అందరూ అలా పిలవడంతో చాలా బాధపడేదాన్ని: వరలక్ష్మి | Senior Actress Baby Varalakshmi Opens About His Career | Sakshi
Sakshi News home page

ఆ సీన్లలో నటించినందుకు చాలా అవమానాలు పడ్డా: వరలక్ష్మి

Published Sat, Jan 21 2023 9:37 PM | Last Updated on Sat, Jan 21 2023 9:45 PM

Senior Actress Baby Varalakshmi Opens About His Career - Sakshi

సినీ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్‌ నటిగా వెలుగొందిన వారిలో బేబీ వరలక్ష్మీ ఒకరు. మొదట 1973లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె దాదాపు 30 ఏళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగారు. ఆ తర్వాత సినీ పరిశ్రమకు చాలా దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. బేబీ వరలక్ష్మి తెలుగులో ఎక్కువగా హీరోలకు చెల్లెలి పాత్రలో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో ఎదురైనా పలు చేదు అనుభవాలను వివరించారు. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు తాను బాగా ఏడ్చానని ఆమె తెలిపారు. 

అయితే ఈ రేప్ సీన్స్‌లో నటించిన కారణంగా తాను అనేక అవమానాలకు గురైనట్లు వెల్లడించారు. కొంతమంది నన్ను రేపుల వరలక్ష్మి అని పిలిచినప్పుడు చాలా బాధపడినట్లు తెలిపింది. కొంతమంది సహనటులు అలా పిలిస్తే.. తనకు నచ్చేది కాదని గుర్తు చేసుకుంది. అనంతరం తన అస్తుల విషయాల గురించి కూడా ఆమె స్పందించింది. అయితే తమకు చెన్నైలో తనకు కోట్ల ఆస్తులు ఉన్నాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులకు చాలా తక్కువగా పారితోషికాలు ఉండేవని.. శాలిని అధిక పారితోషికం తీసుకుందని తెలిపింది. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్లతో సమానంగా సినిమాలు చేసిన వరలక్ష్మి.. పారితోషికం భారీగానే తీసుకున్నట్లు పేర్కొంది.

అప్పట్లో మా పారితోషికాలు తన స్కూల్ ఫీజులకు కూడా సరిపోయేవి కాదని బేబీ వరలక్ష‍్మి తెలిపింది. తన తండ్రి స్కూల్ ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందులు పడేవారని  చెప్పుకొచ్చింది. ఆ తర్వాత చెల్లెలు పాత్రలు చేశాక.. పారితోషికాలు బాగా అందుకున్నట్లు తెలిపింది. తనకు కోట్ల ఆస్తులు ఏమీ లేవని మినిమం ఆస్తులు సంపాదించుకొని ప్రస్తుతం సంతోషంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈ తరం హీరోలకు తల్లి పాత్రల్లో నటించాలన్న కోరికను బయటపెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement