మా మధ్య అది లేదు! | There is no need for any kind of war, aggression and competitiveness between them. | Sakshi
Sakshi News home page

మా మధ్య అది లేదు!

Published Thu, Jun 29 2017 2:24 AM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

మా మధ్య అది లేదు!

మా మధ్య అది లేదు!

తమిళసినిమా: సాధారణంగా మల్టీస్టారర్‌ చిత్రాల్లో ఇద్దరు కథానాయకుల మధ్య ఏదో విషయంలో ఈగో తొంగి చూస్తుంటుంది. అలాంటిది మా మధ్య  ఈర‡్ష్య, పోటీలు లేవని నటుడు మాధవన్‌ అన్నారు. ఈయన విజయ్‌సేతుపతితో కలిసి నటిస్తున్న చిత్రం విక్రమ్‌వేదా. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వైనాట్‌ స్టూడియోస్‌ పతాకంపై శశికాంత్‌ నిర్మిస్తున్నారు.

పుష్కర్‌–గాయత్రిల ద్వయం కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో మాధవన్‌ పోలీస్‌ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గానూ, విజయ్‌సేతుపతి రౌడీగానూ నటిస్తున్నారు. నటి వరలక్ష్మీ గుడిసె ప్రాంత యువతిగా నటిస్తున్నారు. కాగా బుధవారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నటుడు మాధవన్‌ మాట్లాడుతూ తానింత వరకూ చాలా చిత్రాల్లో నటించినా, విజయ్‌సేతుపతితో కలిసి నటిస్తున్న తొలి చిత్రం విక్రమ్‌వేదా అని పేర్కొన్నారు.

తమ మధ్య ఎలాంటి ఈర‡్ష్యగాని, గొడవలుగాని, పోటీతత్వంగాని ఏర్పడలేదన్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాల్లో విజయ్‌సేతుపతి నుంచి చాలా నేర్చుకున్నానన్నారు. తను అభిమానులను కలుసుకోవడం అన్నది చాలా మంచి విషయం అని అన్నారు. ఇక విక్రమ్‌వేదా చిత్రం కమర్షియల్‌ అంశాలతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇందులో విజయ్‌సేతుపతికి తనకు మధ్య గొడవతో మొదలైన స్నేహం గొడవతోనే ముగుస్తుందని మాధవన్‌ తెలిపారు. ఈ సమావేశంలో విజయ్‌సేతుపతి, నటి వరలక్ష్మీశరత్‌కుమార్, దర్శక ద్వయం పుష్కర్‌–గాయత్రి, నిర్మాత శశికాంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement