గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్
కొల్లాపూర్‌రూరల్ : కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా గ్రామీణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకింగ్ సేవలకు దేశవ్యాప్తంగా కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మండలంలోని సింగోటంలో స్థానిక సర్పంచ్ వెంకటస్వామి కృషితో ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ విజయవంతంగా ఏడాది పూర్తిచేసుకుంది. గత ఏడాది కలెక్టర్ శ్రీధర్ ప్రోత్సాహంతో గ్రామ పంచాయతీలోని కామన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సమీప గ్రామాల ప్రజలకు డబ్బు ఇబ్బంది లేకుండా ఏడాదిగా దిగ్విజయవంతంగా కామన్ సర్వీస్ సెంటర్‌ను నడుపుతూ నిర్వాహకులు ప్రశంసలందుకుంటున్నారు.
సేవలు ప్రశంసనీయం
కామన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన మూడు నెలల్లోనే దాదాపు దాదాపుగా రూ.రెండు కోట్ల లావాదేవీలు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి సెంటర్‌గా నిర్వాహకురాలు పద్మ జాతీయ స్థాయిలో ప్రశంసలు, అవార్డు అందుకున్నారు. నేటికి సంవత్సరం కావడంతో ఐదు కోట్ల లావాదేవీలను దిగ్విజయవంతంగా పూర్తిచేశారు. ఆధార్‌కార్డు లింకుతో వేలిముద్రలతో కామన్ సర్వీస్ సెంటర్‌లో డబ్బు లావాదేవీలు కొనసాగుతున్నా యి. గ్రామ సమీపంలో ఉన్న ఎత్తం, మై లారం, మైలారం తండా, జావాయిపల్లి, ఎన్మన్‌బెట్ల గ్రామాల ప్రజలు సర్వీస్ సెం టర్‌కు వచ్చి తమ డబ్బులను ఇబ్బం దులు లేకుండా డ్రా చేసుకుంటున్నారు.
సేవలు అందుబాటులో
ఈజీఎస్ గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు, ఎంప్లాయీస్ జీతాలు, వృదా ్ధప్య పింఛన్లు కూడా సర్వీస్ సెంటర్‌లోనే తీసుకుంటున్నారు. నిర్వాహకురాలు గ్రా మంలో వృద్ధులు కార్యాల యానికి రాని తరుణంలో వారి ఇంటి వద్దకు కంప్యూటర్ మిషన్‌ను తీసుకెళ్లి అక్కడే పింఛన్లు ఇస్తూ ఆదర్శంగా నిలిచారు.
సమస్యలు అధిగమిస్తున్నా
సర్వీస్ సెంటర్ నుంచి ప్రజలకు సేవలందించడంలో ఇబ్బందులు వచ్చినా అధిగమించి ముందుకు సాగుతున్నా. ఈ నిర్వహణలో సర్పంచ్ వెంకటస్వామి, సర్వీస్ సెంటర్ స్టేట్, జిల్లా అధికారుల ప్రోత్సాహంతో సజావుగా కొనసాగిస్తున్నా.
– పద్మ, నిర్వాహకురాలు
ఇబ్బంది తప్పింది
గ్రామ స్థాయిలో సర్వీస్‌సెంటర్‌తో ఇబ్బంది లేకుండా ఉంది. గతంలో 8 కిలోమీటర్ల మేర కొల్లాపూర్ పట్టణానికి వెళ్లి బ్యాంకుల ముందు పడిగాపులు కాసి డబ్బులు డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడేవాళ్లం. కామన్ సర్వీస్ సెంటర్‌తో ప్రజలకు సమస్యలు తీరుతున్నాయి.
– రామస్వామి, సింగోటం
కలెక్టర్ ప్రోత్సాహంతో..
కలెక్టర్ శ్రీధర్ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఆయన ప్రోత్సాహంతోనే సర్వీస్ సెంటర్ ప్రారంభించాం. నిర్వాహకురాలికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా గ్రామపంచాయతీ నుంచి పరిష్కరిస్తూ సెంటర్‌ను ముందుకు సాగిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది.
– వెంకటస్వామి, సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment