బిగ్‌బాస్‌ : టార్గెట్‌ దీప్తీ.. గణేశ్‌ అత్యుత్సాహం! | Bigg Boss 2 Telugu Episode 30 Highlights | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 10 2018 11:50 AM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Bigg Boss 2 Telugu Episode 30 Highlights - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌ మేట్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ సోమవారం ఎపిసోడ్‌ అదిరిపోయింది. ఎంత సేపు కృత్రిమ ప్రేమలు కనబర్చుకుంటూ.. హగ్‌లు ఇచ్చుకుంటూ, నటిస్తూ.. పైన పటారం, లోపల లొటారం అన్నట్లు మెలుగుతున్న హౌస్‌ మేట్స్‌కు బిగ్‌బాస్‌ అసలు సిసలు పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో ఇద్దరు మినహా అందరూ త్యాగాలు చేసి ఇతరుల మనసులను గెలుచుకున్నారు. నాలుగో వారం ఎలిమినేషన్‌కు నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా సాగిన ఈ టాస్క్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఓ ఎస్టీడీ బూత్‌ సెటప్‌ వేయించిన బిగ్‌బాస్‌ ఒక్కో కంటెస్టెంట్‌కు ఫోన్‌ చేసి.. ‘మీరు ఈ వారం ఎలిమినేషన్‌కు డైరెక్ట్‌గా నామినేట్‌ అయ్యారు.. ఇది తప్పించుకోవాలంటే తాను చెప్పిన కంటెస్టెంట్‌తో ఇలా చేయించాలి’  అని ఒక్కొక్కరికి ఓ టాస్క్‌ ఇచ్చాడు. 

గత నాలుగు వారాలుగా.. హౌస్‌ మేట్స్‌ ఇష్టా, అయిష్టాలను నోట్‌ చేసిన బిగ్‌బాస్‌ వాటితో అందరిని ఓ ఆట ఆడుకున్నాడు. అయితే ఈ విషయంలో గత వారం ఎలిమినేషన్‌ అంచు వరకు వెళ్లొచ్చిన దీప్తీనే బిగ్‌బాస్‌ టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. అందరికి కొంత పర్వాలేదనే టాస్క్‌లు ఇచ్చినా ఈమెకు మాత్రం కష్టమైన టాస్క్‌ ఇచ్చాడు. అదేంటంటే.. కౌశల్‌ తనకు తాను ప్రతీసారి సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకునేలా నందిని రాయ్‌ ఒప్పించాలి. ఇలా ఆమె కౌశల్‌ను ఒప్పిస్తే దీప్తీ నామినేషన్‌ ప్రక్రియ నుంచి తప్పించుకుంటుంది. కానీ అసలే కౌశల్‌ లాజిక్‌గా ఆలోచించెటోడు. బిగ్‌బాస్‌ వ్యూహం ఏమైనప్పటికీ.. సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకుంటే తనకు తాను ఓటమిని అంగీకరించినట్లవుతుందని.. తను చేయలేనని చెప్పేశాడు. కౌశల్‌ పాయింట్‌ కరెక్టే మరీ. ఏ ఒక్కసారో అంటే త్యాగం చేయొచ్చు. కానీ సీజన్‌ ఆసాంతం చేయడం కష్టమే కదా. దీంతో దీప్తీ డైరెక్ట్‌గా నామినేట్‌ అయింది. అయితే ఇతరుల టాస్క్‌లతో దీప్తీకిచ్చిన టాస్క్‌ పోలిస్తే ఇది చాలా కష్టమైనదే. దీంతో ఆమెకు ఈసారి ఎలిమినేషన్‌ త‍ప్పేలా లేదు.

గణేశ్‌ అత్యుత్సాహం..
హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నామినేట్‌ అవుతున్న కామన్‌ మ్యాన్‌ గణేశ్‌ ఈ టాస్క్‌ విషయంలో అత్యుత్సాహం కనబర్చాడు. ఈసారీ నామినేషన్‌ నుంచి గణేశ్‌ను తప్పుకోవాలంటే.. బాబు గోగినేని తనకు అంతగా ఇష్టం లేని రెండు కొత్తిమీర కట్టలు తినాలనే ప్రతిపాదనను పెట్టాడు బిగ్‌బాస్‌. పాపం బాబు గోగినేని గణేశ్‌ కోసం ఆ రెండు కట్టలు తినేసి ఎలిమినేషన్‌ నుంచి రక్షించాడు. కానీ రోల్‌రైడాను రక్షించడం కోసం గణేశ్ తనకు తాను సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకోని అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఈ విషయం అభిమానులకు కొంత ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. అతను హౌస్‌లో ఉండాలనే ప్రతీసారి అతనికి ఓట్లు వేస్తూ ప్రేక్షకుల మద్దతు తెలిపారు. కానీ అతను వారి మద్దతును, బాబు గోగినేని త్యాగాన్ని పట్టించుకోకుండా రోల్‌రైడాను రక్షించాడు. దీంతో పాటు అతను ఈ వారం మొత్తం పండ్లు మాత్రమే తినాలి. కానీ గణేశ్‌ చర్య అతని అవగాహనరాహిత్యాన్ని తెలియజేసింది. అది బిగ్‌బాస్‌ హౌస్‌ అందులో ఎవరిని నమ్మవద్దనే విషయాన్ని గణేశ్‌ ఇన్నిరోజులైనా గ్రహించలేకపోయాడు. ఇదే రోల్‌రైడా.. గణేశ్‌ ఈ హౌస్‌కు పనికి రాడంటూ ఎన్నోసార్లు నామినేట్‌ చేశాడు. నిజానికి రోల్‌రైడా నామినేట్‌ అయినా అతనికి వచ్చే నష్టం ఏమిలేదు. అతను హౌస్‌లో యాక్టివ్‌గానే ఉంటున్నాడు. కానీ గణేశ్‌ చర్యతో అభిమానులు  హర్ట్‌ అయ్యారా? లేక అతనికి మరో అవకాశం ఇస్తారా? వేచి చూడాల్సిందే.

అడ్డంగా బుక్కైన అమిత్‌..
నాలుగువారాలైనా ఏ గొడవ లేకుండా అందరివాడు అనిపించుకుంటున్న అమిత్‌ ఈసారి అడ్డంగా బుక్కయ్యాడు. హౌస్‌లో అమిత్‌ భానుశ్రీతో కొంచెం క్లోజ్‌గా ఉండటంతో వీరి మధ్య బిగ్‌బాస్‌ చిచ్చు పెట్టేశాడు. భానుశ్రీ ఎలిమినేషన్‌ తప్పించుకోవాలంటే.. అమిత్‌ తన తలపాగాను సీజన్‌ మొత్తం తీసేయాలి, ఇంకోటి ఎప్పుడూ కెప్టెన్సీకి పోటీ చేయకూడదు. దీనికి ముందు భాను వద్దన్నా.. అంగీకరిస్తూ బయటకు వచ్చిన.. అమిత్‌ను తేజస్వీ, సామ్రాట్‌లు ఒకసారి ఆలోచించుకో అని చెప్పడంతో వెనకడుగు వేశాడు. తొలుత భాను ముందు కెప్టెన్సీ చల్‌తా అన్న అమిత్‌ తలపాగా సెంటిమెంట్‌ అని చెప్పాడు. బయటకు వచ్చి తలపాగా పెద్ద విషయం కాదని, గేమ్‌ గెలవాలంటే కెప్టెన్సీ ముఖ్యమని డబుల్‌ గేమ్‌ ఆడాడు.

దీంతో భానుకి ఆగ్రహం వచ్చింది. తేజస్వీ, సామ్రాట్‌ల మాటల ప్రభావంతో అలా చేయడం నచ్చలేదని చెప్పుకొచ్చింది. ఇక బాబు గోగినేని గారి కోసం గీతా మాధురి బిగ్‌బాస్‌ కన్ను పర్మినెంట్‌ ట్యాటు వేయించుకోగా.. గీతామాధురి కోసం తేజస్వీ తన ఫేవరేట్‌ వైట్‌ బ్లాంకెట్‌ను ముక్కముక్కలుగా కత్తిరించింది. తేజస్వినీ కోసం సామ్రాట్‌ క్లీన్‌ షేవ్‌ చేసుకోగా.. సామ్రాట్‌ కోసం తనీష్‌ లెదర్‌ జాకెట్‌ను కలర్‌లో ముంచాడు. తనీష్‌ కోసం దీప్తీ సునయన తన హెయిర్‌ కట్‌ చేసుకోగా.. సునయన కోసం దీప్తి పచ్చి కాకరకాయలు తిన్నది. అమిత్‌ కోసం రోల్‌రైడా ప్రత్యేక కటింగ్‌ స్టైల్‌ చేసుకోగా.. నందిని రాయ్‌ కోసం భాను శ్రీ తన బట్టలన్నీ వదిలేసుకుంది. ఇలా కౌశల్‌, అమిత్‌ మినహా అందరూ టాస్క్‌లను పూర్తి చేసి కంటెస్టెంట్‌లను రక్షించడంతో దీప్తీ, భానుశ్రీలు డైరెక్ట్‌గా నామినేట్‌ కాగా.. గణేశ్‌ సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకున్నాడు. ఇక భానుశ్రీకి తెలంగాణ సెంటిమెంట్‌ కలిసొస్తుండటంతో ఆమె ఇప్పుడే ఎలిమినేట్‌ అయ్యే అవకాశం లేదు. ఇక కామన్‌ మ్యాన్‌ గణేశ్‌ విషయంలో ‍ప్రేక్షకుల నిర్ణయంపైనే దీప్తీ ఎలిమినేషన్‌ ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement