Vijayesupathi
-
ఎవరీ అందగత్తె?
తమిళసినిమా: ఈ ఫొటోలో యవ్వనవతిగా కనిపిస్తున్న అందగత్తె ఎవరో చెప్పగలరా? చిన్న క్లూ ఇస్తున్నాం. ఆమె మగువ వేషంలో ఉన్న మగాడు. రూప కళ కూడా నానాటికి ఆధునీకతను సంతరించుకుంటోందనడానికిదో మచ్చుతునక. చిత్రాల్లో కథానాయకులు సందర్భాన్ని బట్టి అమ్మాయిల రూపంలోకి మారిపోతుంటారు. అలా ఆడవేషంలో రజనీకాంత్, కమలహాసన్ నుంచి ఈ తరం వారిలోనూ చాలా మంది నటించి అలరించారు. ముఖ్యంగా కమలహాసన్ అవ్వైషణ్ముకి, ప్రశాంత్ ఆన్అళగన్ చిత్రాల్లో ఆడవారికి ఏ మాత్రం తీసిపోని విధంగా అవతారమెత్తి, హావభావాలను పలికించి మెప్పించారు. ఇటీవల నటుడు శివకార్తికేయన్ కూడా రెమో చిత్రంలో అందమైన నర్సుగా మురిపించి విజయాన్ని అందుకున్నారు. మరి ఈ తాజా సుందరి ఎవరో గ్రహించారా? ఎస్. పై ఫొటోలో అందగత్తెలా కనిపిస్తున్నది నటుడు విజయ్‌సేతుపతినే. ఈయనిప్పుడు మంచి రైజింగ్‌లో ఉన్నారు. విజయ్‌సేతుపతి కాల్షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారనే చెప్పవచ్చు. ఇంతకు ముందు అరణ్యకాండం వంటి విమర్శకులను సైతం మెప్పించిన చిత్రాన్ని తెరపై ఆవిష్కరించిన కుమారరాజా తాజాగా విజయ్‌సేతుపతి కథానాయకుడిగా చిత్రం చేయబోతున్నారు. ఇందులో ఆయన హిజ్రాగా నటించనున్నారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా చిత్ర యూనిట్ అందమైన అమ్మాయి రూపంలో ఉన్న విజయ్‌సేతుపతి ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఈ పాత్ర పేరు శిల్ప అట. మరి ఈ శిల్ప పాత్ర అమ్మాయా? లేక ఇప్పటికే ప్రచారంలో ఉన్న హిజ్రానా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఇందులో నటి సమంత కథానాయకిగా నటించనున్నారు. నదియా, దర్శకుడు మిష్కిన్, గాయత్రి, భాగవతి ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సూపర్‌డీలక్స్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి నలన్‌కుమారస్వామి, నలన్శంకర్, మిష్కిన్, కుమారరాజా నలుగురు దర్శకులు కథను తయారు చేశారు. దీనికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని, ఛాయాగ్రహణం, పీఎస్.వినోద్, నీరవ్‌షా అందించనున్నారు. ఈ చిత్రాన్ని టైలర్సుడన్, కినో ఫిస్ట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. -
అందుకే మదురై అమ్మాయినయ్యా!
తమిళసినిమా: ఆ రెండు చిత్రాల్లో రాని గుర్తింపు కరుప్పన్ చిత్రం తెచ్చి పెడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది నటి తాన్యా. ప్రఖ్యాత నటుడు రవిచంద్రన్ మనవరాలైన ఈ యువ నటి శశికుమార్‌కు జంటగా భలే వెళ్లైదేవా చిత్రం ద్వారా హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ఆ చిత్రం ఈ బ్యూటీని చాలా నిరాశపరచింది. ఆ తరువాత అరుళ్‌నిధి సరసన నటించిన బృందావనం చిత్రం ఈమె కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. అయినా తాజాగా మంచి అవకాశాన్ని దక్కించుకుంది. సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్న విజయ్‌సేతుపతికి జంటగా కరుప్పన్ చిత్రంలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి పన్నీర్‌సెల్వం దర్శకుడు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కరుప్పన్ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న తాన్యా మాట్లాడుతూ ఇది మదురై నేపథ్యంలో తెరకెక్కుతున్న గ్రామీణ కథా చిత్రం అని చెప్పింది. ఇందులో తాను అన్భుసెల్వి అనే పాత్రలో నటిస్తున్నానని తెలిపింది. ఈ పాత్ర కోసం మదురై అమ్మాయిగా మారి నటిస్తున్నానని చెప్పింది. ఇందులో విజయ్‌సేతుపతితో కలిసి నటిస్తున్నప్పుడే తనకు సక్సెస్ ఖాయం అని భావించానని చెప్పింది. ఇంతకు ముందు నటించిన రెండు చిత్రాల్లో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకున్నానని, అలాంటిది ఈ కరుప్పన్ చిత్రంలో పాత్ర పూర్తిగా మదురై స్లాంగ్‌లో మాట్లాడడంతో చెన్నై నగరంలో పుట్టి పెరిగిన తాను ఆ యాసలో పర్ఫెక్ట్గా మాట్లాడలేకపోవడంతో డబ్బింగ్ కళాకారిణితో చెప్పిస్తున్నారని తెలిపింది. రెండు చిత్రాల్లో రాని పేరు కరుప్పన్ చిత్రంతో తెచ్చుకుంటాననే నమ్మకం తనకు ఉందని అంది. ఈ చిత్రంతో స్టార్ హీరోయిన్ పట్టికలో చేరిపోతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. -
జుంగా నిర్మాతెవరో తెలుసా..?
తమిళసినిమా: వరుస విజయాలాతో దూసుకుపోతున్న యువ నటుడు విజయ్‌సేతుపతి. ఇటీవల విక్రమ్‌వేదా చిత్రంలో దాదాగా నటించి ఆ చిత్ర సంచలన విజయానికి కారణంగా నిలిచారు. ప్రస్తుతం ఏఎం.నిర్మిస్తున్న కరుప్పన్ చిత్రంలో గ్రామీణ యువకుడి పాత్రలో మరోసారి తన సత్తా చూపడానికి రెడీ అవుతున్నారు. తాజాగా జుంగా అనే మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇంతకు ముందు ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన గోకుల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.వరుస విజయాలాతో దూసుకుపోతున్న యువ నటుడు విజయ్‌సేతుపతి.బాలీవుడ్ బ్యూటీ సాయేషాసైగల్ విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేయనుంది. మరో ముఖ్యపాత్రలో యోగిబాబు నటించనున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు గోకుల్ తెలుపుతూ ఇది విజయ్‌సేతుపతిని యాక్షన్ హీరోగా చూపే కథా చిత్రం అని తెలిపారు. చిత్రం 60 శాతం ఫ్రాన్స్‌లోనూ మిగిలిన భాగాన్ని చెన్నై, తూత్తుకుడి, రామనాథపురంలోనూ చిత్రీకరించనున్నట్లు చెప్పారు. ఇదర్కుదానే ఆశైపట్టాయ్ చిత్రం తరువాత విజయ్‌సేతుపతి మరో చిత్రం కలిసి చేద్దాం అని అన్నారన్నారు. ఇటీవల ఈ జుంగా కథను విజయ్‌సేతుపతికి చెప్పగా పూర్తిగా విన్న తరువాత కొంచెం మౌనం వహించి ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తానని అన్నారన్నారు. వేరే నిర్మాత రెడీగా ఉన్నారని చెప్పినా తానే చేస్తాననడంతో తనకు చాలా సంతోషం కలిగిందన్నారు. ఎందుకంటే ఈ చిత్రం బడ్జెట్ రూ.కోటి దాటుతుందని అన్నారు. ఇప్పుటి వరకూ విజయ్‌సేతుపతి నటించిన చిత్రాలన్నిటికంటే భారీ బడ్జెట్ చిత్రంగా జుంగా ఉంటుందని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఆ నెల చివరిలో ప్రారంభించనున్నట్లు దర్శకుడు గోకుల్ వెల్లడించారు. -
గ్రామీణ నేపథ్యంగా కరుప్పన్
తమిళసినిమా: చిత్రాన్ని ఎలా ప్రమోట్ చేయాలో బాగా తెలిసిన నిర్మాత ఏఎం.రత్నం అని నటుడు విజయ్‌సేతుపతి వ్యాఖ్యానించారు. ఏన్నో సంచలన హిట్ చిత్రాలను నిర్మించిన ఏఎం.రత్నం తాజాగా శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం కరుప్పన్. వరుస విజయాలతో మంచి జోరు మీదున్న నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో ఆయనకు జంటగా నటి తాన్య నటించారు. బాబీసింహ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి రేణుగుంట చిత్రం ఫేమ్ పన్నీర్‌సెల్వమ్ దర్శకుడు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. విజయ్‌సేతుపతి మాట్లాడుతూ రేణుగుంట చిత్రంలోని వేశ్య పాత్రను కూడా ఎంతో ఉన్నతంగా చూపించిన దర్శకుడు పన్నీర్‌సెల్వం అని అన్నారు. ఈ పాత్రను కొంచెం కూడా అశ్లీలంగా చూపించలేదని, అలాగే ఇందులోని ఒక పాటను చాలా చక్కగా తెరకెక్కించారని చెప్పారు. ఇక ఈ చిత్ర నిర్మాత ఏఎం.రత్నం గురించి చెప్పాలంటే ఒక చిత్రానికి ఎలా ప్రచారం చేయాలో అనే యుక్తి తెలిసిన నిర్మాత ఆయనని వ్యాఖ్యానించారు. ఈ చిత్రంలో రెగ్యులర్ ప్రతికథానాయకుడు అవసరం లేకపోయిందన్నారు. ఒక హీరోనే విలన్‌గా నటిస్తే బాగుంటుందని నిర్ణయించుకున్న తరువాత నటుడు బాబీసింహాకు ఈ చిత్రం గురించి తాను చెప్పానన్నారు.ఆయన తనకు మంచి మిత్రుడు కావడంతో ఏమీ మాట్లాడకుండా ఇందులో విలన్‌గా నటించడానికి అంగీకరించారని తెలిపారు.కరుప్పన్ చిత్రంలో ఎద్దుతో పోరాడే సన్నివేశం చోటు చేసుకుంటుందని, అయితే తాను ఎద్దును ముట్టుకోనుకూడా లేదని, ఆ సన్నివేశాలను రియల్ బుల్‌ఫైట్ క్రీడా వీరుల సన్నివేశాలతో ఫైట్ మాస్టర్ రాజశేఖర్ చాలా అద్భుతంగా మ్యాచ్ చేశారని విజయ్‌సేతుపతి తెలిపారు. విజయ్‌సేతుపతి గురించి ముందే చెప్పా ఈ చిత్ర ప్రారంభానికి ముందే విజయ్‌సేతుపతిని కలిసి మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పానని నిర్మాత ఏఎం.రత్నం అన్నారు. ఆ తరువాత విజయ్‌సేతుపతి నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదలై మంచి విజయాలను సాధించాయన్నారు. ఇక కరుప్పన్ చిత్రం గురించి చెప్పాలంటే ఇది సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రం కాదన్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే సహజత్వంతో కూడిన చిత్రంగా ఉంటుందని అన్నారు. ఇందులో హీరోయిన్ కోసం చాలా మందిని అనుకున్నా నటి తాన్య పాత్రకు నప్పడంతో ఆమెను ఎంపిక చేసినట్లు తెలిపారు. హీరో విజయ్‌సేతుపతితో పాటు అందరూ చాలా బాగా నటించారని చెప్పారు. చిత్ర క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుందని నిర్మాత ఏఎం.రత్నం తెలిపారు. -
విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై
తమిళసినిమా: విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేయడానికి బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్ సై అందని తాజా సమాచారం. నటి సాయేషా ప్రయత్నాలు ఫలించాయి. వనమగన్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు ఆ చిత్రం మంచి ప్రశంసలనే అందించింది. అంతే కాదు ఆ చిత్ర విడుదలకు ముందే విశాల్, కార్తీ కలిసి నటించే మల్టీస్టారర్ చిత్రం కరుప్పురాజా వెళ్లైరాజా చిత్రంలో నటించే అవకాశం రావడంతో తన లక్కుకు తెగ సంబరపడిపోయింది భామ. ఇక ఇక్కడ తన కెరీర్‌కు డోకాలేదే నిర్ణయానికి వచ్చేసింది. అయితే ఆ చిత్రం డ్రాప్ అవడంతో ఒక్కసారిగా నీరసించిపోయింది. కాగా ఇటీవల చెన్నైకి వచ్చిన సాయేషా తాను దర్శకుడు విజయ్‌ని కలవడానికే ప్రత్యేకంగా చెన్నైకి వచ్చానని, వనమగన్ చిత్రం సమయంలో ఆయ న తనను ఒక సహోదరుడిగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారని, అందుకే ఆయనకు రాఖీ కట్టడానికి వచ్చానంటూ చాలానే చెప్పేసింది. కాగా అసలు విషయం ఏమిటం టే సాయేషా సైగల్ చెన్నైకి అవకాశాల వేటలో భాగంగానే వచ్చిందన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. మొత్తం మీద తన ప్రయత్నం ఫలించింది. తాజా గా సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్న విజయ్‌సేతుపతికి జంటగా నటించే అవకాశాన్ని సాయేషా దక్కించుకుంది. ఇంతకు ముందు విజయ్‌సేతుపతి హీరోగా ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గోకుల్ తాజాగా అదే హీరోతో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో విజయ్‌సేతుపతి డాన్‌గా నటించనున్నారు. న టి సాయేషా ప్యారిస్‌లో పుట్టి పెరి గిన అమ్మాయిగా నటించనుందట. ఈ చిత్రానికి జంగా అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్ర కథ అధిక భాగం ప్యారిస్ నగరంలో జరుగుతుందట. ప్యారి స్ వెళ్లిన విజయ్‌సేతుపతికి సాయేషాకు ఎలా పరిచయమైంది, అది వారి మధ్య ప్రేమకు ఎలా కారణమైంది? అన్న పలు ఆసక్తికరమైన సన్నివేశాలు జంగా చిత్రంలో చోటు చేసుకుంటాయట. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. -
తిరుట్టుప్పయలే–2 ఫస్ట్‌లుక్ విడుదల
తిమిళసినిమా: తిరుట్టుప్పయలే–2 చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. సుశీగణేశన్ దర్శకత్వంలో తెరకెక్కిన తిరుట్టుప్పయలే సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా తిరుట్టుప్పయలే–2 రూపొందుతున్న విషయం తెలిసిందే. సుశీగణేశన్ చిన్న గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాబీసింహా, ప్రసన్న, అమలాపాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలో ఆడియోను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. నటుడు విజయ్‌సేతుపతి ఆవిష్కరించిన ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు తెలిపారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ చిల్లర దొంగతనాలు చేసుకుంటూ తిరిగే అబ్బాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే స్థాయికి ఎదిగితే ఎలా ఉంటుందనే తిరుట్టుప్పయలే–2 చిత్రం అని తెలిపారు. ఇది తన ఊహకన్నా సమాజంలో జరుగుతున్న సంఘటనలతో సహజత్వంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
మా మధ్య అది లేదు!
తమిళసినిమా: సాధారణంగా మల్టీస్టారర్ చిత్రాల్లో ఇద్దరు కథానాయకుల మధ్య ఏదో విషయంలో ఈగో తొంగి చూస్తుంటుంది. అలాంటిది మా మధ్య ఈర‡్ష్య, పోటీలు లేవని నటుడు మాధవన్ అన్నారు. ఈయన విజయ్‌సేతుపతితో కలిసి నటిస్తున్న చిత్రం విక్రమ్‌వేదా. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వైనాట్ స్టూడియోస్ పతాకంపై శశికాంత్ నిర్మిస్తున్నారు. పుష్కర్–గాయత్రిల ద్వయం కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో మాధవన్ పోలీస్ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గానూ, విజయ్‌సేతుపతి రౌడీగానూ నటిస్తున్నారు. నటి వరలక్ష్మీ గుడిసె ప్రాంత యువతిగా నటిస్తున్నారు. కాగా బుధవారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నటుడు మాధవన్ మాట్లాడుతూ తానింత వరకూ చాలా చిత్రాల్లో నటించినా, విజయ్‌సేతుపతితో కలిసి నటిస్తున్న తొలి చిత్రం విక్రమ్‌వేదా అని పేర్కొన్నారు. తమ మధ్య ఎలాంటి ఈర‡్ష్యగాని, గొడవలుగాని, పోటీతత్వంగాని ఏర్పడలేదన్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాల్లో విజయ్‌సేతుపతి నుంచి చాలా నేర్చుకున్నానన్నారు. తను అభిమానులను కలుసుకోవడం అన్నది చాలా మంచి విషయం అని అన్నారు. ఇక విక్రమ్‌వేదా చిత్రం కమర్షియల్ అంశాలతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇందులో విజయ్‌సేతుపతికి తనకు మధ్య గొడవతో మొదలైన స్నేహం గొడవతోనే ముగుస్తుందని మాధవన్ తెలిపారు. ఈ సమావేశంలో విజయ్‌సేతుపతి, నటి వరలక్ష్మీశరత్‌కుమార్, దర్శక ద్వయం పుష్కర్–గాయత్రి, నిర్మాత శశికాంత్ పాల్గొన్నారు.