ్మ, లక్ష్మణ్ దంపతులకు 8 మంది సంతానం. ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు.. వీరిలో మూడవ కుమారుడు ముత్యాల సెని ప్రభు. ఈయన 1నుంచి 7వ తరగతి వరకు దయానంద్ బాలవిహార్ పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం 8నుంచి 10వ తరగతి వరకు విలియమూన్ హైస్కూల్లో చదివాడు. అంబేడ్కర్ జూనియర్ కాలేజీలో ఇంటర్లో చేరి.. ఫస్టియర్, సెకండియర్‌లో ఫెయిలయ్యాడు. అమ్మకు ఆసరాగా.. కుటుంబం గడవటం ఇబ్బందిగా మారడంతో ముత్యాల ప్రభు 1999లో చదువుకు బ్రేక్ వేశాడు. అమ్మ ఒబులమ్మ చేస్తున్న ముత్యాల వ్యాపారాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అమ్మ, అన్నయ్య నుంచి రూ.5 వేలు తీసుకున్నాడు. ఈ డబ్బుతో హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతానికి వెళ్లి ముత్యాలు, రోల్డ్ గోల్డ్ వస్తువులను కొనుగోలు చేశాడు. మహారాష్ట్రలోని పూణే, షోలాపూర్, ముంబై తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి విక్రయించాడు. ఇలా వచ్చిన లాభాన్ని అన్న, తమ్ముళ్ల చదువు కోసం ఖర్చు చేశాడు. వీరిలో ఒక అన్న టీచర్‌గా, ఇద్దరు తమ్ముళ్లు పోలీసు కానిస్టేబుళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మరో అన్న పట్టణంలో వ్యాపారం చేసుకుంటున్నాడు. వీరి ఎదగడంలో ప్రభు కృషి ఎంతగానో ఉంది. ఉన్నత చదువులు.. ఇంటర్లో ఫెయిలైనా కూడా చదువుకునే అవకాశం ఉందని తెలుసుకున్న ప్రభు తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్టడీ సర్కిల్లో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం నిర్వహించిన అర్హత పరీక్షలో పాసయ్యాడు. తర్వాత ముత్యాల వ్యాపారం చేస్తూనే 9 ఏళ్ల పాటు చదువును కొనసాగించాడు. డిగ్రీ అనంతరం పీజీ పూర్తిచేశాడు. తర్వాత బీఈడీలో చేరాడు. వైఎస్సార్ హయాంలో నిర్వహించిన 2008 డీఎస్సీ పరీక్షలు రాసేందుకు విజయవాడ వెళ్లి మూడు నెలల పాటు కోచింగ్ తీసుకున్నాడు. డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా అర్హత సాధించాడు. తాండూరు మండలం రాంపూర్‌తండా ప్రాథమిక పాఠశాలలో తొలిసారి ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. ప్రస్తుతం తాండూరు మండలం పర్వతాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య ప్రోత్సాహం.. తన విజయంలో భార్య ఉమారాణి ప్రోత్సాహం ఎంతో ఉందని ప్రభు చెబుతున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు ప్రణవ్య, అక్షిత ఉన్నారు. ఉమారాణి మధ్యలోనే చదువు ఆపేసినా పెళ్లి తర్వాత బీఈడీ పూర్తి చేశారు. ఆత్మహత్యలు సరికాదు.. ఇంటర్లో ఫెయిలయ్యామనే కారణంతో ఇటీవల పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది సరైన నిర్ణయం కాదు. చదువులేకపోయినా జీవితంలో ఎదిగేందుకు అనేక అవకాశాలు వస్తుంటాయి. అన్ని సమస్యలను అధిగమిస్తేనే సక్సెస్ లభిస్తుంది. చదువులో ఫెయిలైతే బతుకు ముగిసినట్లు కాదు. -
అంచెలంచెలుగా ఎదిగాడు
కష్టాలు శాశ్వతం కావని నమ్మకంతో ముందుకెళ్లాడు. ఇంటర్ ఫెయిలైనా డోంట్‌కేర్ అని.. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వస్త్రవ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఆదాయం అంతంతే ఉండడంతో పౌల్ట్రీఫాంలో గుమాస్తాగా చేరి.. యజమాని స్థాయికి ఎదిగాడు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లాడు. తాను ఉపాధి పొందడమే కాకుండా పలువురికి జీవనోపాధి చూపుతున్నాడు నుస్తులాపూర్‌కు చెందిన బుదారపు శ్రీనివాస్. అమానకొండూర్: మా అమ్మనాన్నలకు మేము ఐదుగురు సంతానం. నేను అందరికంటే చిన్నవాడిని. మా నాన్న లక్ష్మయ్య నిత్యం సైకిల్‌పై బట్టల మూట పెట్టుకొని గ్రామాలకు వెళ్లి అమ్మివస్తేనే మా కుటుంబం గడిచేది. 1985లో పదోతరగతి పాసైన తర్వాత నాన్నకు తోడుగా నేను కూడా వస్త్ర వ్యాపారం చేశాను. ఈక్రమంలో ఇంటర్లో ఫెయిల్ అయ్యాను. తర్వాత చదువును వదిలేసిన. బట్టల వ్యాపారంలో పెద్దగా ఆదాయం లేకపోవడంతో పౌల్ట్రీఫాంలో గుమాస్తాగా చేరిన. ఇక్కడే ఫాం ఎలా నిర్వహించాలోఅవగాహనకు వచ్చిన. తర్వాత తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఓ చిన్న పౌల్ట్రీఫాంను లీజుకు తీసుకున్న. అందులో వచ్చిన ఆదాయంతో పర్లపల్లి శివారులో స్థలం కొని సొంతంగా పౌల్ట్రీఫాం ప్రారంభించిన. ఐదు వేల కోడి పిల్లలతో.. ఐదు వేల కోడి పిల్లలతో ప్రారంభించిన ఫాంలో నేడు 50 వేల కోళ్లు పెంచుతున్న. నా భార్య ప్రేమలత కూడా ఫాం నిర్వహణలో సహాయం చేస్తుంటుంది. ప్రస్తుతం ఫాంలో 25 మంది కూలీలు రోజు పనికి వస్తుంటారు. వీరికి నెలకు రూ.లక్ష వరకు వేతనం చెల్లిస్తున్న. వ్యవసాయంలోనూ ఆదర్శం ప్రకృతి సహకరించక పౌల్ట్రీఫాంలో ఒకవేళ నష్టాలు వస్తే పరిస్థితి తారుమారు కావద్దనే ముందుచూపుతో ఎనిమిదెకరాల్లో వ్యవసాయం మొదలుపెట్టిన. వరి, కూరగాయాలు సాగుచేస్తున్న. మరో 20 మంది కూలీలకు నిత్యం ఉపాధి కల్పించిన. ఫెయిల్యూర్‌తో బాధపడొద్దు చదువులోనైన, జీవితంలోనైన ఒక్కసారి ఫెయిల్ అయితేనే బాధపడి కూర్చోవద్దు. మనవంతుగా ప్రయత్నిస్తూనే ఉండాలి. సాధించాలనే తపనతో ముందుకెళ్తే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటాం. – బుదారపు శ్రీనివాస్ -
బిగ్‌బాస్ : టార్గెట్ దీప్తీ.. గణేశ్ అత్యుత్సాహం!
సాక్షి, హైదరాబాద్ : బిగ్‌బాస్ సోమవారం ఎపిసోడ్ అదిరిపోయింది. ఎంత సేపు కృత్రిమ ప్రేమలు కనబర్చుకుంటూ.. హగ్‌లు ఇచ్చుకుంటూ, నటిస్తూ.. పైన పటారం, లోపల లొటారం అన్నట్లు మెలుగుతున్న హౌస్ మేట్స్‌కు బిగ్‌బాస్ అసలు సిసలు పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో ఇద్దరు మినహా అందరూ త్యాగాలు చేసి ఇతరుల మనసులను గెలుచుకున్నారు. నాలుగో వారం ఎలిమినేషన్‌కు నామినేషన్ ప్రక్రియలో భాగంగా సాగిన ఈ టాస్క్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఓ ఎస్టీడీ బూత్ సెటప్ వేయించిన బిగ్‌బాస్ ఒక్కో కంటెస్టెంట్‌కు ఫోన్ చేసి.. ‘మీరు ఈ వారం ఎలిమినేషన్‌కు డైరెక్ట్‌గా నామినేట్ అయ్యారు.. ఇది తప్పించుకోవాలంటే తాను చెప్పిన కంటెస్టెంట్‌తో ఇలా చేయించాలి’ అని ఒక్కొక్కరికి ఓ టాస్క్ ఇచ్చాడు. గత నాలుగు వారాలుగా.. హౌస్ మేట్స్ ఇష్టా, అయిష్టాలను నోట్ చేసిన బిగ్‌బాస్ వాటితో అందరిని ఓ ఆట ఆడుకున్నాడు. అయితే ఈ విషయంలో గత వారం ఎలిమినేషన్ అంచు వరకు వెళ్లొచ్చిన దీప్తీనే బిగ్‌బాస్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అందరికి కొంత పర్వాలేదనే టాస్క్‌లు ఇచ్చినా ఈమెకు మాత్రం కష్టమైన టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే.. కౌశల్ తనకు తాను ప్రతీసారి సెల్ఫ్ నామినేట్ చేసుకునేలా నందిని రాయ్ ఒప్పించాలి. ఇలా ఆమె కౌశల్‌ను ఒప్పిస్తే దీప్తీ నామినేషన్ ప్రక్రియ నుంచి తప్పించుకుంటుంది. కానీ అసలే కౌశల్ లాజిక్‌గా ఆలోచించెటోడు. బిగ్‌బాస్ వ్యూహం ఏమైనప్పటికీ.. సెల్ఫ్ నామినేట్ చేసుకుంటే తనకు తాను ఓటమిని అంగీకరించినట్లవుతుందని.. తను చేయలేనని చెప్పేశాడు. కౌశల్ పాయింట్ కరెక్టే మరీ. ఏ ఒక్కసారో అంటే త్యాగం చేయొచ్చు. కానీ సీజన్ ఆసాంతం చేయడం కష్టమే కదా. దీంతో దీప్తీ డైరెక్ట్‌గా నామినేట్ అయింది. అయితే ఇతరుల టాస్క్‌లతో దీప్తీకిచ్చిన టాస్క్ పోలిస్తే ఇది చాలా కష్టమైనదే. దీంతో ఆమెకు ఈసారి ఎలిమినేషన్ తప్పేలా లేదు. గణేశ్ అత్యుత్సాహం.. హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నామినేట్ అవుతున్న కామన్ మ్యాన్ గణేశ్ ఈ టాస్క్ విషయంలో అత్యుత్సాహం కనబర్చాడు. ఈసారీ నామినేషన్ నుంచి గణేశ్‌ను తప్పుకోవాలంటే.. బాబు గోగినేని తనకు అంతగా ఇష్టం లేని రెండు కొత్తిమీర కట్టలు తినాలనే ప్రతిపాదనను పెట్టాడు బిగ్‌బాస్. పాపం బాబు గోగినేని గణేశ్ కోసం ఆ రెండు కట్టలు తినేసి ఎలిమినేషన్ నుంచి రక్షించాడు. కానీ రోల్‌రైడాను రక్షించడం కోసం గణేశ్ తనకు తాను సెల్ఫ్ నామినేట్ చేసుకోని అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఈ విషయం అభిమానులకు కొంత ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. అతను హౌస్‌లో ఉండాలనే ప్రతీసారి అతనికి ఓట్లు వేస్తూ ప్రేక్షకుల మద్దతు తెలిపారు. కానీ అతను వారి మద్దతును, బాబు గోగినేని త్యాగాన్ని పట్టించుకోకుండా రోల్‌రైడాను రక్షించాడు. దీంతో పాటు అతను ఈ వారం మొత్తం పండ్లు మాత్రమే తినాలి. కానీ గణేశ్ చర్య అతని అవగాహనరాహిత్యాన్ని తెలియజేసింది. అది బిగ్‌బాస్ హౌస్ అందులో ఎవరిని నమ్మవద్దనే విషయాన్ని గణేశ్ ఇన్నిరోజులైనా గ్రహించలేకపోయాడు. ఇదే రోల్‌రైడా.. గణేశ్ ఈ హౌస్‌కు పనికి రాడంటూ ఎన్నోసార్లు నామినేట్ చేశాడు. నిజానికి రోల్‌రైడా నామినేట్ అయినా అతనికి వచ్చే నష్టం ఏమిలేదు. అతను హౌస్‌లో యాక్టివ్గానే ఉంటున్నాడు. కానీ గణేశ్ చర్యతో అభిమానులు హర్ట్ అయ్యారా? లేక అతనికి మరో అవకాశం ఇస్తారా? వేచి చూడాల్సిందే. అడ్డంగా బుక్కైన అమిత్.. నాలుగువారాలైనా ఏ గొడవ లేకుండా అందరివాడు అనిపించుకుంటున్న అమిత్ ఈసారి అడ్డంగా బుక్కయ్యాడు. హౌస్‌లో అమిత్ భానుశ్రీతో కొంచెం క్లోజ్‌గా ఉండటంతో వీరి మధ్య బిగ్‌బాస్ చిచ్చు పెట్టేశాడు. భానుశ్రీ ఎలిమినేషన్ తప్పించుకోవాలంటే.. అమిత్ తన తలపాగాను సీజన్ మొత్తం తీసేయాలి, ఇంకోటి ఎప్పుడూ కెప్టెన్సీకి పోటీ చేయకూడదు. దీనికి ముందు భాను వద్దన్నా.. అంగీకరిస్తూ బయటకు వచ్చిన.. అమిత్‌ను తేజస్వీ, సామ్రాట్లు ఒకసారి ఆలోచించుకో అని చెప్పడంతో వెనకడుగు వేశాడు. తొలుత భాను ముందు కెప్టెన్సీ చల్తా అన్న అమిత్ తలపాగా సెంటిమెంట్ అని చెప్పాడు. బయటకు వచ్చి తలపాగా పెద్ద విషయం కాదని, గేమ్ గెలవాలంటే కెప్టెన్సీ ముఖ్యమని డబుల్ గేమ్ ఆడాడు. దీంతో భానుకి ఆగ్రహం వచ్చింది. తేజస్వీ, సామ్రాట్ల మాటల ప్రభావంతో అలా చేయడం నచ్చలేదని చెప్పుకొచ్చింది. ఇక బాబు గోగినేని గారి కోసం గీతా మాధురి బిగ్‌బాస్ కన్ను పర్మినెంట్ ట్యాటు వేయించుకోగా.. గీతామాధురి కోసం తేజస్వీ తన ఫేవరేట్ వైట్ బ్లాంకెట్‌ను ముక్కముక్కలుగా కత్తిరించింది. తేజస్వినీ కోసం సామ్రాట్ క్లీన్ షేవ్ చేసుకోగా.. సామ్రాట్ కోసం తనీష్ లెదర్ జాకెట్‌ను కలర్లో ముంచాడు. తనీష్ కోసం దీప్తీ సునయన తన హెయిర్ కట్ చేసుకోగా.. సునయన కోసం దీప్తి పచ్చి కాకరకాయలు తిన్నది. అమిత్ కోసం రోల్‌రైడా ప్రత్యేక కటింగ్ స్టైల్ చేసుకోగా.. నందిని రాయ్ కోసం భాను శ్రీ తన బట్టలన్నీ వదిలేసుకుంది. ఇలా కౌశల్, అమిత్ మినహా అందరూ టాస్క్‌లను పూర్తి చేసి కంటెస్టెంట్లను రక్షించడంతో దీప్తీ, భానుశ్రీలు డైరెక్ట్‌గా నామినేట్ కాగా.. గణేశ్ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఇక భానుశ్రీకి తెలంగాణ సెంటిమెంట్ కలిసొస్తుండటంతో ఆమె ఇప్పుడే ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. ఇక కామన్ మ్యాన్ గణేశ్ విషయంలో ప్రేక్షకుల నిర్ణయంపైనే దీప్తీ ఎలిమినేషన్ ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. -
నీవు చేసిన అభివృద్ధి ఎక్కడ?
ఎర్రగుంట్ల : పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఆదివారం టీడీపీ బైక్ ర్యాలీ సందర్భంగా మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డిని ఓ సామాన్యుడు నిలదీశారు. అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం కాదు.. నీవు చేసిన అభివృద్ధి ఎక్కడో చూపించాలని అడ్డుతగిలాడు. దీంతో ఆ సామాన్యుడిపై మంత్రి ఆదినారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా..ప్రత్యేక హోదా సాధన కోసం టీడీపీ ఆధ్వర్యంలో మంత్రి ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి ముద్దనూరు మీదుగా ఎర్రగుంట్ల వరకు కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎర్రగుంట్ల నాలుగు రోడ్డ కూడలిలో బహిరంగ సమావేశం నిర్వహించారు. అక్కడ మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాటం దీక్షను కూడా చేశారని, హోదా ఇవ్వక పోతే కేంద్రంతో పోరాటానికి సిద్ధమని, ఎర్రగుంట్ల అభివృద్ధికి నిధులు ఎక్కువగా తెప్పించామని చెప్పారు. ఇదే సమయంలో అక్కడున్న ఓ సామాన్యుడు మంత్రి ప్రసంగాన్ని అడ్డుతగిలి నీవు ఏమి అభివృద్ధి చేశావని మా పట్టణానికి వచ్చావని ప్రశ్నించాడు. మంత్రి ఆగ్రహంతో మత్తులో అడ్డదిడ్డంగా మాట్లాడే వారి కాళ్లు తీసేయాలన్నారు. దీంతో అక్కడికి వచ్చిన కార్యకర్తలు నాయకులు అవాక్కయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముసలయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ జెక్కు చెన్న క్రిష్ణారెడ్డి, నాయకులు బాల వెంకటరెడ్డి, మురళిలు పాల్గొన్నారు. -
సామాన్యుడికి అందుబాటులో..
కొల్లాపూర్‌రూరల్ : కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా గ్రామీణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకింగ్ సేవలకు దేశవ్యాప్తంగా కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మండలంలోని సింగోటంలో స్థానిక సర్పంచ్ వెంకటస్వామి కృషితో ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ విజయవంతంగా ఏడాది పూర్తిచేసుకుంది. గత ఏడాది కలెక్టర్ శ్రీధర్ ప్రోత్సాహంతో గ్రామ పంచాయతీలోని కామన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సమీప గ్రామాల ప్రజలకు డబ్బు ఇబ్బంది లేకుండా ఏడాదిగా దిగ్విజయవంతంగా కామన్ సర్వీస్ సెంటర్‌ను నడుపుతూ నిర్వాహకులు ప్రశంసలందుకుంటున్నారు. సేవలు ప్రశంసనీయం కామన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన మూడు నెలల్లోనే దాదాపు దాదాపుగా రూ.రెండు కోట్ల లావాదేవీలు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి సెంటర్‌గా నిర్వాహకురాలు పద్మ జాతీయ స్థాయిలో ప్రశంసలు, అవార్డు అందుకున్నారు. నేటికి సంవత్సరం కావడంతో ఐదు కోట్ల లావాదేవీలను దిగ్విజయవంతంగా పూర్తిచేశారు. ఆధార్‌కార్డు లింకుతో వేలిముద్రలతో కామన్ సర్వీస్ సెంటర్లో డబ్బు లావాదేవీలు కొనసాగుతున్నా యి. గ్రామ సమీపంలో ఉన్న ఎత్తం, మై లారం, మైలారం తండా, జావాయిపల్లి, ఎన్మన్‌బెట్ల గ్రామాల ప్రజలు సర్వీస్ సెం టర్కు వచ్చి తమ డబ్బులను ఇబ్బం దులు లేకుండా డ్రా చేసుకుంటున్నారు. సేవలు అందుబాటులో ఈజీఎస్ గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు, ఎంప్లాయీస్ జీతాలు, వృదా ్ధప్య పింఛన్లు కూడా సర్వీస్ సెంటర్లోనే తీసుకుంటున్నారు. నిర్వాహకురాలు గ్రా మంలో వృద్ధులు కార్యాల యానికి రాని తరుణంలో వారి ఇంటి వద్దకు కంప్యూటర్ మిషన్‌ను తీసుకెళ్లి అక్కడే పింఛన్లు ఇస్తూ ఆదర్శంగా నిలిచారు. సమస్యలు అధిగమిస్తున్నా సర్వీస్ సెంటర్ నుంచి ప్రజలకు సేవలందించడంలో ఇబ్బందులు వచ్చినా అధిగమించి ముందుకు సాగుతున్నా. ఈ నిర్వహణలో సర్పంచ్ వెంకటస్వామి, సర్వీస్ సెంటర్ స్టేట్, జిల్లా అధికారుల ప్రోత్సాహంతో సజావుగా కొనసాగిస్తున్నా. – పద్మ, నిర్వాహకురాలు ఇబ్బంది తప్పింది గ్రామ స్థాయిలో సర్వీస్‌సెంటర్‌తో ఇబ్బంది లేకుండా ఉంది. గతంలో 8 కిలోమీటర్ల మేర కొల్లాపూర్ పట్టణానికి వెళ్లి బ్యాంకుల ముందు పడిగాపులు కాసి డబ్బులు డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడేవాళ్లం. కామన్ సర్వీస్ సెంటర్‌తో ప్రజలకు సమస్యలు తీరుతున్నాయి. – రామస్వామి, సింగోటం కలెక్టర్ ప్రోత్సాహంతో.. కలెక్టర్ శ్రీధర్ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఆయన ప్రోత్సాహంతోనే సర్వీస్ సెంటర్ ప్రారంభించాం. నిర్వాహకురాలికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా గ్రామపంచాయతీ నుంచి పరిష్కరిస్తూ సెంటర్‌ను ముందుకు సాగిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. – వెంకటస్వామి, సర్పంచ్ -
ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి
కృష్ణరాజపురం: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రశ్నించిన కానిస్టేబుల్, స్థానికులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. దినేశ్ అనే వ్యక్తి గురువారం ఉదయం కారులో సర్జాపుర రింగ్‌రోడ్డులో సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ వన్‌వేలో దూసుకెళుతున్నాడు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ భీమశంకర్ కారును ఆపాడు. వన్‌వేలో రావడమే కాకుండా సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తుండడంతో జరిమానా విధించడానికి సిద్ధమయ్యాడు. దీంతో ఆగ్రహించిన దినేశ్ కారులోనున్న బేస్‌బాల్ బ్యాట్‌తో కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. ఇదంతా గమనిస్తున్న స్థానికులు, ఇతర వాహనదారులు దినేశ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని కూడా దూషిస్తూ దాడికి యత్నించాడు. సమాచారం అందుకున్న బెళ్లందూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దినేశ్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. -
సామాన్యుడి విజయం
-
నడ్డివిరిచిన విద్యుత్ ఛార్జీలు
► పెరిగిన ఛార్జీలతో బతికేదేలా? ► పొదుపు పాటించకుటే బిల్లు మోతే ఎల్.ఎన్.పేట: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకోవలసిన అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరుసటి రోజునుంచే విద్యుత్ బిల్లులు మోత ప్రజల నెత్తిన పిడుగులా పడింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల వారికి ఇచ్చిన వేసవి కానుక ఇది. చంద్రబాబు మూడేళ్ల పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచడం ఇది మూడోసారి. ఈనెల ఒకటో తేదీ నుంచి పెంచిన విద్యుత్ బిల్లు అమల్లోకి వచ్చాయి. పేద, బడుగు, బలహీన, మద్యతరగతి, ఉతన్న ఇలా ఏ వర్గాన్ని వదలకుండా అందరి నెత్తిన తలాకాస్త పెంచుకుంటు పోయారు. వినియోగదారుడు వాడుకునే ప్రతీ యూనిట్‌పైన పెంచిన ఛార్జీల భారం పడింది. ఇలా ఎడా పెడా పెంచుకుని పోతున్న విద్యుత్ ఛార్జీలను ఎలా భరించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రజల రోజు, నెలవారీ ఆదాయం (సంపాదన)లో ఎలాంటి పెరుగుదల లేకుండా పోతుంది. ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయని పలు వర్గాలకు చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. వేసవి కాలం కావడంతో పని చేసుకుని ఇంటికి చేరి విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి పెరిగిన చార్జీలు షాక్కొడుతున్నట్లు ఉంటాయి. పిల్లలు టివీ చూస్తామన్న పెద్దలకు భయం పుట్టుకొస్తోంది. ప్రజలకు మోసం చేస్తున్నారు: చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత ప్రజలకు మోసం చేసే కార్యక్రమాలే ఎక్కువుగా జరుగుతున్నాయి. బాబు మారిడాని నమ్మిన ప్రజలు గత ఎన్నికల్లో పట్టం గట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత తన పాత విధానాలే అవలంబిస్తోన్నారు. ప్రజలకు మోసం చేయడంలో ఆయన కంటే ఘనాపాటి ఎవరు లేరు. ---కిలారి త్రినాద్, వైఎస్సార్ సీపీ మండల కన్వినర్, యంబరాం, ఎల్.ఎన్.పేట ప్రభుత్వమే భరించాలి: పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. అన్ని వర్గాల వారి కోసం కాకున్న కనీసం నెలకు 200 యూనిట్లు కంటే తక్కువగా విద్యుత్ వినియోగం చేసే లబ్దిదారులకు చెందిన ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. ఎప్పటికప్పుడు ఛార్జీలు పెంచుకుంటు పోవడం వలన కూలి చేసుకునే వారి కుటుంబాలకు అప్పులే మిగులుతాయి. ---బూర్లె లింగన్న, రైతు, మిరియాపల్లి, ఎల్.ఎన్.పేట -
ఇద్దరు ఎస్సైలు నాపై దౌర్జన్యం చేశారు
-
ఇదేం పని మేనేజర్..!
-
సెల్యూట్ టు ‘కామన్ మ్యాన్’
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రముఖ దివంగత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ సృష్టించిన ‘కామన్ మ్యాన్’, ఆయనకు సెల్యూట్ చేస్తున్న పోలీసు విగ్రహాల ప్రారంభోత్సవ దృశ్యం. వీధుల సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం వీటిని గురువారం ఏర్పాటుచేసింది. -
స్టేషన్‌కు తరలించి ధర్డ్ డీగ్రీ ప్రయోగించారు
-
నోట్ల రద్దుపై రగడ
-
ప్రధాని మోదీకి సామాన్యుడి లేఖ
-
‘కొన్ని వేల పెళ్లిళ్లు ఆగిపోయాయి’
హైదరాబాద్: శాస్త్రీయత లేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడంతో దేశంలో ప్రజలు అల్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకోవడానికి బ్యాంకుల వద్ద సామాన్య ప్రజానీకం పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. కోట్లాది మంది బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. శాస్త్రీయ ఆలోచన చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేసిన కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విలువైన సమయమంతా వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 50 కోట్ల పనిగంటల సమయం అభివృద్ధిలో భాగస్వామి కాకుండా నిరుపయోగమయిందని వెల్లడించారు. ఇంకా కోట్ల పని గంటల సమయం వృధా అవుతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. పెద్ద నోట్ల రద్దు ఆత్మహత్యలకు దారితీస్తోందని, కొన్ని వేల పెళ్లిళ్లు ఆగిపోయాయని తెలిపారు. మహిళల బాధ వర్ణనాతీమని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు గురించి నల్లకుబేరులకు ముందే సమాచారం ఇచ్చారన్న అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. బ్యాంకు ముందు బారులు తీరినవారంతా సామాన్య బడుగు బలహీన వర్గాల ప్రజలేనని తెలిపారు. పాల ప్యాకెట్లకు కూడా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉప్పు ధర ఆకాశానంటడం భయాందోళన కలిగిస్తోందన్నారు. కేంద్రం అనాలోచిత నిర్ణయం నల్లకుభేరులకు తగలకుండా సామాన్యులకు తగిలిందని భూమన అన్నారు. మోదీ మహత్తర ఆశయం చివరకు ప్రజల గుండెల్లో గుచ్చుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
కొన్ని వేల పెళ్లిళ్లు ఆగిపోయాయి: భూమన
-
చూడాలంటే ఎన్నో కష్టాలు
హారతి చూసేందుకు 2 కి.మీ. నడవాల్సిందే రకరకాల ఆంక్షలు భక్తులకు తీవ్ర ఇబ్బందులు ప్రాంగణమంతా ప్రభుత్వ సిబ్బందే పవిత్ర పుష్కరాల్లో చూసి తరించాల్సిందేనంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగమం హారతి కార్యక్రమం అధికారులకు, వీవీఐపీలకే పరిమితమా?, సామాన్య భక్తులను ఆంక్షల పేరుతో అనుమతివ్వడమే గగనమైంది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతోంది. విజయవాడ: పవిత్ర సంగమం వద్ద నిత్యహారతి కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. నగరంలో పలు ప్రాంతాలనుంచి భక్తులను సాయంత్రం బస్సులో ఇబ్రహీంపట్నం తరలిస్తున్నారు. సాయంత్రం హారతి సమయానికి ఒక గంట ముందు ఇబ్రహీంపట్నం రింగ్ వరకు మాత్రమే బస్సులను అనుమతిస్తున్నారు. అక్కడికి చేరుకున్న భక్తులను బస్సుల్లోంచి దించి కాలినడకన ఘాట్‌వద్దకు వెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నారు. మొదటి ఐదు రోజులు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఉచిత బస్సులపై ఆంక్షలు విధించారు. బస్సులను సాయంత్రం వేళల్లో అనుమతించకుండా శాటిలైట్ బస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. బుడమేరు కట్టపై వేసిన రోడ్డుద్వారా ముఖ్యమంత్రి ఘాట్ వద్దకు చేరకుంటున్నారు. ఆ సమయంలో భక్తులను రింగ్ సెంటర్‌నుంచి కాలినడకన ఫెర్రీ రోడ్డులోకి పంపుతున్నారు. నవహారతులు చూడాలని వచ్చే భక్తులు ఘాట్ వద్దకు 2కి. మీ నడిచివెళ్లాల్సి వస్తోంది. దీంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. హారతి కార్యక్రమానికి చేరుకోలేక కొందరు ఉసూరంటూ వెనుదిరుగుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చారా.. మరింత కష్టం ముఖ్యమంత్రి ఘాట్ వద్ద ఉన్న సమయంలో అయితే పరిస్థితి ఇంకా కష్టం. రకరకాల ఆంక్షలు విధించడంతో పాటు పోలీసు, పారిశుధ్య, వైద్య సిబ్బందితోనే ప్రాంగణం కిక్కిరిసి పోతోంది. ఇక సమయానికి చేరుకోవడం దుర్లభమే. హారతి కోసం వచ్చే భక్తులు దూరం నుంచి చూసి వెనుదిరగాల్సి వస్తోంది. గత ఐదు రోజుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ముఖ్యమంత్రి వావానాలు నిలిపి ఉంచే చోట హారతి వీక్షించేందుకు వీలుగా చిన్న డిస్ప్లే ఏర్పాటు చేశారు. అయినా ప్రత్యక్షంగా చూడడానికి వస్తే టీవీ తెరపై చూసి తిరిగి వెళ్లాల్సి వస్తోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. -
గది..గగనమే !
సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులు విడిది చేయడానికి హోటల్ గదులు దొరికే అవకాశాలు కనిపించడం లేదు. విజయవాడలో ఉన్న హోటల్ గదుల్లో అధిక శాతం ప్రభుత్వమే బుక్ చేసుకోనుండడంతో సామాన్యులకు గదులు దొరకని పరిస్థితి కనపడుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడికి తరలి రావడంతో చాలా గదులలో ఇప్పటికే అధికారులు, మంత్రులు ఉంటున్నారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం 60 వేల మంది ఉద్యోగులకు బాధ్యతలను అప్పచెప్పింది. ఇవి కాకుండా ప్రొటోకాల్ అధికారులు, జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు అదనపు గదులను కేటాయించాల్సి వస్తోంది. నగరంలో ఉన్న ఫోర్ స్టార్ హోటళ్లలో అత్యధిక శాతం ప్రభుత్వమే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్రీస్టార్తో పాటు మిగిలిన లాడ్జీల్లో 30 నుంచి 40 శాతం గదులను ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందని హోటల్ ఓనర్స్ అంచనా వేస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో 30 శాతం గదులు... గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రిలోని హోటళ్లలో 30 శాతం గదులను ప్రభుత్వం తీసుకుందని, ఇప్పుడు కూడా అదే స్థాయిలో తీసుకునే అవకాశాలున్నాయని విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐలాపురం రాజా అన్నారు. నగరంలో మొత్తం 200 హోటళ్లు ఉండగా అందులో మూడు ఫోర్ స్టార్, 8 త్రీస్టార్ హోటళ్లు ఉన్నాయి. అన్ని హోటళ్లలో కలిపి సుమారు 1,700 గదులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం తీసుకోగా కనీసం వెయ్యి గదులు కూడా మిగలని పరిస్థితి కనిపిస్తోంది. పుష్కర విధుల్లో ఉన్న ఉద్యోగస్తుల్లో చాలామందికి కళాశాలలు, కళ్యాణ మండపాల్లో వసతి ఏర్పాట్లు చేస్తున్నా, ఉన్నతాధికారులు, వచ్చే ముఖ్య అతిథుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున గదులను కావాలని కోరుతోంది. గదుల కొరతను తీర్చడానికి 12 గంటల చెక్ ఔట్ సదుపాయం కల్పించాలని హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. గోదావరి పుష్కరాలకు ఇదే విధంగా 12 గంటల చెక్ ఔట్ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేశారని, అదే విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని కోరుతున్నట్లు రాజా తెలిపారు. ఈ సూచనపై ప్రభుత్వం సాను కూలంగా స్పందించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిందన్నారు. దీని వల్ల తక్కువగా ఉన్న గదులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునే వెసులుబాటుతో పాటు భక్తులకు ఆర్థికంగా కలిసొస్తుందన్నారు. ధరలు పెంచం.. డిమాండ్ ఉందని గదుల అద్దెలు పెంచే ఆలోచన లేదని ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ఇవ్వగా మిగిలిన వాటిని సాధారణ రేట్లకే ఇస్తామని ఫార్చున్ మురళీ హోటల్ అధినేత ఎం.మురళీ కృష్ణ తెలిపారు. ఎవరూ అద్దెలు పెంచే ఆలోచనలో లేరని స్పష్టం చేశారు. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. తాము తీసుకునే గదులపై సాధ్యమైనంత డిస్కౌంట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. ఇలా ప్రభుత్వానికి ఇచ్చిన డిస్కౌంట్‌ను అద్దెలు పెంచడం ద్వారా సాధారణ భక్తులను నుంచి వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా ప్రభుత్వ విధానం స్పష్టం కాకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టలేదని హోటల్ ప్రతినిధులు పేర్కొన్నారు. విజయవాడలో మొత్తం హోటళ్లు, లాడ్జీల సంఖ్య – 200 ఫోర్స్టార్ హోటళ్లు–3 (తాజ్ గేట్‌వే, డీవీ మానర్, ఫార్చూన్ మురళీ) త్రీస్టార్ హోటళ్ల సంఖ్య 8 అందుబాటులో ఉన్న మొత్తం గదులు 1,700 ఫోర్ స్టార్ హోటల్లో అద్దె రూ. 4,000 – 6,000 (24 గంటలు) త్రీ స్టార్ హోటల్లోæ అద్దె రూ. 2,000 3,000 లాడ్జీలు రూ. 500 1,500 -
సామాన్యునికి సేంద్రియ ఉత్పత్తులు
సందర్భం శుభ్రమైన పరిసరాలు, ఆరో గ్యవంతమైన ఆహారాలను ప్రతి ఒక్కరికి అందుబాటు లోకి తీసుకురావడం ప్రభు త్వాల బాధ్యత. సాగుకు ఉప యోగిస్తున్న రసాయనాల కార ణంగా నేల, నీరు, పరిసరాలు విషపూరితం అయిపోయా యన్నది నేడు రుజువైన వాస్తవం. 30 ఏళ్ల క్రితం మన మధ్యలో మెసిలిన వేలాది జీవరాసులు అంతరించి పోవడం వేదనతో మనం గమనిస్తున్న దృశ్యం. ఈ పరిస్థితి మారి తీరాలన్నది ప్రపంచ దేశాల, కోట్లాది ప్రజల అభిమతం. సేంద్రియ విధానంలో సాగును అమలు చేయడం ఇందుకు పరిష్కార మార్గమనేది అందరూ ఆమోదించిన అంశం. అయితే జరుగుతున్నదేమిటి? సేంద్రియ ఎరు వులు, పురుగు మందులు, విత్తనాలు ఇబ్బడిముబ్బడిగా బజారులో ప్రత్యక్షమయ్యాయి. రసాయనిక ఎరువులు, మందులతో నడుం విరిగిన రైతుకు ఊరట లభించక పోగా మరింత భారం పెరిగింది. ఆరోగ్యవంతమైన ఉత్పత్తులతోబాటు రైతు సౌభాగ్యం కూడా అత్యంత అవసరం అనే అంశాన్ని మనం మరువకూడదు. సుభాష్ పాలేకర్ విధానం ఇందుకు పరిష్కారాన్ని చూపింది. రసాయనాల వినియోగంతో నిర్జీవమైన మట్టికి, జీవరాసులకు నాటు ఆవు పేడ, మూత్రాలతో తిరిగి జీవం పోయవచ్చు అనేది వారి మొదటి సూత్రం. అదనపు ఎరువులు వేయకపోయినా ప్రకృతి పరిణా మాల కారణంగానే నేల సారాన్ని పొంది, పంటలకు అందించగలుగుతుంది. అందుబాటులోని వనరుల నుండి తయారు చేసుకునే కషాయాల ద్వారా పంటలకు పట్టే చీడపీడలను వదిలించుకోవచ్చు. ఇది వారి రెండవ సూత్రం. రైతు తన ఉత్పత్తులను అమ్మాలి తప్ప, విత్త నాలతో సహా ఏ వస్తువును బయటి నుండి కొనకూడదు అన్నది వారి మూడవ సూత్రం. అయితే గత 30 ఏళ్లుగా రసాయన ఎరువులతో సేద్యానికి అలవాటుపడిన రైతుకు ఈ కొత్త దారికి రావడం అంత సులువేమీ కాదు. సేంద్రియ వ్యవసాయం సమగ్ర అమలుకోసం గ్రామాల్లో కులాలు, పార్టీలకు అతీతంగా రైతు సంఘాలు నిర్మాణం కావాలి. శాస్త్ర సాంకేతిక పద్ధతుల అవగాహనతో నేల పరీక్షలు, పంటల ఎంపికలు, విత్తనాల తయారీలు ఈ సంఘాల ద్వారా జరగడం మొదటి మెట్టు. కొన్ని రైతు సంఘాలు కలసి ఒక రైతు సమాఖ్యగా ఏర్పడాలి. వ్యవసాయ పరిశోధనలను గ్రామాల్లోని రైతుకు అందజేసే బాధ్యతలను ఇవి చేపడ తాయి. రైతు తప్పనిసరి అని భావించే ఎరువులు, పురుగుమందుల తయారీలను కూడా ఇవి చేయగలు గుతాయి. వీలైనంత వరకు రైతు తన అవసరాలను తానే తీర్చుకోగలగాలి. తప్పనిసరైతే తాను సభ్యునిగా ఉన్న రైతు సమాఖ్య నుండే సరుకులను కొనుగోలు చేయాలి. ఇక్కడ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం మరొక టున్నది. రైతు కాని, గ్రామంలోని రైతు సంఘం కాని చేయలేని పనిని రైతు సమాఖ్య సమర్థతతో నిర్వహించ గలుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను కొని, టోకు గాను, చిల్లరగాను వ్యాపారులకు అమ్ముతుంది. అవస రాన్ని బట్టి బజారులో అమ్మక కేంద్రాలను నిర్వహి స్తుంది. ఇంటింటికీ సరుకులను అందజేసే వ్యవస్థలను రూపొందించుకుంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల మెరుగుదల, అమ్మకాలను రైతు సమాఖ్య నిర్వహిం చడం ద్వారా, దళారీ వ్యవస్థను పరిమితం చేస్తుంది. అయితే గ్రామాల్లో రైతు సంఘాలను, ఆపై రైతు సమాఖ్యలను స్వచ్ఛంద సంస్థలే నిర్మాణం చేయాలి. ఒక మున్సిపాలిటీలోని ప్రజలకు ఆరోగ్యకరమైన తిండి గింజలను, కూరగాయలను అందించే లక్ష్యంతో చుట్టుపక్కల గ్రామాల రైతులను సంఘటితపరిచే బాధ్యతలను ఒక స్వచ్ఛంద సంస్థ చేపట్టాలి. మూడు నుండి ఐదేళ్ల సమయంలో ఈ లక్ష్యాన్ని అది చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లోని 109 మున్సిపాలిటీలలో ఈ బాధ్యతలను చేపట్టడానికి వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యతగా 2% ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టవలసిన బాధ్యత ఎలాగూ ఉన్నది. వారు ఇందులో కనీసం 50% మొత్తాన్ని సేంద్రియ వ్యవసాయ విస్తరణకు కేటాయిం చడం ద్వారా ఈ ఉద్యమానికి సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపల్ కేంద్రాలలో సేంద్రియ ఉత్పత్తుల అమ్మక కేంద్రాలకు ఉచితంగా దుకాణాలను కేటాయించాలి. వ్యవసాయ విశ్వ విద్యాలయాలలోను, పరిశోధనా కేంద్రాలలోను రుజువైన ఫలితాలను పేటెంట్ చేయకుండా బహిరంగ పరచాలి. సాంకేతిక పరంగా యోగ్యమైన గిడ్డంగులను రైతు ఫెడరేషన్లకు ప్రభుత్వమే ఉచితంగా కట్టించి ఇవ్వాలి. సేంద్రియ ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ ఉత్పత్తుల పరీక్షలకు అవసరమైన ల్యాబ్ లను జిల్లాస్థాయి రైతు సమాఖ్యలకు ఉచితంగా ప్రభుత్వం అందజేయాలి. సంపూర్ణ సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా సిక్కిం ప్రకటించుకున్నది. మరో ఐదేళ్లలో తాము కూడా అదే స్థానంలో నిలుస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. దేశమంతటా ఇది ఆచరణ యోగ్యం కావడానికి ప్రతి వ్యవసాయ విశ్వవిద్యాలయంలోను ‘సేంద్రియ వ్యవ సాయం’ ఒక ప్రధాన విభాగంగా ప్రారంభం కావాలి. కేవలం సేంద్రియ వ్యవసాయ శిక్షణ కోసమే కొన్ని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను, కృషి విజ్ఞాన కేంద్రాలను ప్రారంభించాలి. ఒక గింజను విత్తితే పదివేల గింజలను అంది స్తుంది నేలతల్లి. అతి తక్కువ ఖర్చుతో, అత్యంత ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందజేయడమే సేంద్రి య వ్యవసాయ లక్ష్యం కావాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు, తన పంటలకు అదనపు ధర కావాలని రైతు కోరడు. ప్రస్తుతం శ్రీమం తులకే అందుతున్న సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు సామాన్యులకు కూడా సరసమైన ధరలకు అందు బాటులోకి రావాలి. అందుకు రైతులు సమాయత్తం కావాలి; స్వచ్ఛంద సంస్థలు నడుం కట్టుకోవాలి; వ్యాపార, పారిశ్రామికవేత్తలు సహకరించాలి. ప్రభుత్వం తన విధానాలను సవరించుకోవాలి. (మార్చి 19-20న హైదరాబాద్‌లో ‘సేంద్రియ వ్యవసాయంతో రైతు సౌభాగ్యం’ అంశంపై జాతీయ సదస్సు సందర్భంగా) - పి. వేణుగోపాల్‌రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ మొబైల్: 94904 70064 -
పేదలను పట్టించుకునే నేతలు రావాలి
కామన్ మ్యాన్ Voice నగరంలో ప్రతి కాలనీలోను ప్రతి అపార్ట్‌మెంట్‌కు వీరే బాస్‌లు. బతుకులు మాత్రం అంతంతే. పెద్ద భవంతుల కింద ఉన్న చిన్న గదిలో బతుకు బండి లాగించడం ప్రతిచోటా క నిపించే దృశ్యాలు. ఏళ్ల తరబడి అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న తమ లాంటివారి సంక్షేమం కోసం నేతలు ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదని అవేదన వ్యక్తం చేస్తున్నాడు రాంనగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్మెన్ బి.రమేష్. ‘కనీసం మ్మలను అసంఘటిత రంగ కార్మికులుగా కూడా గుర్తించడం లేదు. నిత్యం అపార్ట్మెంట్లో నివసించే వారు భద్రంగా ఉండాలని పనిచేసే మా లాంటివారి బతుకులకు భరోసా కల్పించే ందుకు నేతలు ఆలోచించాలి. కనీస వేతనాలు లేకుండా ఈ పనిచేస్తూ భార్యాబిడ్డలతో బతుకుతున్నాం. మా ఇంట్లో మహిళలు ఇళ్లల్లో పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప మాకు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు లేకుండా పోయాయి’ అని పేర్కొన్నాడు. - అంబర్‌పేట -
మహానగర విస్తరణలో సామాన్యుడికి చోటేది?
సందర్భం ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని 1893 సంవత్సరంలో నిర్మించి నప్పుడు దానిపై ‘అర్బ్స్ ప్రైమా ఇన్ ఇండిస్’ అనే పదాలు చెక్కించారు. అంటే దేశంలోనే తొలి నగరం లేదా ప్రధాన నగరం అని అర్థం. ఇది ఒక సింగపూర్‌లా, హాం కాంగ్లా విలసిల్లుతుందని అప్పట్లో ఆకాంక్షిం చారు. కానీ పారిశ్రామికీకరణ కొనితెచ్చిన వలసల నేపథ్యంలో కిక్కిరిసిపోయిన భవంతులు, మురికి వాడలతో ఇప్పు డిది ఒక పరిశుభ్ర నగరంలా కూడా ఉండటం లేదు. మరాఠీలో చాల్ అంటే నాలుగైదు అంతస్తుల భవంతి అని అర్థం. కుటుంబం మొత్తానికి ఒకటే గదితో, బాల్కనీ వంటి వరండాతో, చివరలో ఉమ్మడి మరుగుదొడ్లతో ఉండే భవంతులివి. ఇవి కలిసి ఉండటం అనే ఉమ్మడి సంస్కృతిని ప్రోత్సహించేవి కానీ, మరమ్మతులకు సాధ్యంకానంతగా పతనమైన స్థితిలో ఇవి ఇప్పటికే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కిక్కిరిసిపోయి ఉండే ఆధునిక భవంతులుగా.. పునర్నిర్మాణం బాటలో ఇప్పుడు సాగుతున్నాయి. ముంబై నగరం దుస్థితికి మురికివాడలు కారణమంటూ కొంతమంది తరచుగానే ఫిర్యాదులు చేస్తుంటారు. నగర జనాభాలో సగంమంది మురికి వాడల్లోనే నివసించడం వాస్తవమే కానీ ఇవి నగరంలోని 15 శాతం కంటే తక్కువ భూమిలో ఉంటున్నాయి. ఏదేమైనా, నగరం మాత్రం సమర్థ పనితీరుకు ప్రాణాధారమైన మౌలిక వసతుల కల్పనకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జనం ఇప్పటికీ కిక్కిరిసి పోయిన రైళ్లలో ప్రయాణిస్తూనే ఉన్నారు. పనికిరాని స్థితిలో ఉన్న ప్రభుత్వ బస్సు సేవలను, ఫుట్‌పాత్‌లను ఉపయోగి స్తూనే ఉన్నారు. ఫుట్‌పాత్‌ల మీదయితే జనం నడవలే రు. ఎందుకంటే అవి చిల్లర వ్యాపారులు, అక్రమ షాపుల విస్తరణలతో పాటు నడవడానికి ఏమాత్రం అనుకూలంగా లేని ఉపరితలాన్ని కలిగి ఉంటున్నాయి. కొత్తగా మౌలిక వసతుల కల్పనకోసం నగర పాలక సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రూ. 11,500 కోట్ల వ్యయంతో కూడిన 22 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంత రహదారి, ముంబై తీరప్రాంతాన్ని మహానగరంతో అనుసంధానించే ట్రాన్స్-హార్బర్ లింక్ వంటి నిర్మాణాలు వేగం పుంజుకుంటున్నాయి. కానీ ఈ నిర్మాణాలన్నీ కార్లను ఉపయోగించేవారికి ఉద్దేశించినవే. కానీ సామాన్యుడి అవసరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే మెట్రో, మోనో రైళ్లు, స్థానిక రైళ్ల అభివృద్ధి, బస్సు సేవల వంటివాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. చిత్తడి నేలమీద నిర్మితమైన ఇలాంటి సంక్లిష్ట నగరంలో జనజీవితాన్ని ఒక క్రమంలోకి తేగలిగే సమర్థ పరిపాలన అవసరం ఎంతైనా ఉంది. అయితే, ముంబై 1.25 కోట్లమంది జనాభాను కలిగిన మహా నగరం. దేశ జనాభాలో ఒక శాతం మంది ఈ ఒక్క నగరంలోనే 434 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తున్నారు. బహుశా ముంబై నగరం దేశంలోనే అతి పెద్ద పురపాలక సంస్థను కలిగి ఉంది. 2015-16 సంవత్స రానికి దీని బడ్జెట్ రూ. 33,514 కోట్లు. చిన్న చిన్న దేశాలను సైతం పాలిపోయేటట్టు చేసేంత పెద్ద బడ్జెట్ ఇది. పైగా దాని బడ్జెట్ కంటే ఎక్కువగా రూ.41,000 కోట్ల మేరకు భారీ స్థాయిలో బ్యాంకు డిపాజిట్లను నగరం కలిగి ఉంది. కానీ కొత్త ఆర్థిక సంవత్సరం సమీపిస్తుండగా, నగర బడ్జెట్లో కేవలం 30 శాతం నిధులను మాత్రమే నగరపాలక సంస్థ ఖర్చు పెట్టగలి గింది. అందుచేత, సరైన నిర్వహణ ద్వారా ఒనగూరే ప్రయోజనాలను నగరం కోల్పోయిందన్నమాట. డిపాజిట్లు బ్యాంకులలోనే ఉంటున్నప్పటికీ, ఉద్యోగుల ప్రావిడెంట్, పెన్షన్ నిధులను నగరపాలక సంస్థ తొక్కిపట్టి ఉంచిందని తెలిసినప్పుడు నగరపాలక సంస్థ వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. నగర బడ్జెట్లో పీఎఫ్, పెన్షన్ నిధుల వాటా అయిదింట ఒక వంతు మాత్రమే. రహదారులు, మురికికాలువలు, పాఠశాలలు వంటి నగర మౌలిక వసతుల కల్పనను పేలవమైన నాణ్యతతో నిర్వహిస్తున్నారు. అయినా సరే ఇంత తక్కువ మొత్తాన్ని మాత్రమే ఖర్చుపెట్టడం గమనార్హం. రహదారుల నిర్మాణం, వాటి నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టర్లు తరచుగా తక్కువ కోట్ చేస్తూనే, తర్వాత బిడ్ విలువను పెంచుతుంటారు. ఈ క్రమంలో పేలవమైన రహదారులను వీరు నిర్మిస్తారు. ఇక నగర అధికారిక పర్యవేక్షణా వ్యవస్థ మరీ ఘోరంగా ఉంటోంది. ఒకసారి వర్షం కురిస్తే చాలు రహదారులు గుంతలమయం కాక తప్పదు. ఈ గుంతలను పూడ్చడానికి న్యాయస్థానాలు రంగంలోకి దిగి, తుది గడువును విధిస్తుంటాయి కాని అవి ఎన్నడూ అమలు కావు. హైకోర్టులోని కఠినమైన న్యాయమూర్తులు ఈ విషయమై అప్పుడప్పుడూ వేడిని కొనసాగిస్తుంటారు. న్యాయస్థానం ఆదేశాలను ఒక జాబితాగా చేస్తే అది మీ చెయ్యి అంత పొడవుగా ఉంటుంది. న్యాయ స్థానా లు తరచుగా ఇచ్చే ఆదేశాలు నగరపాలక సంస్థ నిర్వహ ణ ఎంత అస్తవ్యస్థంగా ఉంటోందో తెలుపుతుంది. మహిళలు ముక్కు మూసుకోవడానికి వీల్లేనివిధంగా టాయ్లెట్లు, వాష్ రూమ్‌లు నిర్మించాలని ఆదేశాలు వెలవడుతుంటాయి. మూత్ర విసర్జన కూడా మహిళల హక్కు కాబట్టి, న్యాయస్థానాలు ఈ విషయంలో కూడా జోక్యం చేసుకుంటాయి కాని దాని అమలు మాత్రం నత్తనడకతోనే సాగుతుంటుంది. ఇదంతా ఒక సందర్భోచితమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇప్పుడున్నదానికంటే మెరుగ్గా ఉంచాలనే ఆకాంక్షలతో ముంబై నగరాన్ని ఎవరు నిర్వహించగలరన్నదే ఆ ప్రశ్న. (వ్యాసకర్త : మహేష్ విజాపుర్కార్, సీనియర్ పాత్రికేయులు) -
భూములు పోతే ఎలా బతకాలి?
-
ఆ వ్యక్తి కరెంటు బిల్లు తెలిస్తే హార్ట్ ఎటాకే!
గూర్గావ్: సాధారణంగా కరెంటు బిల్లు చూసిన ప్రతిసారి జేబు తడిమి చూసుకోవడం పరిపాటే. కానీ, హర్యానాలో ఓ వ్యక్తికి వచ్చిన కరెంటు బిల్లు చూస్తే మాత్రం తప్పకుండా హర్ట్ ఎటాక్ రావాల్సిందే. ఎందుకంటే మధ్య తరగతి జీవితాన్ని అనుభవిస్తున్న ఆ వ్యక్తికి విద్యుత్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కరెంటు బిల్లు అక్షరాల రూ.85 కోట్లు. ఈ బిల్లు చూసి ఆ వ్యక్తికి దాదాపు గుండెపోటు వచ్చినంత పనైంది. ఆ కుటుంబ సభ్యులు కూడా అవాక్కయ్యి ఏం చేయాలో అర్థంకాక చివరకు మీడియాను ఆశ్రయించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హెచ్ఎస్ వర్మ అనే గుర్గావ్కు చెందిన వ్యక్తి సాధారణంగా ప్రతినెల కరెంటు బిల్లు రూ.2000 నుంచి 2,500 చెల్లిస్తుంటాడు. అది కట్టడానికే ఓ రకంగా గగనమై పోతుంటుంది. అలాంటిది ఇటీవల ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కరెంటు బిల్లు పంపించినప్పుడు ఎన్విలప్ తెరిచి చూసిన అతడికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చినంత పనైంది. రూ.85 కోట్ల కరెంటు బిల్లు రావడమేమిటని తాను అంతమొత్తం ఎలా చెల్లించగలనని ఆలోచనలో పడ్డాడు. మీడియాకు తనకు వచ్చిన బిల్లు చేయించి దీని పరిష్కారం ఎలా అని ప్రశ్నించారు. అయితే, ఇలా ఊహించని మొత్తంలో కరెంటు బిల్లు పంపించడం విద్యుత్ శాఖకు పరిపాటే. -
సామాన్యుడికి మేలుచేయని టెక్నాలజీ వృథా
స్మార్ట్ టెక్నాలజీలు కేవలం నగరాలకు మాత్రమే పరిమితం కావడం సరికాదని, మన పల్లెలు కూడా వాటి ప్రయోజనాలను పొందాలని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. స్మార్ట్ టెక్నాలజీలపై హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ పొందిన అతి తక్కువ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని ఆయన చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలో అన్ని ఇళ్లకూ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందన్నారు. డిజిటల్ లిటరసీ మిషన్ అనే మరో ప్రధాన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం చేపట్టిందని, దీని ద్వారా ప్రతి కుటుంబంలో కనీసం ఒక వ్యక్తికి డిజిటల్ అక్షరాస్యత కల్పించడం తమ లక్ష్యమని అన్నారు. సామాన్యుడికి ప్రయోజనం కలిగించని టెక్నాలజీ వృథాయేనని వ్యాఖ్యానించారు. స్మార్ట్ సిటీల నిర్మాణం మంచిదే అయినా, పల్లెలే దేశానికి వెన్నెముక అన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రైతులకు కూడా సాయం చేసేందుకు తమ ప్రభుత్వం స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటోందని కేటీఆర్ చెప్పారు. Smart Technologies need not necessarily be restricted to Cities alone. Our villages should also benefit from Smart Tech: KTR at #NCST — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 We are one of the first states to have a ambitious fiber optic grid, connecting all the houses in the state: KTR at #NCST — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 Telangana has also embarked on another major initiative - Digital Literacy mission, to make one person per family Digitally literate: KTR — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 Technology that does not benefit the common man would be futile: KTR — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 While Smart Cities are good, we should also remember that India still lives in the villages: KTR — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 Our government is using smart technology to help our farmers: KTR — Min IT, Telangana (@MinIT_Telangana) August 22, 2015 -
ఏం తినాలన్నా భయమేస్తోంది..!
‘‘నన్ను నేను ఓ ‘కామన్ మ్యాన్’లా అనుకుంటా. అందుకే ఓ కామన్ మ్యాన్ తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంత తాపత్రయపడ్డాడు? అనే కథాంశంతో రూపొందిన ‘దృశ్యం’లో నటించా’’ అని కమల్‌హాసన్ పేర్కొన్నారు. అప్పట్లో ‘మహానది’లో కూతుర్ని కాపాడుకోవడానికి తాపత్రయపడే తండ్రిగా నటించారు. ఆ చిత్రానికీ ఈ ‘దృశ్యం’కీ దగ్గర పోలికలున్నాయి కదా? అనే ప్రశ్న కమల్ ముందుంచితే -‘‘మలయాళ ‘దృశ్యం’ దర్శకుడు జీతు ‘మహానది’ చూశారో లేదు నాకు తెలియదు. కానీ, ‘దృశ్యం’ ఆ జానర్ సినిమానే. కాకపోతే, ఈ చిత్రం తీసిన విధానం, కథ సాగే తీరు వేరేగా ఉంటుంది’’ అన్నారు. చాలా విరామం తర్వాత గౌతమి ఈ చిత్రంలో నటించారు. ఆమె నటన గురించి కమల్ చెబుతూ -‘‘ఇన్నేళ్ల విరామం గౌతమికి సినిమా గురించి ఇంకొంత అవగాహన ఏర్పడేలా చేసింది. అయితే, బాధపడదగ్గ విషయం ఏంటంటే.. ఫిమేల్ ఆర్టిస్టులు ఈ కళను బాగా అవగాహన చేసుకునే సమయానికి రిటైర్ అయ్యే పరిస్థితి వస్తుంది. కానీ, గౌతమి ఆ ఫీలింగ్‌ని అధిగమించి, ‘పాపనాశం’లో నటించగలిగింది’’ అన్నారు. ప్రస్తుత సమాజం గురించి కమల్ మాట్లాడుతూ -‘‘ఇవాళ అన్నీ కలుషితమైపోయాయి. విద్య కలుషితమైంది. బోధనా విధానం చూస్తుంటే భయం వేస్తోంది. అది మాత్రమే కాదు.. విద్య చాలా ఖరీదైపోయింది. ఇక, ఆహారం విషయానికొస్తే, అది కూడా కలుషితమైపోయింది. ఏం తిన్నా భయపడుతూ తింటున్నాం. రాజకీయ వ్యవస్థ అయితే ఘోరంగా తయారయ్యింది’’ అన్నారు. -
సామాన్యుడిని గెలిపించండి
నల్లగొండ : పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి సామాన్యమైన వ్యక్తిని పోటీలో నిలబెట్టింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కోట్లకు పడగలెత్తిన వ్యక్తులను బరిలో దింపాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తీన్మార్ మల్లన్న గెలుపునకు పార్టీలకతీతంగా సమష్టిగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు పిలుపునిచ్చారు. గురువారం కాంగ్రెస్ మ ండలి అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ సందర్భంగా ఏచూరి గార్డెన్స్‌లో ఆ పార్టీ కార్యక ర్తల సమావేశం నిర్వహించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ సెక్రటరీ రామచంద్ర కుంతియా , రాష్ట్ర పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ...కేసీఆ ర్ పోరాటాల వల్ల తెలంగాణ రాలేదని, ప్రజల పోరాటాలకు చలించిన సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర ఆవిర్భావాన్ని కేసీఆర్ తన కుటుంబం గొప్ప తనంగా అభివర్ణించుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో నల్లగొండ జిల్లాలో కాం గ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపించుకున్న ప్రాచుర్యం ఉందన్నారు. పార్టీలో విభేదాలు వీడి కాంగ్రెస్ గెలుపునకు అందరూ కృషి చేయాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొన్న వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవులు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...ఎనిమిది నెలల కేసీఆర్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ... రాష్ట్రంలో పిట్టల దొర పాలనసాగు తోందన్నారు. విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. ఆంధ్రా పాలకులు జలదోపి డీ చేస్తున్నారని విమర్శించిన హారీష్ రావు.. చంద్రబాబుతో చేతులు కలిపి సాగర్ నుంచి నీటి ని విడుదల చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ సమష్టి కృషితో ఎమ్మెల్సీగా మల్లన్నను గెలిపించాలన్నారు. మోసపూరితమైన హామీలతో కేసీఆర్ అధికారం లోకి వచ్చారని ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ య్య మాట్లాడుతూ ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకుని కేసీఆర్ గత ఎన్నికల్లో..ఉప ఎన్నికల్లో గెలిచారని..అదే సెంటిమెంట్‌తో గద్దెనెక్కారని మాజీ కేంద్ర మంత్రి బలరాంనా యక్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ దళితుడికి-ధనవంతుడికి మధ్య పోరాటం జరుగుతో ందన్నారు. సమావేశానికి ఖమ్మం, వరంగల్ జిల్లాల పార్టీ అధ్య క్షులు సత్యం, రాజేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, డీసీఎంస్ చైర్మన్ జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, తిప్పన విజయసింహారెడ్డి, యెడవల్లి విజేయేందర్ రెడ్డి, మా జీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యా నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, పున్నా కైలాష్ నే త, మార్కెట్ కమిటీ చైర్మన్ పయిడి మర్రి సత్తిబాబు, మారుతి గురువులు, పాశం రామిరెడ్డి , గుమ్మల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఆస్తిపరుడిని కాదు : తీన్మార్ మల్లన్న ‘నేను ఆస్తిపరుడ్ని కాదు..వెనకాముందూ ఏమీ లేదు...ఈ ఎన్నికల్లో నేను గెలిచానా ఇప్పుడు ఏట్లా ఉన్నానో అప్పుడు అదేవిధంగా ఉంటాను’ అని తీన్మాన్ మల్లన్న చెప్పారు. -
సామాన్యుడి ఆశలు నెరవేరుద్దాం
తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌తో ప్రజలకు మేలు చేద్దాం సహకరించాలని అఖిలపక్షానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి పత్రాల లీకేజీ, ఇతర అంశాలపై ఆందోళన వ్యక్తంచేసిన పార్టీలు {పతిపక్షాలతో విభేదాలను పరిష్కరించుకుంటామని వెంకయ్య వెల్లడి సోనియా నివాసానికి వెళ్లి బడ్జెట్‌కు సహకరించాలని విజ్ఞప్తి నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను విజయవంతం చేయాలని అఖిలపక్ష పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌తో సామాన్యుడికి ప్రయోజనం చేకూరేలా అన్ని పార్టీలు పార్లమెంట్ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బడ్జెట్‌పై ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వాటిని నెరవేర్చే దిశగా ఉభయసభలు సజావుగా సాగేందుకు పార్టీలన్నీ సహకరించాలని విన్నవించారు. సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఆయన ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో అన్ని రాజకీయపార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలకు తగిన సమయం ఇస్తామని, ప్రాధాన్యాలవారీగా చర్చకు స్వీకరిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. పార్లమెంట్‌ను సజావుగా నడపడం అందరి సమష్టి బాధ్యతగా పేర్కొన్నారు. అప్పుడే సగటు వ్యక్తి ఆశలను నెరవేర్చేందుకు అవకాశం లభిస్తుందన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టనున్న 44 అంశాల ఎజెండా వివరాలను నేతలందరికీ వెంకయ్య వివరించారు. ఈ భేటీలో ఉభయసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 42 మంది వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. అఖిలపక్షంతో గంటపాటు భేటీ అయిన మోదీ అనంతరం నేతలందరితో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఆర్జేడీ తరఫున ఒక్కరూ ఈ సమావేశంలో పాల్గొనలేదని ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఈ భేటీకి ముందే వెంకయ్య స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసానికి వెళ్లి ఆమెను కలిశారు. పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. పెండింగ్ బిల్లులన్నీ ఆమోదం పొందేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు వెంకయ్య మీడియాకు తెలిపారు. పలు అంశాల ప్రస్తావన.. అఖిలపక్షంలో పలు అంశాలపై నేతలంతా ఆందోళన వ్యక్తం చేశారు. చమురు శాఖలో పత్రాల లీకేజీ వ్యవహారాన్ని పార్టీలన్నీ తీవ్రంగా పరిగణించాయి. ప్రభుత్వానికి సంబంధించిన కీలక పత్రాలు లీక్ కావడం, అందులో ఆర్థిక మంత్రి ప్రసంగించే బడ్జెట్లోని అంశాలు కూడా ఉండటంపై ఆందోళన వ్యక్తంచేశాయి. పెట్టుబడిదారీ వ్యవస్థే అధికారం చెలాయిస్తోందనడానికి ఈ కుంభకోణమే నిదర్శనమని జేడీయూ అధినేత శరద్‌యాదవ్ మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రతిపాదిత భూ సేకరణ చట్టంపైనా పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలతో చర్చించి పరిష్కారం కనుగొంటామన్నారు. భూ సేకరణ ఆర్డినెన్స్ విషయంలో తప్ప మరో ఐదు ఆర్డినెన్స్‌ల ఆమోదంపై మాత్రం ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. క్రికెటర్ల క్రమశిక్షణ కావాలి:స్పీకర్ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా ఆదివారం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని కోరారు. చట్టసభ సభ్యులు భారత క్రికెటర్ల క్రమశిక్షణను అలవర్చుకొని సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మన క్రికెటర్లు బాధ్యతాయుతంగా, చక్కని సమన్వయంతో వ్యవహరించి విజయం సాధించారని, ఇదే స్ఫూర్తిని ఎంపీలు అందిపుచ్చుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అఖిలపక్షంలో క్రికెట్ ఫీవర్ ఉభయసభల్లో వాడీవేడి చర్చలు సాగనున్న తరుణంలో జరిగిన అఖిలపక్ష భేటీలో సుహృద్భావ వాతావరణం నెలకొంది. అన్ని పార్టీల నేతలంతా సరదాగా గడిపారు. ఈ భేటీలో క్రికెట్ ఫీవర్ కూడా కనిపించింది. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ స్కోరును తెలుసుకునేందుకు పలువురు నేతలు ఉత్సుకత చూపారు. మంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా ఎప్పటికప్పుడు స్కోరును వెల్లడించ డం విశేషం. ఇటీవల రాజ్యసభకు తిరిగి ఎన్నికైన కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్‌కు వెంకయ్య అభినందనలు తెలిపారు. రాజ్యసభలో బీజేపీకి తక్కువ బలమున్న నేపథ్యంలో అక్కడున్న నేతలంతా దీనిపై చురుక్కులు-చమక్కులు విసురుకున్నారు. -
సామాన్యుడా... స్వాగతం!
సామాన్యుని ప్రపంచవ్యాప్త జైత్రయాత్ర ఢిల్లీకి చేరింది. మోదీ నాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నది ఆ సామాన్యుడే. అభివృద్ధి పేరిట సామాన్యుని కడుపు కొట్టి సంపన్నులకు పెట్టే ‘అభివృద్ధి’వాదులకు, జనాభాలో సగంగా ఉన్న పేద వర్గాలకు నచ్చే ‘చిల్లర మల్లర’ ‘జనాకర్షక’ విధానాల సమర్థకులకు మధ్య సంకుల సమరంగా ఢిల్లీ ఎన్నికలు మారాయి. ‘కొందరి అభివృద్ధి కోసం అందరికీ దారిద్య్రం’ ఇక చెల్లదంటూ సాగుతున్న ఈ ప్రతిఘటన సిరిజా లేదా ఆప్‌ల జయాపజయాలతో, సాఫల్యవైఫల్యాలతో నిమిత్తం లేకుండా ముందుకు సాగే చారిత్రక ధోరణి. కొన్ని దశాబ్దాల కిందటి మాట. రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసిన తొలి రోజులు. ఆసియా, ఆఫ్రికా దేశాలు అనేకం వలస సంకెళ్లు తెంచుకొని స్వతం త్రంగా అడుగులు వేయడం నేర్చుకుంటున్న రోజులు. రెండు ఆలోచనా స్రవంతులు, రెండు అభివృద్ధి నమూనాలు మరో ప్రపంచయుద్ధం స్థాయిలో ఘర్షించాయి. ఒకటి సంపదను సృష్టించడం మా తెలివైన బుర్రలకే సాధ్యమనే పెట్టుబడిదారీ నమూనా. రెండవది, సామాన్య శ్రామిక జనమే సంపదకు సృష్టికర్తలనే సోషలిస్టు నమూనా. సంపదలన్నీ ప్రజలందరికీ సమానంగా చెందాల్సిందేనంది సోషలిస్టు నమూనా. ‘సంపదను కాదు, దారిద్య్రాన్ని పంచుతారు అందరికీ’ అంటూ కేపిటలిస్టు, సోషలిస్టును ఎద్దేవా చేశాడు. స్వయంకృతాపరాధాలతో నిలకడగా సరైన సమాధానం చెప్పలేక సోషలిస్టు నీళ్లు నమిలాడు.. క్రమంగా చతికిలపడ్డాడు. విజయగర్వంతో కేపిటలిస్టు ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. కాల చ క్రం గిర్రున తిరిగింది. భూగోళం మీద అపారమైన సంపద పోగుపడింది. నాడు ఏడంతస్తుల మేడ ఓ కల. నేడు నూరంతస్తుల భవనం వాస్తవం. నాడు శ్రీమంతుడు అంటే లక్షాధికారి, మహా అయితే కోటీశ్వరుడు. ఆ వర్గం మధ్యతరగతిలోకి చేరింది. బిలియనీర్లు అవతరించారు. ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల(ఆరువేల కోట్ల రూపాయలకు పైగా)విలువైన సంపదకంటే ఎక్కువ ఉన్నవారు ఈ క్లబ్లో చేరుతారు. అలాంటి వారు ప్రపంచంలో రెండువేల మందికి పైగా ఉన్నారని ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ (2015) ప్రకటించింది. అందులో 97 మంది భారతదేశంలో ఉన్నారు. ప్రపంచంలో మనది మూడో స్థానమట. తొలి రెండు స్థానాలు అమెరికా, చైనాలవి. అయితే ఇది అధికారికంగా అంత సొమ్మును చూపగలిగిన ‘తెల్ల’ బిలియనీర్ల జాబితా మాత్రమే. అలా చూపలేని ‘నల్ల’ నయ్యలు మన దేశంలో అంతకు అనేక రెట్లు ఉంటారని అంచనా. 1980కి పూర్వం మొత్తం ప్రపంచదేశాల జీడీపీ(ఏదాదిలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల మొత్తం విలువ) కంటే నేటి అమెరికా ఒక్క దేశం జీడీపీయే ఎక్కువ. ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాల జీడీపీ లక్ష బిలియన్ డాలర్ల (అరవై కోట్ల కోట్ల రూపాయలు)కు చేరువైందని అంచనా. ప్రపంచ సంపద అపారంగా పెరిగిందనేది కళ్ల ముందట కనిపిస్తున్న వాస్తవం. అయితే అదే మేరకు ప్రజల మధ్య సంపద పంపిణీ హేతుబద్ధంగా ఉందా? ప్రపంచ పర్యావరణ సమతుల్యత ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో, అంతకంటే ఘోరంగా ఆర్థిక, సామాజిక సమతుల్యత దెబ్బతిన్నదనే నిజా లను తాజా గణాంకాలు చాటి చెబుతున్నాయి. ‘ఆక్స్‌ఫామ్’ (ఆక్స్ఫర్డ్ కమిటీ ఆన్ ఫేమిన్) అనే అంత ర్జాతీయ సంస్థ ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని ఈ మధ్యనే ప్రకటించింది. ప్రపంచ జనాభాలోని ఒక శాతం మంది చేతిలో 99 శాతం సంపద పోగుబడనుంది. మిగిలిన 99 శాతం ప్రజలు ఒక శాతం సంపదను పంచుకోబోతున్నారు. ఒక ఏడాదిలోపునే ప్రపంచం ఈ మైలురా యిని చేరుకుంటుందట. సగటున రోజుకు రెండు డాలర్లకంటే తక్కువ సంపాదన ఉన్నవారు ప్రపంచంలో 300 కోట్ల మంది ఉన్నారని ‘వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ ఇండికేటర్స్’ (2008) నివేదిక వెల్లడించింది. దుర్భర దారిద్య్ర పరిస్థితుల కారణంగా ప్రతిరోజూ 22 వేల మంది పిల్లలు మృత్యు వాత పడుతున్నారని ‘యూనిసెఫ్’ నివేదిక వెల్లడిస్తోంది. డయేరియాతో (అతిసార వ్యాధి) ఏటా 18 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. 110 కోట్ల మందికి తాగునీటి వసతి లేదు. 260 కోట్లమందికి పారిశుద్ధ్య సదుపాయం లేదు. వ్యక్తిగత వస్తు వినియోగం లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అత్యంత సంపన్నులైన 20 శాతం మంది ప్రపంచం అంతటా ఉత్పత్తవుతున్న మొత్తం వినిమయ వస్తు సామగ్రిలో 76.6 శాతాన్ని వినియోగిస్తుంటే, అత్యం త పేదలైన 20 శాతం మంది కేవలం ఒకటిన్నర శాతం వినియోగిస్తున్నారు. 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా ప్రజలు కాస్మెటిక్స్ మీద ఏటా చేసే ఖర్చు 50 వేల కోట్ల రూపాయలు. కాగా, నూట పాతిక కోట్ల జనాభాగల మన దేశ తాజా బడ్జెట్లో తాగు నీటికీ, పారిశుద్ధ్యానికి సంయుక్తంగా కేటాయించినది 15 వేల కోట్ల రూపాయలు. 75 కోట్ల ఐరోపా ఖండ ప్రజలు కాలక్షేపంగా ఐస్‌క్రీమ్‌లు లాగించేయడానికి ఏటా 70 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే, మన కేంద్ర బడ్జెట్ ప్రాథమిక విద్యారంగం కోసం కేటాయించినది రూ. 40 వేల కోట్లు. విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు వంటి కనీస వసతులు అందని తీవ్ర పేదరికంలో 30 కోట్ల మంది భారతీయులు ఇప్పటికీ బతుకులీడుస్తున్నారని నాలుగు రోజుల కిందటే విడుదలైన సహస్రాబ్ది అభి వృద్ధి లక్ష్యాలపై ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ఇలా పేద, ధనిక వర్గాల మధ్య అంతరం అనంతంగా పెరుగుతూనే ఉంది. పెట్టుబడిదారీ వర్గ ప్రవక్తలైన ప్రపంచ బ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌ల అభీష్టం (ఫండ్-బ్యాంకు విధానాల) మేరకు ప్రపంచంలో సంపద సృష్టి బాగానే జరి గింది. కానీ అది కొద్ది మంది సంపన్నులదిగా కేంద్రీకృతమైంది. ‘అభివృద్ధితో ఆకలి, పేదరికాల నిర్మూలన’ అన్న పెట్టుబడిదారీ ప్రవక్తల ప్రవచనాలు ఆచర ణలో పేదల మధ్య దారిద్య్రం పంపిణీగానే మిగిలాయి. పేద, బడుగు దేశాల వృద్ధి సైతం సంపన్న దేశాలకే మేలు చేసింది. ఈ పరిణామానికి ప్రధాన బాధ్యత ‘ఫండ్-బ్యాంకు’ ప్రవక్తలదే. వర్ధమాన దేశాల్లో అవి అమలు చేసిన రుణ నిబంధనలు అవాంఛనీయ స్థాయి ప్రైవేటీకరణకు దారులు వేసి పేద వర్గాలకు, సామాన్యులకు కనీస వసతులను సైతం దూరం చేశాయి. ఆ ఆర్థిక, సామాజిక విధానాలనే నయా ఉదారవాద విధానాలనే హాస్యాస్పదమైన పేరుతో పిలుస్తున్నారు. వాటి ఫలితంగానే చివరకు ప్రపంచ జనాభాలో ఒక శాతం చేతిలో 99 శాతం సంపద అనే అమానవీయ దశకు పెట్టుబడిదారీ ‘అభివృద్ధి’ చేరింది. అవధులు దాటిన ఆ అమానవీయతే, దురాశే ప్రపం చాన్ని 2008 నుంచి కనీవినీ ఎరుగని సంక్షోభంలోకి నెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మానవాళి కథ మరో మలుపు తిరగడమూ ప్రారంభమైంది. పెట్టుబడిదారీ సంపద సృష్టి యజ్ఞంలో తీవ్ర దురన్యాయానికి, వంచ నకు గురయిన సామాన్యుడు నెమ్మదిగా శిరసెత్తి ప్రశ్నించడం మొదలు పెట్టా డు. సొమ్మసిల్లిన గత సోషలిస్టు ఉద్యమాలే స్ఫూర్తిగా ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట ప్రారంభించాడు. తోచిన ప్రత్యామ్నాయాన్ని నిర్మించుకుంటూ ‘నయా ఉదారవాద’ దండయాత్రకు ఎదురునిలిచి పోరాడటం మొదలు పెట్టాడు. ప్రపంచ బ్యాంకు-ఐఎమ్‌ఎఫ్‌ల దౌష్ట్యానికి తొలి సమిధలైన లాటిన్ అమెరికా దేశాల నుంచే సామాన్యుని ప్రతిఘటన ప్రారంభమైంది. వెనిజు లాకు చెందిన హ్యూగో చావేజ్ నాయకత్వం ఇచ్చిన ఉత్తేజంతో చిలీ, బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, బొలీవియా, నికరాగ్వా తదితర పన్నెండుకుపైగా వామ పక్ష ప్రభుత్వాలు అలా ఆవిర్భవించినవే. గ్లోబలైజేషన్ శకంలో బ్యాంక్-ఫండ్ ప్రవచనాలకు ప్రత్యామ్నాయమే లేదనే మూఢ మేధావులు ఆ ప్రభుత్వాలను మూణ్ణాళ్ల ముచ్చటేనని శాపనార్థాలు పెట్టారు. ఇదిగో నేడు, రేపు కుప్పకూలు తాయని జోస్యాలు చెప్పారు. నేడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు చౌకగా తాగు నీరు, విద్యుత్తు, రవాణా తదితర ప్రజోపయోగ సర్వీసులను వాగ్దానం చేయ డాన్ని ఈసడిస్తున్నట్టే లాటిన్ అమెరికన్ వామపక్ష ఆర్థిక విధానాలను హేళన చేశారు. వెక్కిరించిన పెట్టుబడిదారీ విధానం 2008లో వెల్లకిలా పడి మరి లేవలేదు. అక్కడి నుంచి ప్రారంభమైన సామాన్యుని ప్రతిఘటనా యాత్ర ఇప్పుడు ప్రపంచమంతటికీ విస్తరిస్తున్నట్టు కనబడుతున్నది. ‘‘రొట్టె ముక్క, ఉపాధి, స్వేచ్ఛ’’ల కోసం ఎలుగెత్తిన అల్పులే మధ్య ప్రాచ్యాన్ని ఊపే సిన అరబ్బు వసంతంగా పుష్పించారు. దగాపడి ఓడినా, పెట్టుబడి కోట అమెరికాలో ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమానికి ఊపిరులయ్యారు, ‘యూరో’ కాటుకు విలవిల్లాడుతున్న ఐరోపా సామాన్యుల ఆగ్రహమే స్పెయిన్, సైప్రస్, పోర్చుగల్‌ల నుండి జర్మనీ రాజధాని బెర్లిన్ వరకు అడుగడుగునా ప్రత్యక్ష మైంది. గడచిన కొద్దిరోజులుగా ఆస్ట్రేలియా నుంచి కూడా సామాన్యుని గళం ప్రపంచమంతా ప్రతి ధ్వనించేలా వినబడుతోంది. విక్టోరియా, క్వీన్స్లాండ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలనిచ్చిన సామాన్యుడు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. అడవులు, భూములు, కొండలు, గనులు వగైరా ప్రజా ఆస్తులను అడ్డగోలుగా అమ్మేసుకుంటున్న ప్రభుత్వ దుర్నీతిని వీధుల్లోకి వచ్చి ప్రశ్నించిన సామాన్యుడు ఎన్నికల్లో పాలక పార్టీని మట్టి కరిపించి లేబర్ పార్టీకి పట్టం కట్డాడు. గ్రీస్‌లో ‘సిరిజా’కు బ్రహ్మరథంపట్టి పొదుపుచర్యల పేరిట పెట్టుబడిదారీ ప్రభుత్వాలు సామాన్యులపై వేటు వేయడం ఇక సాగ దని ప్రకటించాడు. సామాన్యుని ప్రపంచవ్యాప్త జైత్రయాత్ర ఇప్పుడు ఢిల్లీ వీధులకు చేరిం ది. ఎదురు లేదనుకున్న నరేంద్ర మోదీ నాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న ఘనత ఆ సామాన్యుడిదే. ఢిల్లీ నగరం నిట్టనిలువునా చీలిపో యింది. అభివృద్ధి పేరిట సామాన్యుని కడుపు కట్టి, కొట్టి సంపన్నులకు పెట్టే ‘అభివృద్ధి’ సమర్థకులకు, జనాభాలో దాదాపు సగభాగంగా ఉన్న పేద వర్గాల ‘చిల్లర మల్లర’ ‘జనాకర్షక’ విధానాల సమర్థకులకు మధ్య సంకుల సమరం గా ఢిల్లీ ఎన్నికలను మార్చింది. మోదీ ‘అభివృద్ధి’ మైకం వీడి మధ్య తరగతి ఏ కొద్దిగా మొగ్గినా ఆమ్ ఆద్మీ విజయఢంకా మోగడం ఖాయం. ఫలితాల మాట ఎలా ఉన్నా, ఈ రోజున ఢిల్లీలో సామాన్యుడు మోహరించిన తీరు భారత రాజకీయాల్లో నూతన రుతు ఆగమనానికి సంకేతం. ‘కొందరి అభి వృద్ధి కోసం అందరికీ దారిద్య్రం’ అనే దురన్యాయం ఇంకానా? ఇక సాగదం టూ సాగే ఈ సామాన్యుని రాజకీయ ప్రతిఘటన సిరిజా లేదా ఆప్‌ల జయాప జయాలతో, సాఫల్యై వెఫల్యాలతో నిమిత్తం లేకుండా ముందుకు సాగే చారి త్రక ధోరణి. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై ఎవ్వని యందు డిందు... ఆ సామాన్యుండెవ్వడు వాని నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్! muralivardelli@yahoo.co.in -
ఆర్కే లక్ష్మణ్‌కు తుది వీడ్కోలు
సాక్షి, ముంబై/పుణే: పదునైన కార్టూన్లతో కోట్లాది మంది ముఖాల్లో నవ్వులు పూయించిన ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్‌కు దేశం కంటతడితో తుడి వీడ్కోలు పలికింది. అనారోగ్యంతో కన్నుమూసిన ఆయన అంత్యక్రియలను మంగళవారం పుణేలోని వైంకుఠ్ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. ‘కామన్ మేన్’ కార్టూన్ల సృష్టికర్తకు గౌరవంగా సైనిక వందనం చేశారు. లక్ష్మణ్ తనయుడు శ్రీనివాస్ చితికి నిప్పంటించారు. అంతకుముందు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, విద్యామంత్రి వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే, లక్ష్మణ్ పనిచేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక మాజీ సంపాదకుడు దిలీప్ పడ్గావ్కర్ తదితరులు ల క్ష్మణ్ భౌతిక కాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పంపిన సందేశాన్ని జవదేకర్ అందజేశారు. ‘గొప్ప కార్టూనిస్టును, పొద్దుటిపూట నవ్వును శాశ్వతంగా కోల్పోయాం’ అని మోదీ అందులో పేర్కొన్నారు. అంత్యక్రియలకు ముందు లక్ష్మణ్ పార్థివదేహాన్ని అభిమానుల సందర్శన కోసం సింబయోసిస్ ఇన్స్టిట్యూట్లో ఉంచారు. లక్ష్మణ్ సృష్టించిన కామన్ మేన్ ప్రపంచం ఉన్నంతవరకు ఉంటాడని, రాజకీయ వ్యవస్థకు అతడు చెక్ పెడతాడని ఫడ్నవిస్ పేర్కొన్నారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చేందుకు లక్ష్మణ్ పేరిట స్మార కాన్ని నిర్మిస్తామని తెలిపారు. తన తండ్రి బాల్ ఠాక్రేతో లక్ష్మణ్కున్న అనుబంధాన్ని ఉద్ధవ్ గుర్తు చేసుకున్నారు. 94 ఏళ్ల లక్ష్మణ్ దీర్ఘకాల అనారోగ్యంతో సోమవారం పుణేలో మృతిచెందడం తెలిసిందే. ఆయన మృతికి బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, అమీషా పటేల్ తదితరులు ట్వీటర్లో నివాళి అర్పించారు. లక్ష్మణ్ కుటుంబం వద్ద వందలాది చిత్రాలు లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో సంభాషణల సమయంలో వేసిన వందలాది చిత్రాలు(డూడుల్స్) పదిలంగా ఉన్నాయి. ఎక్కడా ప్రచురితం కాని ఇవి ఆయన అన్న కుమారుడు ఆర్ఎస్ కృష్ణస్వామి వద్ద ఉన్నాయి. ల క్ష్మణ్ 1975-1991 మధ్య సెలవుల కోసం మైసూర్, బెంగళూరు వెళ్లినప్పుడు వీటిని గీశారు. -
రెక్కలు తొడిగి...చుక్కల్లోకి...
భారీగా పెరిగిన కూరగాయల ధరలు సాక్షి, సిటీబ్యూరో: సుమారు పక్షం రోజుల క్రితం అల్లకల్లోలం సృష్టించిన తుపాన్ భూతం ధరల రూపంలో భాగ్యనగరంపై పడింది. ఇక్కడ సామాన్యుడి వంటింట్లో ధరల మంటను రాజేసింది. తుపాన్ దెబ్బతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు సగానికి పడిపోయాయి. దీంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. స్థానికంగా క్యాబేజీ, క్యారెట్, దోస వంటి కూరగాయలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. మిగతా కూరగాయల కోసం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల దిగుమతుల పైనే నగర మార్కెట్ ఆధారపడాల్సి వస్తోంది. అయితే... ఇటీవల తుపాన్‌తో సీమాంధ్రలో కురిసిన వర్షాల వల్ల కూరగాయల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. స్వల్పంగా దక్కిన పంటకు సైతం స్థానికంగా మంచి డిమాండ్ ఉండటంతో నగరానికి దిగుమతి కాని పరిస్థితి ఎదురైంది. డిమాండ్-సరఫరాల మధ్య తీవ్రమైన అంతరం కూరగాయల ధరలపై పడింది. ఇదే అదనుగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఏ కూరగాయల ధర చూసినా రూ.20-60 మధ్య పలుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రైతుబజార్లలో సైతం ధరల పరిస్థితి అదుపు తప్పింది. ఇతర ప్రాంతాలపైనే... సీమాంధ్రలో వర్షాలతో పంటలు దెబ్బతిన గా...ఇక్కడ సకాలంలో వర్షాలు లేక వేసిన పైర్లు ఎండిపోయాయి. బోర్లు, బావుల కింద పంట సాగు కూడా నెల క్రితమే ముగిసింది. ప్రస్తుతం దోస, క్యాబేజీ, క్యారెట్ తప్ప ఇతర కూరగాయలేవీ కానరావడం లేదు. స్థానికంగా దిగుబడి లేకపోవడంతో ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోంది. కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పచ్చిమిర్చి సరఫరా అయ్యేది. బెండ, దొండ, బీర, టమోటా, చిక్కుడు, గోకర, క్యాప్సికం, ఫ్రెంచిబీన్స్, ఆలు, ఉల్లి వంటివి బెంగళూరు, మదనపల్లి. కర్నూలు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కొద్దిపాటి పరిమాణంలో వస్తున్నాయి. తుపాన్ తర్వాత కూరగాయల దిగుమతులు గణనీయంగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వినియోగదారుని ఆదుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు చేతులెత్తేశారు. వర్షాల వల్ల ఈ పరిస్థితి ఎదురైందని, దిగుమతులు పెరిగితే ధరలు వాటంతట అవే కిందకు దిగి వస్తాయంటూ దాట వేస్తున్నారు. -
ఊరు వెళ్లాలంటే .... నడ్డి విరిగినట్లే
హైదరాబాద్: దసరా పండగ, బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని వరస సెలవులు రావడంతో ప్రజలంతా తమ తమ స్వస్థలాలకు పయనమవుతున్నారు. అదే అదనుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణికుల నుంచి అయిన కాడికి దండుకుంటుంది. దీంతో ప్రయాణికులు జేబులు గుల్ల అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు ఒక్కో ప్రయాణీకుడి నుంచి రూ. 3500 వసూల్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి రూ. 2500 వసూల్ చేస్తున్నారు. పండగ సమయాల్లో ప్రభుత్వం అదనపు బస్సులు, పలు అదనపు రైలు సర్వీసులు ఏర్పాటు చేసిన వాటిలో కూడా ప్రజలు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. అదికాక ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన అసలు టికెట్ మీద ప్రత్యేక ఛార్జీ పేరుతో అధిక మొత్తంలో వసూల్ చేస్తుంది. అలాగే రైళ్లు కూడా తత్కాల్ పేరిట ఇప్పుడు వరకు ఉన్న ఛార్జీల బాధుడు చాలదన్నట్లు... ప్రీమియం తత్కాల్ పేరిట ప్రయాణీకులపై మరింత భారాన్ని మోపాయి. దీంతో సామన్యా ప్రయాణికుడు పండగ సమయంలో ప్రయాణం పెట్టుకుంటే దూల తీరిపోతుంది. ఛార్జీలను కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుండటంతో ప్రజలు తమ ఖర్మ అని సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
టీడీపీ ఎమ్మెల్యే గారి కండకావరం
అది చేస్తాం... ఇది చేస్తాం...అన్ని చేస్తాం... అంటూ ఎన్నికలలో పోటీ చేసిన నాయకులు ఎన్నికల ముందు ఓట్లరు మహాశయులను ఓట్లు అడుగుతారు. వారి మాటలు నమ్మి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని సదరు నాయకులను గెలిపిస్తారు. ఆ తర్వాత ఆ నాయకుడు కనీసం ఓటరు మెహం కూడా చూడరు. తమకు అన్ని చేస్తామని చెప్పిన నాయకులు ఆ తర్వాత టీవీలలో అప్పుడప్పుడు అక్కడకక్కడ కనిపిస్తుంటారు. దాంతో ఆ నాయకులపై సదరు ఓటర్లు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఐదేళ్ల తర్వాత ఎన్నికల సమయం ఆసన్నం కాగానే మళ్లీ ఆ నాయకులే ప్రజలే దేవుళ్లు అంటు వారి ముందు వచ్చి వాలతారు. ఆ సమయంలో కొంత మంది ఓటర్లు ఆగ్రహం తారస్థాయికి చేరుకుంటుంది. మంగళవారం కడప జిల్లా ప్రొద్దుటూరులో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓట్లు అడిగేందుకు వచ్చిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే లింగారెడ్డిని స్థానికుడు శ్రీనివాసులు అదే విషయాన్ని ప్రశ్నించాడు. అంతే సదరు ఎమ్మెల్యేగారుకి శ్రీనివాసులుపై కోపం కట్టలు తెంచుకుంది. నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఎమ్మెల్యే లింగారెడ్డి ... శ్రీనివాసు చెంప ఛెళ్లు మనిపించాడు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ప్రశ్నిస్తే కొడతారా అంటూ అక్కడ ఉన్న స్థానికులు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేను సామాన్యుడిని:గవర్నర్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ సాధారణంగా మీడియూతో ఎక్కువగా వూట్లాడరు. కానీ నూతన సంవత్సరం సందర్భంగా ఆయున విలేకరులతో పిచ్చాపాటీగా అరుునా సుదీర్ఘంగా ముచ్చటించారు. తనపై జరిగే ప్రచారాలపైనా స్పందించారు. వివరాలు ఆయున వూటల్లోనే ... ‘‘దేవాలయం, షాపింగ్, సినిమా.. ఎక్కడకు వెళ్లినా నా వల్ల సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగించాలన్నది నా ఉద్దేశం కాదు. దేవాలయూల సందర్శన సందర్భంగా భక్తులెవరికీ అసౌకర్యం కలగకుండా చూడాలని వ్యక్తిగత, భద్రతా సిబ్బందిని ఆదేశించా. 1953లో గగన్‌మహల్ ప్రాంతం అంతా అడవిగా ఉండేది. ఆ అడవిలో నేను హనుమాన్ను కనుగొన్నాను. అప్పటినుంచి ఇప్పటివరకు ఎక్కడున్నా ప్రతిరోజూ హనుమాన్ దేవాలయాలకు వెళ్లడం అలవాటుగా మారింది. ఇతరులతో పోలిస్తే నాది అతిచిన్న కార్ల కాన్వాయ్. కేవలం ఐదు వాహనాలు మాత్రమే ఉంటారుు. నేను సామాన్యుడిని. మూడేళ్ల తర్వాత కూడా సామాన్యుడినే. సైకిల్, బస్సు లేదా ఇతర ఏ రవాణా వాహనంలో వెళ్లడానికైనా నేను సిద్ధం. నడిచి కూడా వెళ్తాను. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గవర్నర్‌గా ఉండడం గొప్పతనం ఏమీ కాదు. భద్రత అవసరం లేదని ప్రభుత్వం భావిస్తే తొలగించవచ్చు. నేను దానిని ఆహ్వానిస్తాను. మీరు నా మాటలు, చిత్రాలను చిత్రీకరిస్తూనే.. ఎవరైనా నన్ను కాల్చడానికి అవకాశం ఉంది. నేనేమీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోలేదు. నాకేమైనా రక్షణ కల్పించారా? రాజ్‌భవన్‌లో ఇంతమంది మధ్య హాయిగా ఉన్నాను. ఇక్కడున్న సామాన్య ప్రజలు, ఆ దేవుడు రక్షిస్తారన్న నమ్మకం నాకుంది. సామాన్య ప్రజలంతా నా వెంటే ఉన్నారు. హోలీ ఆడటం నాకు ఇష్టం. సామాన్య ప్రజలందరి మాదిరిగా నేను ఆడతా. అప్పుడు కూడా భద్రత ఉండదు. నేను గవర్నర్‌గా వచ్చినప్పుడు హైదరాబాద్‌లో కర్ఫ్యూ అమల్లో ఉంది. వారం రోజుల తరువాత పరిస్థితులు చక్కబడ్డాయి. దేవుని దయతో ఇప్పుడంతా ప్రశాంతంగా ఉంది. ఈ సంవత్సరం కూడా రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. తెలుగు మీడియా సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. కొద్దిగా ఇబ్బంది అరుునా తెలుగు పత్రికలు చదువుతాను. తెలుగు పత్రికల తర్జుమా మొత్తాన్ని చదువుతాను. తెలుగు టీవీ ఛానెల్స్‌లో వార్తలు అన్నీ చూస్తాను.’’ అని గవర్నర్ తెలిపారు. -
అ 'సామాన్య' ముద్ర
రాజకీయ ప్రక్షాళనపై ప్రజల్లో ఆశలు రేకెత్తించిన ‘ఆమ్ ఆద్మీ’ పాలకుల అవినీతి ఉదంతాలు వెలుగు చూసినప్పుడల్లా.. ప్రజా సమస్యలపై వారి ఉదాసీనత చూసినప్పుడల్లా.. సామాన్యులకు కోపం వస్తూనే ఉంటుంది. వారి నుంచి నిరసన గళం వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడూ ధర్నాలూ, రాస్తారోకోలూ చేస్తూనే ఉంటారు. ఈ నిరసనలు ఒక్కోసారి రోజులు, వారాలు నడుస్తాయి. మామూలుగా అంతటితో ఆగిపోతుంటాయి. పరిస్థితి మళ్లీ ఎప్పటిలానే ఉంటుంది. కానీ.. 2013లో ఒక అసాధారణ ‘సామాన్యుడు’ ఆవిర్భవించాడు. అవినీతికి వ్యతిరేకంగా పొలికేక పెట్టాడు. చీపురు పట్టుకుని అవినీతిని తుడిచేస్తానంటూ ఢిల్లీ వీధుల్లోకి వచ్చాడు. ముందసలు రాజకీయాలనే ప్రక్షాళన చేయాలని.. రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చేస్తామని ఎన్నికల బరిలోకి దిగాడు. మహామహులంతా ‘ఆ.. సామాన్యుడు.. ఏం చేయగలడు?’ అని తేలికగా తీసిపారేశారు. కానీ.. ఒకటిన్నర శతాబ్దాల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ పదిహేనేళ్ల పాలనకు చరమగీతం పాడేశాడా సామాన్యుడు. పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కురువృద్ధురాలినీ బ్యాలెట్ పోరులో మట్టికరిపించాడు. దాదాపు యాభై ఏళ్ల చరిత్ర గల ప్రతిపక్ష బీజేపీని అధికారానికి ఆమడదూరంలో నిలిపివేశాడు. కాస్త మెజారిటీ తగ్గినా.. తానే ఢిల్లీ రాష్ట్ర గద్దెనెక్కాడు. ఆ సామాన్యుడే.. ఆమ్ ఆద్మీ పార్టీ. నిండా ఏడాది వయసున్న ఒక పసికూన పార్టీ.. అంగబలం, అర్థబలం, ప్రజాకర్షణ గల హేమాహేమీలు వంటి హంగూ ఆర్భాటాలు ఏవీ లేని ఒక సామాన్య పార్టీ.. జాతి, కులం, మతం, ప్రాంతం వంటి కార్డులేవీ లేకుండా కొత్త చరిత్రను లిఖించింది. దేశంలో సరికొత్త సామాన్య రాజకీయాలకు నాంది పలికింది. ఉద్యమం నుంచి పార్టీ ఆవిర్భావం... సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న 45 ఏళ్ల మాజీ ఐఆర్ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్.. అనంతర పరిణామాల్లో ఏడాది కిందట ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. రాజకీయ పార్టీ స్థాపించటాన్ని హజారే వ్యతిరేకించినా కేజ్రీవాల్ వెనుకంజ వేయలేదు. తొలుత మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీచేశారు. అక్కడ పరాజయమే పలకరించింది. మళ్లీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. సామాన్యులకే టికెట్లు అన్నారు. ఇంటింటికీ పార్టీ కార్యకర్తలు వెళ్లారు. వారి సమస్యలు ఏమిటో అడిగారు. ఆ సమస్యలన్నిటినీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వస్తే.. సామాన్య ప్రజల సమస్యలన్నిటినీ తీరుస్తామన్నారు. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ హవా ఉంటుందని సర్వేలు చెప్పటం మొదలైంది. అంత సీన్ లేదని ప్రధాన పార్టీలు కొట్టిపారేశాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీలు దిగ్భ్రాంతి చెందాయి. రాజకీయ నిపుణులు ఆశ్చర్యపోయారు. సామాన్య ప్రజల్లో హర్షాతిరేకాలు పెల్లుబికాయి. ఆ ఫలితాలతో దేశంలో సైతం ప్రజాస్వామ్య రాజకీయాల ప్రక్షాళనపై కొత్త ఆశలు చిగురించాయి. వరుసగా పదిహేనేళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ మట్టి కరిచింది. కేవలం 8 సీట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై కేజ్రీవాల్ స్వయంగా పోటీచేశారు. అది దుస్సాహసం అని చాలా మంది అనుకున్నారు. కేజ్రీవాల్ తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి షీలాదీక్షిత్‌కు, బీజేపీ అభ్యర్థికి పోలైన ఓట్లను కలిపి కూడినా.. కేజ్రీవాల్‌కు పోలైన ఓట్లకు అందనంత దూరంలో ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 28 సీట్లు లభించాయి. రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీజేపీ 30 సీట్లతో పెద్ద పార్టీగా నిలిచింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీ ఏ పార్టీకీ రాలేదు. హంగ్‌లో హార్స్ ట్రేడింగ్ మాయం..! హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు.. మెజారిటీకి దగ్గరగా వచ్చిన పార్టీలు.. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించి ఏ రకంగానైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి సాధారణంగా చేసే ప్రయత్నాలేవీ ఈసారి ఢిల్లీ విషయంలో మచ్చుకైనా కనిపించలేదు. పెద్ద పార్టీలు రెండూ కూడా ‘ప్రజా తీర్పును అనుసరించి’ ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్నాయి. చిత్రమేమిటంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. తాము మద్దతిస్తామని అతి చిన్న పార్టీ కాంగ్రెస్‌తో పాటు.. అతిపెద్ద పార్టీ బీజేపీ కూడా ప్రకటించింది. ఏ పార్టీ తమపై అవినీతి ముద్రవేసి దారుణంగా ఓడించిందో అదే పార్టీకి మద్దతిస్తామని కాంగ్రెస్ ముందుకు రావటం.. ప్రధాన స్రవంతి రాజకీయ ఆలోచనల్లో ‘సామాన్యుడు’ తెచ్చిన కీలక మార్పు. ఇక ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకుండా.. మద్దతు సమీకరణకు ప్రయత్నించకుండా.. రెండో పెద్ద పార్టీకి మద్దతిస్తామని చెప్పటం కూడా.. ప్రధాన పార్టీల ఆలోచన, ఆచరణల్లో ‘సామాన్యుడు’ ప్రాథమికంగా తీసుకువచ్చిన మార్పు. రెండు పార్టీల మద్దతునూ తొలుత నిరాకరించిన ఆప్.. ఆ తర్వాత ఆ రెండు పార్టీలకూ కొన్ని షరతులు పెడుతూ.. వాటిని అంగీకరిస్తారా? అని లేఖలు రాసింది. ప్రభుత్వ ఏర్పాటుపై సొంతంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. వాటి ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. డిసెంబర్ 28వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ‘సామాన్యుడు’ ఆశలు నెరవేర్చేనా? భారత రాజకీయ యవనికపై.. ఢిల్లీ అసెంబ్లీ బరిలో సుడిగాలిలా దూసుకొచ్చి.. సంచలనం సృష్టించి.. పెను మార్పును ముందుకు తెచ్చిన ‘ఆమ్ ఆద్మీ’ విజయప్రస్థానం కొనసాగుతుందా? స్వచ్ఛమైన రాజకీయాలు అందించగలుగుతుందా? ఇచ్చిన హామీలను నెరవేర్చగలుగుతుందా? అన్న సందేహాలు వేదిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే.. ‘తరాల తరబడి తిష్టవేసిన అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేయటం.. చెప్పినంత సులువు కాదు. ఏది ఏమైనా మూస రాజకీయాలపై విసిగివేసారిన సామాన్యులకు ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త ప్రత్యామ్నాయంగా.. ఆశాదీపంలా అందివచ్చిందనేది.. ప్రధాన స్రవంతి పార్టీలన్నీ మళ్లీ సామాన్యుడి కేంద్రంగా ఆలోచించేలా చేశాయనేది.. అందరూ అంగీకరిస్తున్న విషయం. -
కొత్త ఏడాదీ ‘నీటి’కోతే!
సాక్షి, హైదరాబాద్: సామాన్యుడు సైతం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏయేటికాయేడు బడ్జెట్‌ను రూపొందించుకుంటాడు. కానీ ఘనత వహించిన మన జలమండలి నీటిబిల్లులపైనే తప్ప సరఫరాపై అసలు దృష్టి సారించడం లేదు. ఫలితం.. గ్రేటర్ కన్నీటి కష్టాలు కొత్త ఏడాది (2014)లోనూ తీరే దాఖలాలు కనిపించడం లేదు. కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాలు నత్తనడకన సాగుతుండటం.. సరఫరా నష్టాలు తడిసి మోపెడవుతుండటం.. వెరసి వచ్చే ఏడాదీ పానీ పరేషాన్ తథ్యమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరో మూడేళ్ల వరకూ ఇదే పరిస్థితి తప్పదంటున్నారు. జలమండలి ప్రస్తుతం రోజువారీగా నగరం నలుమూలలకు 340 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు రికార్డులు చూపుతున్నా.. సరఫరా నష్టాలు 40 శాతం మేర ఉండడంతో వాస్తవ సరఫరా 204 మిలియన్ గ్యాలన్లకు మించడం లేదన్నది అక్షర సత్యం. ఇక 2014లో గ్రేటర్ మంచినీటి డిమాండ్ 595 మిలియన్ గ్యాలన్లకు చేరుతుందని జలమండలి వర్గాలు తాజాగా అంచనా వేశాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 490 మిలియన్ గ్యాలన్లు, జీహెచ్ఎంసీకి ఆనుకొని ఉన్న శివారు ప్రాంతాలకు 105 మిలియన్ గ్యాలన్ల మంచినీరు అవసరం ఉంటుందని లెక్కగట్టారు. అయితే వచ్చే ఏడాదిలో కృష్ణా మొదటి, రెండవ, మూడవ దశలతోపాటు మంజీరా, సిం గూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట్) జలాశయాల నుంచి సేకరించే నీటి మొత్తం 533 మిలియన్ గ్యాలన్లకు మించని పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే డిమాండ్, సరఫరాల మధ్య అంతరం 62 మిలియన్ గ్యాల న్లుగా ఉంటుందని, దీంతో పానీ పరేషాన్ తప్పదని అంచనా వేయడం గమనార్హం. వీటిలో సరఫరా నష్టాలు కట్టడి చేయని పక్షంలో కొరత మరింత పెరిగే ప్రమాదం పొంచివుంది. కాగా మహానగరం పరిధి శరవేగంగా విస్తరిస్తున్నా మంచినీటి సరఫరా అదే స్థాయిలో పెరగడం లేదు. దీంతో కొత్త ఏడాదిలోనూ గ్రేటర్ వాసులకు కన్నీటి కష్టాలు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించి, కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకాలను సత్వరం పూర్తిచేస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరో మూడేళ్లూ కటకటే.. ఇక 2017 నాటికీ గ్రేటర్ దాహార్తి పూర్తిస్థాయిలో తీరే పరిస్థితి కనిపించడంలేదు. 2017 నాటికి మహానగర నీటి సరఫరాకు 627 మిలియన్ గ్యాలన్ల మంచినీరు అవసరమౌతుందట. కానీ అప్పటికీ అందుబాటులో ఉండే నీటివనరులు 533 మిలియన్ గ్యాలన్లకు మించని పరిస్థితి ఉంది. దీంతో అప్పటికీ డిమాండ్, సరఫరాకు మధ్య అంతరం 94 మిలియన్ గ్యాలన్లుగా ఉండబోతుందని జలమండలి అంచనా వేస్తోంది. -
‘ఆప్’ రాకతో సామాన్యుడిలో కొత్త ఆశలు
నాగేశ్వర్, చుక్కా రామయ్య ఢిల్లీలో విజయంపై ఆప్ రాష్ర్ట శాఖ విజయోత్సవం సాక్షి, హైదరాబాద్: రాజకీయాలంటే తప్పుడు అభిప్రాయంతో ఉన్న సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కొత్త ఆశలు రేకెత్తించిందని ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఏవీ కాలేజ్ ప్రాంగణంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ప్రసగించారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాల విషయంలో ఆప్ అనుసరించిన ధోరణి ప్రశంసనీయమని నాగేశ్వర్ అన్నారు. ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఢిల్లీ మాదిరిగా ఏపీలో కూడా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని ఈ విషయంలో ఆ పార్టీకి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. వ్యాపారమయమైన రాజకీయాలను మార్చడం కోసం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రయత్నం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ప్రశంసించారు. అవినీతికి తావులేకుండా, స్వచ్ఛమైన రాజకీయాలు కష్టమనుకుంటున్న తరుణంలో కేజ్రీవాల్ వాటిని నిజం చేసి చూపించారని, దేశవ్యాప్తంగా ఇలాంటి రాజకీయ వాతావరణం రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా లోక్‌సత్తా పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆప్‌లో చేరారు. కార్యక్రమంలో ఆప్ రాష్ట్రశాఖ నేతలు ప్రొఫెసర్ ఆర్.రమేష్‌రెడ్డి, హర్షద్ హుస్సేన్, సి.వినోద్‌కుమార్, థామస్, అజిత్‌సింగ్, శ్రీలక్ష్మి, బి.సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
దమ్ మారో దమ్: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ దాసోహం
-
సీఎం సామాన్య పౌరుడిలా మాట్లాడటం హాస్యాస్పదం
రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ సామాన్య పౌరుడిలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి శుక్రవారం కర్నూలులో పేర్కొన్నారు. పార్టీ జెండా పట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు సమైక్యవాదులమని చెప్పడం సరికాదని భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నాయకులు పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజనపై హోంశాఖ ఆధ్వర్యంలో చట్టబద్ధ కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఆంటోనీ కమిటీకి చెప్పేది లేదని భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. -
దేశ వ్యాప్తంగా పెరిగిన ఉల్లి ధరలు