నీవు చేసిన అభివృద్ధి ఎక్కడ? | Common Man Question To Minister Adinarayan reddy In Bike rally | Sakshi
Sakshi News home page

నీవు చేసిన అభివృద్ధి ఎక్కడ?

Published Mon, Apr 30 2018 11:26 AM | Last Updated on Mon, Apr 30 2018 11:26 AM

Common Man Question To Minister Adinarayan reddy In Bike rally - Sakshi

ఎర్రగుంట్లలో మాట్లాడుతున్న మంత్రి ఆదినారాయణరెడ్డి

ఎర్రగుంట్ల : పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఆదివారం టీడీపీ బైక్‌ ర్యాలీ సందర్భంగా మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డిని ఓ సామాన్యుడు నిలదీశారు. అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం కాదు.. నీవు చేసిన అభివృద్ధి ఎక్కడో చూపించాలని అడ్డుతగిలాడు. దీంతో ఆ సామాన్యుడిపై మంత్రి ఆదినారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా..ప్రత్యేక హోదా సాధన కోసం టీడీపీ ఆధ్వర్యంలో మంత్రి ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి ముద్దనూరు మీదుగా ఎర్రగుంట్ల వరకు కార్యకర్తలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

ఈసందర్భంగా ఎర్రగుంట్ల నాలుగు రోడ్డ కూడలిలో బహిరంగ సమావేశం నిర్వహించారు. అక్కడ మంత్రి  మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాటం దీక్షను కూడా చేశారని, హోదా ఇవ్వక పోతే కేంద్రంతో పోరాటానికి సిద్ధమని, ఎర్రగుంట్ల అభివృద్ధికి నిధులు ఎక్కువగా తెప్పించామని చెప్పారు. ఇదే సమయంలో  అక్కడున్న ఓ సామాన్యుడు మంత్రి ప్రసంగాన్ని అడ్డుతగిలి నీవు ఏమి అభివృద్ధి చేశావని మా పట్టణానికి వచ్చావని ప్రశ్నించాడు.  మంత్రి ఆగ్రహంతో మత్తులో అడ్డదిడ్డంగా మాట్లాడే వారి కాళ్లు తీసేయాలన్నారు. దీంతో అక్కడికి వచ్చిన కార్యకర్తలు నాయకులు అవాక్కయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ముసలయ్య, వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ జెక్కు చెన్న క్రిష్ణారెడ్డి, నాయకులు బాల వెంకటరెడ్డి, మురళిలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement