ఆ వ్యక్తి కరెంటు బిల్లు తెలిస్తే హార్ట్ ఎటాకే! | Shocking!! Gurgaon resident gets an electricity bill worth Rs 85 crores | Sakshi
Sakshi News home page

ఆ వ్యక్తి కరెంటు బిల్లు తెలిస్తే హార్ట్ ఎటాకే!

Published Sun, Sep 27 2015 9:07 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

ఆ వ్యక్తి కరెంటు బిల్లు తెలిస్తే హార్ట్ ఎటాకే! - Sakshi

ఆ వ్యక్తి కరెంటు బిల్లు తెలిస్తే హార్ట్ ఎటాకే!

గూర్గావ్: సాధారణంగా కరెంటు బిల్లు చూసిన ప్రతిసారి జేబు తడిమి చూసుకోవడం పరిపాటే. కానీ, హర్యానాలో ఓ వ్యక్తికి వచ్చిన కరెంటు బిల్లు చూస్తే మాత్రం తప్పకుండా హర్ట్ ఎటాక్ రావాల్సిందే. ఎందుకంటే మధ్య తరగతి జీవితాన్ని అనుభవిస్తున్న ఆ వ్యక్తికి విద్యుత్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కరెంటు బిల్లు అక్షరాల రూ.85 కోట్లు. ఈ బిల్లు చూసి ఆ వ్యక్తికి దాదాపు గుండెపోటు వచ్చినంత పనైంది. ఆ కుటుంబ సభ్యులు కూడా అవాక్కయ్యి ఏం చేయాలో అర్థంకాక చివరకు మీడియాను ఆశ్రయించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హెచ్ఎస్ వర్మ అనే గుర్గావ్కు చెందిన వ్యక్తి సాధారణంగా ప్రతినెల కరెంటు బిల్లు రూ.2000 నుంచి 2,500 చెల్లిస్తుంటాడు. అది కట్టడానికే ఓ రకంగా గగనమై పోతుంటుంది. అలాంటిది ఇటీవల ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ కరెంటు బిల్లు పంపించినప్పుడు ఎన్విలప్ తెరిచి చూసిన అతడికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చినంత పనైంది. రూ.85 కోట్ల కరెంటు బిల్లు రావడమేమిటని తాను అంతమొత్తం ఎలా చెల్లించగలనని ఆలోచనలో పడ్డాడు. మీడియాకు తనకు వచ్చిన బిల్లు చేయించి దీని పరిష్కారం ఎలా అని ప్రశ్నించారు. అయితే, ఇలా ఊహించని మొత్తంలో కరెంటు బిల్లు పంపించడం విద్యుత్ శాఖకు పరిపాటే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement