అర్ధాంగిని నరికేశాడు!
కంభం: కట్టుకున్న భార్యను.. భర్త అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన కంభంలో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సంగా వీధిలో నివాసం ఉంటున్న నూనె రమేశ్ ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 12 సంవత్సరాల క్రితం గిద్దలూరు సమీపంలోని సక్రేటపల్లికి చెందిన వర్రామద్దిలేటి కుమార్తె వరలక్ష్మి (30)తో వివాహం జరిగింది. అయితే వీరి కాపురం సజావుగా జరగడంలేదు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. గతంలో కూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుంది. దీంతో కోపం పట్టలేని రమేశ్ తన భార్యను గొడ్డలితో నరకరడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం మారణాయుధాన్ని అక్కడే విసిరేసి పారిపోయాడు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. అర్జున్ (2వతరగతి), అమత (1వ తరగతి) చదువుతున్నారు. విషయం తెలుసుకున్న మార్కాపురం సీఐ బత్తుల శ్రీనివాసరావు, కంభం ఎస్సై రామానాయక్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.