Naveen Murder Case: Court Imposed 7 Days Custody For Accused Hari Hara Krishna - Sakshi
Sakshi News home page

Naveen Murder Case: నిందితుడు హరిహరకృష్ణకు వారం రోజుల పోలీస్ కస్టడీ..

Published Thu, Mar 2 2023 5:02 PM | Last Updated on Thu, Mar 2 2023 7:21 PM

7 Days Custody Naveen Murder Case Accused Hariharakrishna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణకు రంగారెడ్డి జిల్లా కోర్టు ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఇతడ్ని హత్యకు సంబంధించి మరిన్ని వివారాలు అడిగేందుకు 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. అందుకు న్యాయస్థానం 7 రోజులు అనుమతి ఇచ్చింది. 

నల్లగొండ ఎంజీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేస్తున్న నవీన్‌ను అతని స్నేహితుడు హరిహరకృష్ణే అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తాను ప్రేమించిన అమ్మాయితో నవీన్ సన్నిహితంగా ఉంటున్నాడని ఈ దారుణానికి ఒడిగట్టాడు. హత్య అనంతరం అతని గుండెను బయటకు తీసి ఫొటోలను అమ్మాయికి పంపాడు.  ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
చదవండి: గవర్నర్ తమిళిసై తీరుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement