వరలక్ష్మికి గాత్రం దేవుడిచ్చిన వరం. గురువులు లేరు... శిక్షణ లేదు. రేడియో ఆమెకుపాటలు నేర్పింది. రేడియో ఆమెచేతపాడించుకుంది. ఆలయాలు ఆమెపాటలకు వేదికనిచ్చాయి. ఇప్పుడామె ముంబయిలో తెలుగు స్వరం.
వరలక్ష్మి నారాయణమ్ పుట్టిల్లు గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ కోడూరు. రేడియోలో వచ్చినపాటలు వింటూపాడడం నేర్చుకున్నారు. అందుకే కాబోలుపాటపాడాలనే అభిలాష ఉన్న వాళ్లను ఏర్చికూర్చి, వాళ్లకుపాడడంలో మెళకువలు నేర్పించి, వారిని ఒక వేదిక మీదకు తీసుకువచ్చిపాడించారు. ఘంటసాల జయంతి రోజున ఘంటసాలపాటలుపాడడానికి మహామహులైన గాయకులు పో టీ పడుతుంటారు. కరతాళ ధ్వనులలో ఉ΄÷్పంగిపో తుంటారు. జనం వారినే చూస్తారు, వారికే హారతులు పడుతుంటారు. కానీ...పాడాలనే తపన ఉన్న అనేక మంది ఆశావహుల ముఖాలను చూశారామె. వారిలో గృహిణులున్నారు. డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్‌లు కూడా ఉన్నారు. ఇలాంటి గానాభిలాషులతో ఘంటసాల జయంతిని ప్రత్యేకంగా నిర్వహించేవారు వరలక్ష్మి. బీఈడీ చేసిన వరలక్ష్మిపాఠాలు చెప్పడంలో స్వరం మాధుర్యం కోల్పోతుందేమోనన్న భయంతోపాటల కోసంపాఠాల ఉద్యోగానికి దూరమయ్యారు.పాటపాడక పో తే తోచదు. ఇప్పుడు ముంబయిలో నివసిస్తున్నప్పటికీ అక్కడి తెలుగు వారిని ఒక చోటకు చేర్చడానికిపాటనే మాధ్యమంగా చేసుకున్నారామె. అరవై ఐదేళ్ల వరలక్ష్మి అరవై ఏళ్ల తనపాటల ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.
► పాట చాలా ఇచ్చింది!
‘‘నేనుపాట కోసం జీవితాన్ని అంకితం చేశాననే ప్రశంస సంతోషంగా ఉంటుంది. కానీపాటకు నేను చేసిన సేవకంటేపాట నాకిచ్చిన గుర్తింపు, గౌరవమే పెద్దది.పాట నాకెంతో ఇచ్చింది. ఐదేళ్ల వయసులో గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఘంటసాల గారితో కలిసి ‘ఆకాశవీథిలో అందాల జాబిలి’పాడాను. నాలో గాయని ఉందని గుర్తించిన స్కూల్ టీచర్‌లు ఏ కార్యక్రమం అయినా నాతోపాడించేవారు. ఇక కాలేజ్‌లో మ్యూజిక్ ఒక సబ్జెక్ట్‌గా తీసుకున్నాను. మా సరోజిని మేడమ్ ఎక్కడ పో టీలు జరిగినా నన్ను పంపేవారు. సినీనటి సుమలత మ్యూజిక్‌లో నా క్లాస్‌మేట్. ఆ పరిచయం ఉన్నప్పటికీ నేను సినిమా గానం వైపు వెళ్లలేదు. రేడియోలో ‘బి గ్రేడ్’ సింగర్‌గా సెలెక్ట్ అయ్యాను. ‘ఈ మాసపుపాట, లలిత గీతాలు’ లెక్కలేనన్నిపాడాను. టీవీలో తరిగొండ వెంగమాట కీర్తనలు, సమస్త దేవతా కీర్తనలనుపాడడంతోపాటు బాణీలు కూడా కట్టాను. ఆరు సొంత ఆల్బమ్‌లు చేశాను. మా రోజుల్లో ఇప్పుడున్నన్ని సౌకర్యాల్లేవు. చాలా మంది మహిళలకు తమపాటలను రికార్డు చేసుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ ఇంట్లో సహకారం లేక ఆశను చంపేసుకునేవారు. అలా నా దృష్టికి వచ్చిన వారందరి చేత సొంత ఆల్బమ్‌లు చేయించగలిగాను. పెళ్లి తర్వాత మా వారి ఉద్యోగరీత్యా మచిలీపట్నంలో ఉన్నంత కాలం నాపాటయానం ఇన్నర్ వీల్ సర్వీస్‌తో కలగలిసిపో యి సాగింది. మా అబ్బాయి చదువు కోసం తిరుపతికి మారాం. అప్పుడు మరో మలుపు తీసుకుంది. తిరుపతిలో ఉన్నంత కాలం ‘ఘంటసాల స్వరాభిషేకం’ కార్యక్రమంలో వందల మందితో అన్నమాచార్య కీర్తనలు, సాధారణపాటలుపాడించాను. వీటన్నింటిలో నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సంఘటన తిరుమలలో జరిగింది.
► గిరులు ప్రతిధ్వనించాయి
తిరుమల రేడియో స్టేషన్ ్రపారంభోత్సవానికి ఆహ్వానించారు. వామన చరిత్రపారాయణం చేశాను. తిరుమలలోనే మరో సంఘటన వేదపాఠశాలలో జరిగింది. మా వదిన తిరుప్పావైపాటలను తెలుగులో రాశారు. ఆపాటలకు నేను ట్యూన్ కట్టాను. ముప్పైవపాట ట్యూన్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తిరుపతిలోనే ఉన్నాను. వేదపాఠశాల నుంచి ఆహ్వానం వచ్చింది. గోవిందనామాలతో మొదలుపెట్టి తిరుప్పావైపాశురాలన్నీపాడాను. అప్పుడు వేదపాఠశాల గురువులు, ఐదు వందల మంది విద్యార్థులు గొంతుకల్లో పలికిన ఆశీర్వచనం తిరుమల గిరుల్లో ప్రతిధ్వనించింది.పాటను కమర్షియల్‌గా మార్చకుండా కళగా గౌరవిస్తే భగవంతుడు తనవంతుగా ఇనుమిక్కిలిగా ఇస్తాడని నమ్ముతాను. రెమ్యూనరేషన్ ఇవ్వలేని వాళ్ల కోసం సొంత ఖర్చులతో వెళ్లిపాడిన సందర్భాలున్నాయి. అందుకే నాకు ఆహ్వానాలు కూడా ఎక్కువే వస్తుంటాయి. తెలుగు నేల మీద ఆలయాలన్నీ నాపాటను ఆహ్వానం పలికాయనే చెప్పాలి. ఆర్కెస్ట్రాతో వెళ్తే తప్పనిసరిగా ఖర్చులుంటాయి. అందుకే చెన్నైకి వెళ్లి ట్రాక్‌లు రికార్డు చేయించుకున్నాను. నేను, నా ఫోన్ ఉంటే చాలు. ఎక్కడికైనా వెళ్లిపాడతాను. దేశవిదేశాల్లోనూ నా స్వరం వినిపించే అవకాశం వచ్చింది.
► మెండైన ప్రోత్సాహం
పాట కోసం నేను టీచర్ ఉద్యోగాన్ని వదులుకుంటానంటే మా వారు రెండోమాటకు తావులేకుండా ్రపో త్సహించారు. ఆయన కెమిస్ట్రీ ప్రోఫెసర్‌గా రిటైరయ్యారు. మా అబ్బాయికి రిలయెన్స్‌లో ఉద్యోగం. తనుపాడతాడు కానీ వృత్తిగా కాదు. మనుమరాళ్లిద్దరికీ మంచి గొంతు ఉంది. వాళ్లకు నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నాను. కానీ పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదన్నట్లు నా దగ్గర క్రమశిక్షణగా కూర్చునిపాడలేకపో తున్నారు. రెండుపాటలుపాడి ‘ఇక ఆడుకుంటాం నానమ్మా’ అని వెళ్లిపో తారు’’ అన్నారామె నవ్వుతూ.
అరవై ఐదేళ్ల వయసులో కూడా ఆమె స్వరంలో మాధుర్యం ఏ మాత్రం తగ్గలేదు. ‘పాట కోసం గొంతు సవరించుకోని రోజు నాకు అనారోగ్యం వచ్చినట్లు. ఇంత వరకు ఒక్కరోజు కూడా ముసుగుపెట్టి పడుకున్నది లేదు.పాటలోనే నా ఆరోగ్యం,పాటతోనే నా జీవితం’ అన్నారు వరలక్ష్మి నారాయణమ్.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment