
ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లిలోని ఆదివాసీ, గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంపీపీ అరెం వరలక్ష్మి భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు గురువారం లేఖ రాశారు. గ్రామానికి చెందిన రెండేళ్ల బాలికకు సరైన వైద్యం అందకపోవడంతో ఇటీవల మృతి చెందగా, అంబులెన్స్ లేక ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని తీసుకొచ్చారు.
ఈ మేరకు కొత్తమేడేపల్లితో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలోని ఆదివాసీ, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా చూడడంతో పాటు అటవీహక్కుల చట్టాల అమలు తీరును పర్యవేక్షించాలని ఎంపీపీ ఆ లేఖలో రాష్ట్రపతిని కోరారు.