విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై | Bollywood beauty Saaisha Saigal to romance with Vijayesupathi | Sakshi
Sakshi News home page

విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై

Published Mon, Aug 28 2017 4:01 AM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM

విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై

విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై

తమిళసినిమా:  విజయ్‌సేతుపతితో రొమాన్స్‌ చేయడానికి బాలీవుడ్‌ బ్యూటీ సాయేషా సైగల్‌ సై అందని తాజా సమాచారం. నటి సాయేషా ప్రయత్నాలు ఫలించాయి. వనమగన్‌ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు ఆ చిత్రం మంచి ప్రశంసలనే అందించింది. అంతే కాదు ఆ చిత్ర విడుదలకు ముందే విశాల్, కార్తీ కలిసి నటించే మల్టీస్టారర్‌ చిత్రం కరుప్పురాజా వెళ్‌లైరాజా చిత్రంలో నటించే అవకాశం రావడంతో తన లక్కుకు తెగ సంబరపడిపోయింది భామ. ఇక ఇక్కడ తన కెరీర్‌కు డోకాలేదే నిర్ణయానికి వచ్చేసింది. అయితే ఆ చిత్రం డ్రాప్‌ అవడంతో ఒక్కసారిగా నీరసించిపోయింది.

కాగా ఇటీవల చెన్నైకి వచ్చిన సాయేషా తాను దర్శకుడు విజయ్‌ని కలవడానికే ప్రత్యేకంగా చెన్నైకి వచ్చానని, వనమగన్‌ చిత్రం సమయంలో ఆయ న తనను ఒక సహోదరుడిగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారని, అందుకే ఆయనకు రాఖీ కట్టడానికి వచ్చానంటూ చాలానే చెప్పేసింది. కాగా అసలు విషయం ఏమిటం టే సాయేషా సైగల్‌ చెన్నైకి  అవకాశాల వేటలో భాగంగానే వచ్చిందన్నది కోలీవుడ్‌ వర్గాల సమాచారం. మొత్తం మీద తన ప్రయత్నం ఫలించింది. తాజా గా సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్న  విజయ్‌సేతుపతికి జంటగా నటించే అవకాశాన్ని సాయేషా దక్కించుకుంది.

ఇంతకు ముందు విజయ్‌సేతుపతి హీరోగా ఇదర్కుదానే ఆశైపట్టాయ్‌ బాలకుమారు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గోకుల్‌ తాజాగా అదే హీరోతో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో విజయ్‌సేతుపతి డాన్‌గా నటించనున్నారు. న టి సాయేషా ప్యారిస్‌లో పుట్టి పెరి గిన అమ్మాయిగా నటించనుందట. ఈ చిత్రానికి జంగా అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్ర కథ అధిక భాగం ప్యారిస్‌ నగరంలో జరుగుతుందట. ప్యారి స్‌ వెళ్లిన విజయ్‌సేతుపతికి సాయేషాకు ఎలా పరిచయమైంది, అది వారి మధ్య ప్రేమకు ఎలా కారణమైంది? అన్న పలు ఆసక్తికరమైన సన్నివేశాలు జంగా చిత్రంలో చోటు చేసుకుంటాయట. ఈ చిత్ర షూటింగ్‌ త్వరలో ప్రారంభంకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement