సాక్షి, విశాఖపట్నం : విశాఖలో సంచలనం రేకెత్తించిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో నిందితుడు అఖిల్ సాయిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అందులో భాగంగా బుధవారం నుంచి విచారణ కొనసాగించారు. ముఖ్యంగా ఒక మైనర్ బాలికను హత్య చేయడం వెనుక అఖిల్ అనుసరించిన అంశాలను పోలీసులు సేకరించారు. నిందితుడు ప్రేమ పేరిట బాలికను నిర్మానుష్య ప్రాంతానికి రప్పించడమే కాక హత్య నేరాన్ని మరొకరిపై నెట్టే ప్రయత్నం జరిగింది. వీటిపై ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. నిందితునిపై త్వరితగతిన శిక్ష పడే రీతిలో పోలీసులు సాంకేతికపరమైన ఆధారాలు ఈ కేసులో సేకరిస్తున్నట్లు తెలిసింది. విశాఖ దీక్ష ఏసీపీ ప్రేమ్ కాజల్ స్వయంగా నిందితుడిని విచారించినట్లు తెలుస్తోంది. కస్టడీ గడువు ముగియడంతో అగనంపూడి ప్రాథమిక వైద్యశాలలో పరీక్షలు నిర్వహించి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. చదవండి: వరలక్ష్మి హత్య కేసులో మరో ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment