రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ సామాన్య పౌరుడిలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి శుక్రవారం కర్నూలులో పేర్కొన్నారు. పార్టీ జెండా పట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు సమైక్యవాదులమని చెప్పడం సరికాదని భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఆ పార్టీ నాయకులు పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజనపై హోంశాఖ ఆధ్వర్యంలో చట్టబద్ధ కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఆంటోనీ కమిటీకి చెప్పేది లేదని భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు.