హద్దులు చెరిపేస్తున్న అమలాపాల్‌ | Amala Paul smoking video creates sensation and breaking records | Sakshi
Sakshi News home page

హద్దులు చెరిపేస్తున్న అమలాపాల్‌

Published Mon, Sep 18 2017 4:36 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

హద్దులు చెరిపేస్తున్న అమలాపాల్‌

హద్దులు చెరిపేస్తున్న అమలాపాల్‌

తమిళసినిమా: నటి అమలాపాల్‌ అందాలారబోతలో హద్దులు చెరిపేస్తోంది. దీని గురించి కోలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. మైనా చిత్రంలో పక్కింటి అమ్మాయిగా నటించిన అమలాపాల్‌ ఆ తరువాత కూడా దైవతిరుమగళ్, తలైవా వంటి చిత్రాల్లో గ్లామర్‌ విషయంలో హద్దుల్లోనే ఉంది. ఎప్పుడైతే దర్శకుడు విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుని ఆ తరువాత ఆయన నుంచి విడిపోయిందో అప్పటి నుంచి గ్లామర్‌ విషయంతో ఎల్లలు దాటుతోందంటున్నారు కోలీవుడ్‌ వర్గాలు. ఈ జాణ ధనుష్‌తో నటించిన వీఐపీ–2 చిత్రం ఈ మధ్య విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా తిరుట్టుప్పయలే–2 చిత్రంలో నటిస్తోంది. సుశీగణేశన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్‌ అందాలారబోతలో శ్రుతి మించిందంటున్నారు.

ఈ చిత్రంలోని ఆమె నటించిన గ్లామరస్‌ సన్నివేశాలతో కూడిన వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అందులో నటి అమలాపాల్‌ అరకొర దుస్తులు ధరించి సిగరెట్‌ దమ్మును గట్టిగా పీల్చి ముక్కు ద్వారా పొగను వదిలే దృశ్యాలు సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇవేవీ పట్టించుకోని అమలాపాల్‌ ఇకపై తనది గ్లామర్‌ పయనమే అంటూ నిర్ణయించుకుందట. తమిళంలో పాటు మలయాళంలోనూ నటిస్తున్న ఈ అమ్మడు ముందుముందు ఇంకెంత సంచలనాలకు కేంద్రబిందువు అవుతుందో చూడాలి. అదే విధంగా తిరుట్టుప్పయలే–2 చిత్రంలో అమలాపాల్‌ దమ్ము కొట్టే సన్నివేశాలకు సెన్సార్‌ సభ్యులు తమ కత్తెరకు ఏ మేరకు పని చెబుతారోనన్న చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement