
డాక్టర్ అవతారమెత్తిన పాత నర్సు
హైదరాబాద్: వైద్యురాలినని చెప్పి... ప్రజలను మోసం చేస్తున్న ఓ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ మారుతీ నగర్ పరిధిలోని కంచన్బాగ్ ఏరియాలో గురువారం చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వరలక్ష్మీ అనే మహిళ ప్రజలను బురిడీ కొట్టించి... డాక్టర్గా చలామణీ అవుతుంది.
దీంతో వరలక్ష్మీ నిజంగా వైద్యురాలేనా అని సందేహించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆరా తీయగా వరలక్ష్మి గతంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేసేదని... ఆ అనుభవంతో ఆమె ఏకంగా డాక్టర్ అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తోందన్న పోలీసు విచారణలో తెలింది.