గవర్నర్ నరసింహన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ సాధారణంగా మీడియూతో ఎక్కువగా వూట్లాడరు. కానీ నూతన సంవత్సరం సందర్భంగా ఆయున విలేకరులతో పిచ్చాపాటీగా అరుునా సుదీర్ఘంగా ముచ్చటించారు. తనపై జరిగే ప్రచారాలపైనా స్పందించారు. వివరాలు ఆయున వూటల్లోనే ... ‘‘దేవాలయం, షాపింగ్, సినిమా.. ఎక్కడకు వెళ్లినా నా వల్ల సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగించాలన్నది నా ఉద్దేశం కాదు. దేవాలయూల సందర్శన సందర్భంగా భక్తులెవరికీ అసౌకర్యం కలగకుండా చూడాలని వ్యక్తిగత, భద్రతా సిబ్బందిని ఆదేశించా. 1953లో గగన్‌మహల్ ప్రాంతం అంతా అడవిగా ఉండేది. ఆ అడవిలో నేను హనుమాన్‌ను కనుగొన్నాను. అప్పటినుంచి ఇప్పటివరకు ఎక్కడున్నా ప్రతిరోజూ హనుమాన్ దేవాలయాలకు వెళ్లడం అలవాటుగా మారింది. ఇతరులతో పోలిస్తే నాది అతిచిన్న కార్ల కాన్వాయ్. కేవలం ఐదు వాహనాలు మాత్రమే ఉంటారుు. నేను సామాన్యుడిని. మూడేళ్ల తర్వాత కూడా సామాన్యుడినే. సైకిల్, బస్సు లేదా ఇతర ఏ రవాణా వాహనంలో వెళ్లడానికైనా నేను సిద్ధం. నడిచి కూడా వెళ్తాను. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
గవర్నర్‌గా ఉండడం గొప్పతనం ఏమీ కాదు. భద్రత అవసరం లేదని ప్రభుత్వం భావిస్తే తొలగించవచ్చు. నేను దానిని ఆహ్వానిస్తాను. మీరు నా మాటలు, చిత్రాలను చిత్రీకరిస్తూనే.. ఎవరైనా నన్ను కాల్చడానికి అవకాశం ఉంది. నేనేమీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోలేదు. నాకేమైనా రక్షణ కల్పించారా? రాజ్‌భవన్‌లో ఇంతమంది మధ్య హాయిగా ఉన్నాను. ఇక్కడున్న సామాన్య ప్రజలు, ఆ దేవుడు రక్షిస్తారన్న నమ్మకం నాకుంది.
సామాన్య ప్రజలంతా నా వెంటే ఉన్నారు. హోలీ ఆడటం నాకు ఇష్టం. సామాన్య ప్రజలందరి మాదిరిగా నేను ఆడతా. అప్పుడు కూడా భద్రత ఉండదు. నేను గవర్నర్‌గా వచ్చినప్పుడు హైదరాబాద్‌లో కర్ఫ్యూ అమల్లో ఉంది. వారం రోజుల తరువాత పరిస్థితులు చక్కబడ్డాయి. దేవుని దయతో ఇప్పుడంతా ప్రశాంతంగా ఉంది. ఈ సంవత్సరం కూడా రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. తెలుగు మీడియా సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. కొద్దిగా ఇబ్బంది అరుునా తెలుగు పత్రికలు చదువుతాను. తెలుగు పత్రికల తర్జుమా మొత్తాన్ని చదువుతాను. తెలుగు టీవీ ఛానెల్స్‌లో వార్తలు అన్నీ చూస్తాను.’’ అని గవర్నర్ తెలిపారు.