తిరుట్టుప్పయలే–2 ఫస్ట్‌లుక్‌ విడుదల | Tirupattpayale-2 film First Look Poster was released on Thursday. | Sakshi
Sakshi News home page

తిరుట్టుప్పయలే–2 ఫస్ట్‌లుక్‌ విడుదల

Published Sat, Aug 5 2017 1:20 AM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

తిరుట్టుప్పయలే–2 ఫస్ట్‌లుక్‌ విడుదల

తిరుట్టుప్పయలే–2 ఫస్ట్‌లుక్‌ విడుదల

తిమిళసినిమా: తిరుట్టుప్పయలే–2 చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. సుశీగణేశన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తిరుట్టుప్పయలే సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా తిరుట్టుప్పయలే–2 రూపొందుతున్న విషయం తెలిసిందే. సుశీగణేశన్‌ చిన్న గ్యాప్‌ తరువాత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాబీసింహా, ప్రసన్న, అమలాపాల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.

త్వరలో ఆడియోను విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. నటుడు విజయ్‌సేతుపతి ఆవిష్కరించిన ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోందని దర్శకుడు తెలిపారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ చిల్లర దొంగతనాలు చేసుకుంటూ తిరిగే అబ్బాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే స్థాయికి ఎదిగితే ఎలా ఉంటుందనే తిరుట్టుప్పయలే–2 చిత్రం అని తెలిపారు. ఇది తన ఊహకన్నా సమాజంలో జరుగుతున్న సంఘటనలతో సహజత్వంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. ఈ చిత్రానికి విద్యాసాగర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement