
కృష్ణరాజపురం: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రశ్నించిన కానిస్టేబుల్, స్థానికులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. దినేశ్ అనే వ్యక్తి గురువారం ఉదయం కారులో సర్జాపుర రింగ్‌రోడ్డులో సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ వన్‌వేలో దూసుకెళుతున్నాడు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ భీమశంకర్ కారును ఆపాడు. వన్‌వేలో రావడమే కాకుండా సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తుండడంతో జరిమానా విధించడానికి సిద్ధమయ్యాడు. దీంతో ఆగ్రహించిన దినేశ్ కారులోనున్న బేస్‌బాల్ బ్యాట్‌తో కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. ఇదంతా గమనిస్తున్న స్థానికులు, ఇతర వాహనదారులు దినేశ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని కూడా దూషిస్తూ దాడికి యత్నించాడు. సమాచారం అందుకున్న బెళ్లందూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దినేశ్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment